ప్రధాన మంత్రి కార్యాలయం

ఆచార్యలక్ష్మీకాంత్ దీక్షిత్ యొక్క మృతి పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 22 JUN 2024 2:50PM by PIB Hyderabad

ఆచార్య శ్రీ లక్ష్మీకాంత్ దీక్షిత్ యొక్క మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. కాశీ విశ్వనాథ్ ధామ్ పట్ల ఆచార్య శ్రీ లక్ష్మీకాంత్ దీక్షిత్ సమర్పణ భావాన్ని కలిగివుంటూ, రామ ఆలయం యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.

 

ఆచార్య శ్రీ లక్ష్మీకాంత్ దీక్షిత్ ‘కాశీ యొక్క విద్వాన్ పరంపర లో ఒక ప్రసిద్ధ వ్యక్తి’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ ఆ సందేశం లో -

‘‘దేశం లో మూర్ధన్య విద్వాన్ మరియు సాంగవేద విద్యాలయం లో యజుర్వేదాధ్యాపకుడు అయినటువంటి లక్ష్మీకాంత్ దీక్షిత్ గారు ఇక లేరు అన్న దు:ఖదాయకమైన కబురు ను విన్నాను. దీక్షిత్ గారు కాశీ లో విద్వత్ పరంపర లో కీర్తిపురుషుని గా పేరుగాంచారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ను మరియు రామ మందిరాన్ని దేశ ప్రజల కు అంకితం చేసిన సందర్భాల లో ఆయన సాన్నిధ్యం నాకు లభించింది. ఆయన నిష్క్రమణ సమాజానికి పూర్తి చేయలేనటువంటి లోటు.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/ST



(Release ID: 2028166) Visitor Counter : 22