ప్రధాన మంత్రి కార్యాలయం
నెదర్లాండ్స్ ప్రధాని పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయనకు ప్రధాని మోదీ అభినందనలు
Posted On:
02 JUL 2024 8:22PM by PIB Hyderabad
నెదర్లాండ్స్ ప్రధాని డిక్ షూఫ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధనం, జల నిర్వహణ, వ్యవసాయం తదితర రంగాల్లో భారత్-నెదర్లాండ్స్ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే దిశగా సంయుక్త కృషికి భారత్ సిద్ధంగా ఉందని శ్రీ మోదీ తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డిక్ షూఫ్ గారికి అభినందనలు. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధనం, జల నిర్వహణ, వ్యవసాయం, రవాణాసహా నవ్య-వర్ధమాన సాంకేతిక రంగాల్లో భారత్-నెదర్లాండ్స్ భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసేదిశగా మీతో సంయుక్త కృషికి మేం సిద్ధంగా ఉన్నాం. @MinPres’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/RT
(Release ID: 2030344)
Visitor Counter : 94
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam