మంత్రిమండలి
azadi ka amrit mahotsav

కేంద్ర రంగ పథకం “నేషనల్ ఫోరెన్సిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎన్‌హాన్స్‌మెంట్ స్కీమ్” (ఎన్ఎఫ్ఐఈఎస్)కు కేంద్ర కేబినెట్ ఆమోదం


క్యాంపస్‌లు, ల్యాబ్‌లు, మౌలిక సదుపాయాల పెంపుదల కోసం రూ.2254.43 కోట్ల ఆర్థిక వ్యయం

Posted On: 19 JUN 2024 8:05PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ సమావేశం నేడు కేంద్ర రంగ పథకం నేషనల్ ఫోరెన్సిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎన్‌హాన్స్‌మెంట్ పథకం (ఎన్ఎఫ్ఐఈఎస్కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 2024-25 నుండి 2028-29 మధ్య కాలానికి మొత్తం అంచనా వ్యయం రూ.2254.43 కోట్లు. ఈ కేంద్ర రంగ పథక ఆర్థిక వ్యయాన్ని హోం మంత్రిత్వ శాఖ తన స్వంత బడ్జెట్ నుండి అందజేస్తుంది.

 

ఈ పథకంలోని కింది భాగాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది:

 

i. దేశంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (NFSU) క్యాంపస్‌ల స్థాపన.

 

 ii. దేశంలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీల ఏర్పాటు.

 

 iii. ఎన్ఎఫ్ఎస్‌యూ దిల్లీ క్యాంపస్‌లో ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం.

 

సాక్ష్యం యొక్క శాస్త్రీయసకాల ఫోరెన్సిక్ పరీక్షల ఆధారంగా సమర్థవంతమైన నిపుణతతో కూడిన నేర న్యాయ వ్యవస్థను అమలు చేయడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. సమర్థవంతమైన నేర న్యాయ ప్రక్రియ కోసం సాక్ష్యాలను సకాలంలోశాస్త్రీయ పరిశీలన అవసరం. అధిక నాణ్యతశిక్షణ పొందిన ఫోరెన్సిక్ నిపుణుల ప్రాముఖ్యతను ఈ పథకం తెలుపుతుంది. సాంకేతికత పురోగతిఅభివృద్ధి చెందుతున్న నేర వ్యక్తీకరణలుపద్ధతులను మెరుగుపరుస్తుంది.

 

7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్షలతో కూడిన నేరాలకు ఫోరెన్సిక్ విచారణను కొత్త నేర చట్టాలలో తప్పనిసరి చేయడం జరిగింది. దీని ద్వారా ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీల పనిభారం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇంకాదేశంలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్ (ఎఫ్‌ఎస్‌ఎల్)లో శిక్షణ పొందిన ఫోరెన్సిక్ సిబ్బందికి  కొరత ఎక్కువగా ఉంది.

 

ఈ అధిక ఆవశ్యకతను తీర్చడానికిజాతీయ ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలలో గణనీయమైన పెట్టుబడిఅభివృద్ధి తప్పనిసరి. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ (ఎన్ఎఫ్ఎస్‌యూ)నూతన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్ (సీఎస్ఎఫ్ఎల్) అదనపు ఆఫ్-క్యాంపస్‌లను ఏర్పాటు చేయడం ద్వారా శిక్షణ పొందిన ఫోరెన్సిక్ సిబ్బంది కొరతను తీరుస్తుంది. ఫోరెన్సిక్ లాబొరేటరీల కేసు లోడ్ / అపరిష్కృత స్థితిని తగ్గిస్తుంది. ప్రభుత్వంతో ఏకీభవిస్తుంది. 90% కంటే ఎక్కువ నేరారోపణ రేటును పొందడం అనే భారత ప్రభుత్వ లక్ష్యంతో ఏకీభవిస్తుంది.

***


(Release ID: 2026869) Visitor Counter : 155