ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జి7 అపులియా సమిట్ లో పాలుపంచుకోవడాని కి ఇటలీ కి బయలుదేరి వెళ్లే కంటే ముందుప్రధాన మంత్రి జారీ చేసిన ప్రకటన

प्रविष्टि तिथि: 13 JUN 2024 5:36PM by PIB Hyderabad

ప్రధాని జియోర్జియా మెలోని గారు ఆహ్వానించిన మీదట, 2024 జూన్ 14 వ తేదీ న జి-7 అవుట్‌రీచ్ సమిట్ లో పాలుపంచుకోవడం కోసం ఇటలీ లో అపులియా ప్రాంతాని కి నేను బయలుదేరి వెళ్తున్నాను.

వరుస గా నా మూడో పదవీకాలం లో జి-7 శిఖర సమ్మేళనం కోసమని ఇటలీ కి ఇదే నా తొలి సందర్శన. ఈ విషయం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. 2021 వ సంవత్సరం లో జి-20 సమిట్ కోసం నేను ఇటలీ కి వెళ్ళడాన్ని నేను స్నేహపూర్ణం గా గుర్తు కు తెచ్చుకొంటున్నాను. ప్రధాని జియోర్జియా మెలోని గారు క్రిందటి సంవత్సరం లో భారతదేశాని కి రెండు సార్లు విచ్చేయడంతో మన ద్వైపాక్షిక కార్యక్రమాల అమలు కు జోరు మరియు విస్తృతి జతపడ్డాయి. భారతదేశం- ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్థిరీకరించుకోవడం కోసం, ఇండియా-పసిఫిక్ ప్రాంతంలోను, మధ్యదరా ప్రాంతంలోను సహకారాన్ని పెంపొందింప చేసుకోవడం కోసం మేము కట్టుబడి ఉన్నాము.

అవుట్ రీచ్ సెశన్ లో చర్చల ను చేపట్టే కాలం లో, ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), శక్తి, ఆఫ్రికా, ఇంకా మధ్యదరా అంశాల పైన దృష్టి ని కేంద్రీకరించడం జరుగుతుంది. భారతదేశం అధ్యక్షతన జరిగిన జి-20 శిఖర సమ్మేళనం తాలూకు ఫలితాలకు మరియు త్వరలో జరుగనున్న జి7 శిఖర సమ్మేళనం పరిణామాలకు మధ్య మరింత అధిక సమన్వయాన్ని తీసుకువచ్చేందుకు మరియు వికాస శీల (గ్లోబల్ సౌథ్) దేశాల కు కీలకం గా ఉన్నటువంటి అంశాల పైన చర్చోపచర్చలను జరిపేందుకు ఇది ఒక అవకాశం గా ఉండగలదు.

శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోనున్న ఇతర నేతల తో భేటీ అవ్వాలని కూడా నేను ఆశ పడుతున్నాను.

 

***


(रिलीज़ आईडी: 2025104) आगंतुक पटल : 581
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Khasi , English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam