ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

క్రికెట్‌కు రవీంద్ర జడేజా సేవలపై ప్రధాని ప్రశంసలు

प्रविष्टि तिथि: 30 JUN 2024 7:14PM by PIB Hyderabad

   భారత క్రికెటర్ రవీంద్ర జడేజా కొన్నేళ్లుగా ఆటలోని వివిధ విభాగాల్లో ప్రదర్శిస్తున్న ప్రతిభా నైపుణ్యాలు అపూర్వమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. అంతర్జాతీయ టి20 క్రికెట్‌కు ఆల్ రౌండర్ జడేజా వీడ్కోలు ప్రకటించిన నేపథ్యంలో ఈ పోటీల్లో అచ్చెరువొందించే ఎన్నో విన్యాసాలు చేశారని కొనియాడారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

‘‘ప్రియమైన జడేజా @imjadeja మీరు జట్టులో ఆల్‌రౌండర్‌గా అపూర్వంగా రాణించారు. క్రికెట్ ప్రేమికులంతా మీ సొగసైన బ్యాటింగ్, చతురతగల స్పిన్ బౌలింగ్ సహా అసాధారణ ఫీల్డింగ్‌ నైపుణ్యాన్ని సదా గుర్తుంచుకుంటారు. టీ20 క్రికెట్‌లో ఎన్నోసార్లు అద్భుత ప్రదర్శన చేసిన మీకు ధన్యవాదాలు. మున్ముందు మీరు అన్నివిధాలా విజయపథంలో నడవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2029845) आगंतुक पटल : 85
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam