ప్రధాన మంత్రి కార్యాలయం

జి7 సమిట్ సందర్భం లో యుకె ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 14 JUN 2024 5:11PM by PIB Hyderabad

ఇటలీ లోని అపులియా లో జి-7 శిఖర సమ్మేళనం జరుగుతున్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్ డమ్ యొక్క ప్రధాని శ్రీ రుషి సునక్ తో ఈ రోజు న ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాన మంత్రి చరిత్రాత్మకమైన రీతి లో వరుసగా మూడో సారి పదవీ బాధ్యతల ను చేపట్టినందుకు హృదయ పూర్వక శుభాకాంక్షల ను యునైటెడ్ కింగ్ డమ్ యొక్క ప్రధాని శ్రీ రుషి సునక్ తెలియజేశారు. ద్వైపాక్షిక సంబంధాల ను మరింత పటిష్టపరచుకోవడం కోసం ఉభయ నేతలు ఉమ్మడి వచనబద్ధత ను పునరుద్ఘాటించారు.

 

నేతలు రోడ్ మ్యాప్ 2030 యొక్క అమలు ను గురించి చర్చించారు; వారు ఉన్నత స్థాయి లో రాజకీయ సంప్రదింపులు, రక్షణ మరియు భద్రత, వ్యాపారం- ఆర్థిక సహకారం, కీలకమైనటువంటి మరియు ఉన్నత సాంకేతిక విజ్ఞానం రంగాలు మరియు ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం తాలూకు అన్ని రంగాల లో పురోగతి పట్ల సంతోషాన్ని వెలిబుచ్చారు. రెండు దేశాల మధ్య స్వేచ్ఛాయుత వ్యాపార ఒప్పందం సంబంధి సంప్రదింపుల లో నమోదు అయిన పురోగతి పట్ల కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇరువురు నేతలు పరస్పర హితం ముడిపడ్డ ప్రాంతీయ అంశాల ను గురించి మరియు బహుళపార్శ్విక అంశాల ను గురించి కూడా చర్చించారు.

 

వచ్చే నెల లో యునైటెడ్ కింగ్ డమ్ ప్రజలు సాధారణ ఎన్నికల కు సన్నద్ధం అవుతున్నందున ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి తన శుభాకాంక్షల ను తెలియజేశారు.

 

***



(Release ID: 2025440) Visitor Counter : 53