ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్థిక మరియుకార్పొరేట్ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి గా పదవీబాధ్యతల ను స్వీకరించిన శ్రీమతినిర్మల సీతారమణ్
ప్రభుత్వం తన పౌరుల కు ‘జీవన సౌలభ్యాని కి’ పూచీ పడడం కోసం పూర్తి స్థాయి లో నిబద్ధురాలై ఉంది, మరి ఈ దిశ లో ఇంకా అనేక చర్యల ను ప్రభుత్వంతీసుకొంటూనే ఉంటుందన్న కేంద్ర ఆర్థిక మంత్రి
Posted On:
12 JUN 2024 10:14AM by PIB Hyderabad
ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి గా పదవీ బాధ్యతల ను శ్రీమతి నిర్మల సీతారమణ్ ఈ రోజు న న్యూ ఢిల్లీ లో స్వీకరించారు.
నార్థ్ బ్లాక్ లో గల కార్యాలయం లో ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ శ్రీ టి.వి. సోమనాథన్ తో పాటు ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోని ఇతర కార్యదర్శులు కూడా శ్రీమతి నిర్మల సీతారమణ్ కు అభినందనల ను తెలిపారు.
కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి గా మరోసారి పని చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు, మరి అదే విధం గా ప్రధాన మంత్రి మార్గదర్శకత్వం లో భారతదేశాని కి, భారతదేశ ప్రజల కు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఆమె తన చిత్తశుద్ధిభరితమైనటువంటి కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.
గడచిన పది సంవత్సరాల లో బలమైన నాయకత్వం మరియు అభివృద్ధి ప్రధాన పరిపాలన చోటుచేసుకొందని శ్రీమతి సీతారమణ్ చెప్తూ, అవి వేరు వేరు రంగాల లో పరివర్తన ప్రధానమైనటువంటి మార్పుల కు చోదక శక్తి గా నిలవడం తో పాటు ఒక పటిష్టమైన మరియు ఆటుపోటుల కు తట్టుకొని నిలువ గలిగిన ఆర్థిక వ్యవస్థ ను నిర్మించాయని పేర్కొన్నారు.
పదవి బాధ్యతల ను స్వీకరించిన అనంతరం కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి కి ప్రస్తుతం అమలవుతున్న విధాన పరమైన అంశాల ను గురించి ఆ మంత్రిత్వ శాఖ లో వివిధ విభాగాల కార్యదర్శులు వివరించారు.
ప్రభుత్వం తన పౌరుల కు ‘జీవించడం లో సౌలభ్యాని కి’ పూచీ పడేందుకు పూర్తి గా కట్టుబడి ఉందని, ఈ విషయం లో మరిన్ని చర్యల ను నిరంతరాయం గా తీసుకొంటూ ఉంటుందని మంత్రి తెలిపారు.
2014 వ సంవత్సరం నుండి చేపట్టిన సంస్కరణ లు కొనసాగుతాయి, ఆ సంస్కరణ లు భారతదేశం యొక్క స్థూల ఆర్థిక స్థిరత్వాని కి మరియు వృద్ధి కి దోహద పడుతాయని కూడా శ్రీమతి నిర్మల సీతారమణ్ అన్నారు. ఇటీవలి కొన్నేళ్ళ లో ప్రపంచ దేశాల లో తలెత్తిన సవాళ్ళ నడుమ భారతదేశం యొక్క ప్రశంసనీయమైనటువంటి వృద్ధి గాథ ను గురించి కూడా ఆమె ప్రముఖం గా ప్రకటిస్తూ, రాబోయే సంవత్సరాల విషయం లో ఒక ఆశాజనకమైనటువంటి ఆర్థిక దృష్టికోణం నెలకొని ఉందన్నారు.
ఎన్‌డిఎ ప్రభుత్వం యొక్క వికాస ప్రధానమైన కార్యక్రమాల ను సరిక్రొత్తదైన ఉత్సాహం తో ముందుకు తీసుకు పోవడం కోసం మరియు ప్రధాన మంత్రి యొక్క ‘వికసిత్ భారత్’ విజను ను సాధించడాని కి అనువైన విధానాల రూపకల్పన కోసం పాటుపడాలని విభాగాలు అన్నింటికి ఆమె విజ్ఞప్తి చేశారు.
‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ అనే అంశాల ను ప్రభుత్వం నమ్ముతోందని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. ఒక బలమైనటువంటి మరియు చైతన్య భరితం అయినటువంటి ఆర్థిక వ్యవస్థ కు పూచీ పడడానికై పరిశ్రమ ప్రముఖులు, నియంత్రణ సంస్థ లు మరియు పౌరుల తో సహా స్టేక్ హోల్డర్స్ అందరి నిరంతర సమర్థన మరియు సహకారం అవసరం అని ఆమె కోరారు.
***
(Release ID: 2024667)
Visitor Counter : 114
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam