ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మళ్ళీ ఎన్నికైనందుకు అభినందనల ను తెలిపిన ఇజ్‌రాయిల్ యొక్క ప్రధాని


భారతదేశం - ఇజ్‌రాయిల్ సంబంధాల ను దృఢతరం గా మలచడం లో ప్రధాని శ్రీ నెతన్యాహూ అందించిన తోడ్పాటు ను గుర్తు కు తీసుకు వచ్చిన ప్రధాన మంత్రి

ఇద్దరు నేతలు భారతదేశం - ఇజ్‌రాయిల్ వ్యూహాత్మకభాగస్వామ్యాన్ని మరింత గా బలపరచాలన్న వారి యొక్క వచనబద్ధత ను పునరుద్ఘాటించారు

प्रविष्टि तिथि: 06 JUN 2024 9:00PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఇజ్‌రాయిల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడుతూ, శ్రీ నరేంద్ర మోదీ మళ్ళీ ఎన్నికైన సందర్భం లో అభినందనల ను తెలియ జేశారు.

 

భారతదేశం యొక్క ప్రజల పట్ల ఆయన యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలకు మరియు ఆప్యాయత కు గాను ప్రధాన మంత్రి ధన్యవాదాల ను పలుకుతూ, గడచిన కొన్నేళ్ళ లో భారతదేశం-ఇజ్‌రాయిల్ సంబంధాల ను దృఢతరం చేయడం లో శ్రీ నెతన్యాహూ అందించిన తోడ్పాటు ను గురించి ప్రస్తావించారు.

 

నేతలు ఇరువురు భారతదేశం-ఇజ్‌రాయిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అన్ని రంగాల లో మరింతగా బలపరచాలన్న వారి యొక్క నిబద్ధత ను పునరుద్ఘాటించారు.

 

ఇద్దరు నేత లు ఒకరి తో మరొకరు సంప్రదింపులు జరుపుకొంటూ ఉండాలని అంగీకరించారు.


(रिलीज़ आईडी: 2023436) आगंतुक पटल : 141
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam