నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఓడరేవులు, షిప్పింగ్, జల రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి సర్భానంద సోనోవాల్‌


మారిటైమ్ అమృత్ కాల్‌ 2047 విజన్ ప్రకారం సమగ్రాభివృద్ధి దిశగా నౌకారంగాన్ని నడిపించేందుకు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల రవాణా మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది: సర్భానంద సోనోవాల్‌

‘‘వికసిత్‌ భారత్‌ సాధించే దిశగా ‘దేశమే ప్రధానం’ అన్న ఆలోచనతో మనకు మార్గనిర్దేశం చేసే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారు’’: సర్భానంద సోనోవాల్‌

Posted On: 11 JUN 2024 6:30AM by PIB Hyderabad

కేంద్రమంత్రి సర్భానంద సోనోవాల్‌ ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా మంత్రిత్వ శాఖ బాధ్యతలను జూన్‌ 10న న్యూఢిల్లీలో స్వీకరించారు. ఆఫీస్‌ బేరర్లు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడిన మంత్రి ఈ దేశ ప్రజలకు సేవ చేయాలనే దృష్టితో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని కోరారు. వికసిత్‌ భారత్‌ గా దేశాన్ని మార్చేందుకు నిబద్ధతతో వ్యవహరిస్తూ.. చివరి వరకూ మంచి పనితీరును కనబరచాలని తన సిబ్బందికి స్పష్టం చేశారు.

‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ఓడరేవులు, షిప్పింగ్‌, జలరవాణా మంత్రిత్వ శాఖ నౌకారంగంలో సమగ్రాభివృద్ధి సాధించి ఆర్థిక శక్తికేంద్రంగా మార్చేందుకు అద్భుతమైన పనితీరు కనబరుస్తోంది. జాతి నిర్మాణంలో భాగంగా దేశమే ప్రధానం అనే భావనతో ముందుకు సాగుతూ వికసిత భారత్‌ లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉండాలి. మా మంత్రిత్వ శాఖ అమృత్‌ కాల్‌ విజన్‌ ప్రకారం నౌకా రంగంలో సాధికారత సాధించేందుకు నిరంతర కృషి చేస్తుంది’’ అని సర్భానంద సోనోవాల్‌ అన్నారు.

***


(Release ID: 2024460) Visitor Counter : 62