సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

సామాజికన్యాయం మరియు అధికారిత శాఖ కేంద్ర మంత్రి గా పదవీబాధ్యతలను స్వీకరించిన డాక్టర్ వీరేంద్ర  కుమార్


సామాజికన్యాయం మరియు అధికారిత శాఖ సహాయ మంత్రి గా పదవీబాధ్యతలను స్వీకరించిన శ్రీ రాందాస్అఠావ్ లె

Posted On: 11 JUN 2024 4:19PM by PIB Hyderabad

సామాజిక న్యాయం మరియు అధికారిత శాఖ కేంద్ర మంత్రి గా డాక్టర్ వీరేంద్ర కుమార్ ఈ రోజు న పదవీబాధ్యతల ను స్వీకరించారు. ఈ మంత్రిత్వ శాఖ యొక్క బాధ్యతలను తనకు అప్పగించినందుకు ప్రధాన మంత్రి కి కృతజ్ఞ‌త‌లను డాక్టర్ కుమార్ వ్యక్తం చేశారు.

 

 

 

ఈ సందర్భం లో, మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రాందాస్ అఠావ్ లె మరియు శ్రీ బి.ఎల్. వర్మలతో పాటు మంత్రిత్వ శాఖ లోని వివిధ విభాగాల అధికారులు కూడా హాజరయ్యారు.

 

 

ఆ తరువాత, ఇంతవరకు మంత్రిత్వ శాఖ యొక్క కార్యసాధనల ను గురించి మరియు అభివృద్ధి చెందిన భారతదేశం (‘వికసిత్ భారత్’) సంకల్పానికి సంబంధించిన భవిష్యత్తు మార్గసూచీ ని గురించి డాక్టర్ కుమార్ సహాయ మంత్రి శ్రీ రాందాస్ అఠావ్ లె తో, ఇంకా శ్రీ బి.ఎల్. వర్మ తో కలసి చర్చించారు.

 

 

సామాజిక న్యాయం మరియు అధికారిత శాఖ సహాయ మంత్రి గా శ్రీ రాందాస్ అఠావ్ లె ఈ రోజు న ఇక్కడ పదవీబాధ్యతల ను చేపట్టారు.

 

ఈ సందర్భం లో ప్రసార మాధ్యమాల వారితో శ్రీ అఠావ్ లె మాట్లాడుతూ సామాజిక న్యాయం మరియు సశక్తీకరణ ల తాలూకు మిశన్ ను సాకారం చేసే దిశ లో తాను కృషి చేస్తూ ఉంటానన్నారు.

 

***



(Release ID: 2024572) Visitor Counter : 25