ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మళ్లీ ఎన్నిక అయినసందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన అధ్యక్షుడు శ్రీ పుతిన్


భారతదేశం-రశ్యా విశిష్ట మరియు విశేషాధికార యుక్త వ్యూహాత్మకభాగస్వామ్యాన్ని మరింత బలపరచడం కోసం అంగీకారాన్ని వ్యక్తం చేసిన ఇరువురు నేతలు

బిఆర్ఐసిఎస్ కు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతల ను రశ్యా నిర్వహిస్తున్నందుకుప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు

प्रविष्टि तिथि: 05 JUN 2024 10:08PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో రశ్యన్ ఫెడరేశన్ యొక్క అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

 

 

సాధారణ ఎన్నికలలో విజయం సాధించినందుకు ప్రధాన మంత్రి కి హృదయపూర్వక అభినందనల ను అధ్యక్షుడు శ్రీ పుతిన్ వ్యక్తం చేశారు. అలాగే చరిత్రాత్మకమైన మూడో పదవీకాలానికి గాను శ్రీ మోదీ కి శుభాకాంక్షల ను కూడ శ్రీ పుతిన్ తెలియ జేశారు.

 

అన్ని రంగాలలోను భారతదేశం-రశ్యా విశిష్ట మరియు విశేషాధికార యుక్త వ్యూహాత్మక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచడం కోసం కలసి పనిచేస్తూ ఉండేందుకు ఇద్దరు నేత లు అంగీకారాన్ని తెలిపారు.

 

అధ్యక్షుడు శ్రీ పుతిన్ 2024వ సంవత్సరం లో బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) కు అధ్యక్ష బాధ్యతల ను కొనసాగిస్తున్నుందుకు ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను తెలియ జేశారు.

 

ఇద్దరు నేత లు ఒకరి తో మరొకరు సంప్రదింపులు జరుపుకొంటూ ఉండాలని సమ్మతి ని వ్యక్తం చేశారు.

 

***

 

 


(रिलीज़ आईडी: 2023649) आगंतुक पटल : 87
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam