సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్


పెరుగుతున్న మన దేశ సౌందర్య శక్తి, దాని గొప్ప సాంస్కృతిక నిర్మాణంలో ఉంది: శ్రీ షెకావత్

Posted On: 11 JUN 2024 2:31PM by PIB Hyderabad

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఈరోజు ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ షెకావత్ మీడియాతో మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి, మన దేశంలోను ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయత వైభవాన్ని కాపాడేందుకు, రక్షించడానికి, ప్రోత్సహించడానికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి కృతజ్ఞతలు తెలిపారు.

 

ఇండియా నుండి భారత్‌కు పరివర్తన చెందడంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మనం మన వలసవాద అంగీని తొలగించి, మన అద్భుతమైన సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించడం లో పెద్ద అడుగులు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మన దేశ అభివృద్ధి చెందుతున్న సౌందర్య శక్తి, దాని గొప్ప సాంస్కృతిక నిర్మాణం, కళ, సంగీతం, నృత్యం, వస్త్రం ఇలా అనేక రూపాల్లో ఉందని పేర్కొన్నారు. ‘ఈ అమృత్‌కాల్‌లో దాన్ని బలోపేతం చేయడానికి, వికసిత భారత్‌గా నేయడానికి బలమైన దారంగా మన సంస్కృతిని ఉపయోగించుకుని, కలిసి పని చేద్దాం’ అని మంత్రి తెలిపారు.

 

శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్‌కు స్వాగతం పలికిన సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్, ఇతర సీనియర్ అధికారులు. 

***



(Release ID: 2024509) Visitor Counter : 36