ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ ఆర్.బాలసుబ్రమణియమ్ రచించిన ‘‘పవర్ వితిన్: ది లీడర్‌షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ’’ పుస్తకంపై ప్రధానమంత్రి సంతకం

Posted On: 17 JUL 2024 8:28PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ డాక్టర్ ఆర్.బాల‌సుబ్ర‌మ‌ణియమ్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రచించిన ‘‘ప‌వ‌ర్ వితిన్: ది లీడ‌ర్‌షిప్ లెగసీ ఆఫ్ న‌రేంద్ర మోదీ’’ పుస్తకం నకలుపై సంతకం చేశారు. సమర్థుడైన నాయకుడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవన గమనంలోని విశేషాల కలబోతగా ఈ పుస్తకం రూపొందింది. అసమాన నేతగా ఆయన పయనాన్ని పాశ్చాత్య, భారతీయ ఆలోచనాసులోచనాల దృక్కోణంలో ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. ప్రజాసేవ పథంలో పాదం మోపాలని భావించే వారికి మార్గం చూపే కరదీపికలా ఆయన దీన్ని మలిచారు.

దీనిపై డాక్టర్ ఆర్.బాలసుబ్రమణియన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన సందేశంపై ప్రధానమంత్రి స్పందిస్తూ:

   ‘‘ఈ రోజు డాక్టర్ ఆర్.బాలసుబ్రమణియమ్ గారిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఆయన రచించిన పుస్తక ప్రతిపై సంతకం చేశాను. భవిష్యత్తులోనూ ఆయన రచనా వ్యాసంగం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

***


(Release ID: 2033923) Visitor Counter : 117