ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అచ్చం గా సాయుధ బలగాల కోసమే ఉద్దేశించిన ‘టెలి మానస్’సెల్ ను ఏర్పాటు చేయడానికి ఎంఒయు పై సంతకాలు చేసిన ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం ల మంత్రిత్వ శాఖ మరియు రక్షణమంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తం గా సాయుధ దళాల లబ్ధిదారులు అందరికీమానసిక వైద్య సహాయం సంబంధి హెల్ప్ లైన్ గా సేవల ను అందించనున్న ప్రత్యేక ‘టెలిమానస్’ సెల్
2022 అక్టోబరు లోటెలి-మానస్ హెల్ప్ లైన్ ఆరంభం అయిన తరువాత రోజు లో సగటు న 3,500 కాల్స్ వంతున పది లక్షల కు పైగా కాల్స్ ను టెలిమానస్ హెల్ప్ లైన్ అందుకొంది
అన్ని రాష్ట్రాల లో మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లో 51 టెలి మానస్ సెల్స్ పని చేస్తూ ఉన్నాయి
Posted On:
05 JUN 2024 12:21PM by PIB Hyderabad
పుణె లోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ లో రెండు సంవత్సరాల కాలాని కి గాను ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం ల మంత్రిత్వ శాఖ యొక్క జాతీయ టెలిమెంటల్ హెల్థ్ హెల్ప్ లైన్ అయినటువంటి ‘టెలి మానస్’ యొక్క స్పెశల్ సెల్ ను ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టు గా నిర్వహించడం కోసం ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం ల మంత్రిత్వ శాఖ (ఎంఒహెచ్‌ఎఫ్‌డబ్ల్యు) కు మరియు రక్షణ మంత్రిత్వ శాఖ (ఎమ్ఒడి) కు మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు) పై సంతకాలు అయ్యాయి. ఈ ఎంఒయు పై ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం ల మంత్రిత్వ శాఖ యొక్క ఎఎస్ & ఎమ్‌డి ఆరాధన పట్ నాయక్ గారు మరియు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ శ్రీ దళ్ జీత్ సింహ్ లు సంతకాలు చేశారు.
ఈ ప్రత్యేకమైన టెలి మానస్ సెల్ ను ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం ల మంత్రిత్వ శాఖ యొక్క సీనియర్ అధికారుల సమక్షం లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ శ్రీ అనిల్ చౌహాన్, పివిఎస్ఎమ్, యువైఎస్ఎమ్, ఎవిఎస్ఎమ్, ఎస్ఎమ్ మరియు విఎస్ఎమ్ 2023 డిసెంబరు 1 వ తేదీ నాడు పుణె లోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ (ఎఎఫ్ఎమ్‌సి) లో ప్రారంభించారు.
భారతీయ సైన్యం ఎదుర్కొంటున్న అద్వితీయమైన ఒత్తిడుల ను గుర్తిస్తూ, సాయుధ బలగాల లో టెలి- మెంటల్ హెల్థ్ సర్వీసెస్ యొక్క ఆవశ్యకత స్పష్టమవుతున్నది. సాయుధ బలగాలు పనిచేసే వాతావరణం, సాంస్కృతిక పరమైన సవాళ్ళు, ప్రాంతీయ సంఘర్షణల కు సంబంధించిన ప్రత్యేకమైన ఒత్తిడి భరిత అంశాల ను పట్టి చూస్తే జవాను ల మానసిక ఆరోగ్య సంరక్షణకై ఒక ప్రత్యేకమైన విధానం అవసరపడుతుంది. ఇప్పుడు ఈ ఎంఒయు పైన సంతకాలు పూర్తి కావడం ద్వారా సాయుధ దళాల ఉద్యోగుల మరియు వారి కుటుంబ స
భ్యుల మానసిక ఆరోగ్యాన్ని, ఇంకా శ్రేయస్సు ను పరిరక్షించడం పట్ల శ్రద్ధ వహించడం జరుగుతుంది. మరి సాయుధ దళాల లబ్ధిదారుల కు ప్రత్యేకమైన సంరక్షణ నేరు గా అందే సౌలభ్యానికి పూచీపడినట్లు అవుతుంది. అంతేకాక, వారి మానసిక ఆరోగ్యం సంబంధి అవసరాల ను వెంటనే, ప్రభావవంతమైన పద్ధతి లో తీర్చడం సాధ్యపడుతుంది.
ఈ సందర్భం లో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ శ్రీ దళ్ జీత్ సింహ్ మాట్లాడుతూ, సాయుధ దళ సిబ్బంది కోసం మానసిక స్వస్థత సంబంధి కౌన్సెలింగ్ అనే సేవ యొక్క అవసరం చాలా కాలం నుండి ఉండింది, మరి ఇప్పుడు, ఒక ప్రత్యేకమైనటువంటి టెలి మానస్ సెల్ సాయం తో సాయుధ దళ ఉద్యోగుల కు మరియు వారి కుటుంబాల కు కీలకమైన మానసిక స్వస్థత సంబంధి సహాయాన్ని వారం లో ప్రతి రోజు 24 గంటల ప్రాతిపదిక న అందుకోనున్నారు. దీనితో, మానసిక ఆరోగ్యం పరం గా వారికి ఎదురయ్యే ఆందోళనల ను ఎంతో ప్రభావవంతమైన రీతి లో దూరం చేసుకోవడం లో తోడ్పాటు లభించనుంది అని పేర్కొన్నారు.
ఇదే కార్యక్రమం లో, ఎమ్ఒహెచ్ఎఫ్‌డబ్ల్యు యొక్క ఎఎస్ & ఎమ్‌డి ఆరాధన పట్ నాయక్ గారు మాట్లాడుతూ, సాయుధ దళాల లో పని చేసే వారి విషయం లో ప్రత్యేకమైన మానసిక స్వస్థత అవసరాల దృష్టి లో పెట్టుకొని. వారి మానసిక ఆరోగ్య సంబంధి సమస్యల ను తీర్చడం ముఖ్యం అన్నారు.
టెలి మానస్ అనేది డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్థ్ ప్రోగ్రామ్ (డిఎమ్‌హెచ్‌పి) యొక్క డిజిటల్ విస్తృతి అని చెప్పుకోవచ్చును. దీనిలో విస్తృతమైన, ఏకీకృతమైన మరియు అన్ని వర్గాల ను కలుపుకొని పోతూ టెలి మెంటల్ హెల్థ్ సేవల ను వారం లో ప్రతి రోజు 24 గంటల పాటూ అందించడం జరుగుతుంటుంది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్క రాష్ట్రం లో, కేంద్ర పాలిత ప్రాంతం (యుటి) లో మానసిక స్వస్థత పరమైన సహాయత ను సులభం గా పొందడం కోసం 14416 అనే టోల్- ఫ్రీ నంబరు ను అందిస్తున్నది.
ప్రస్తుతం, రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు కలుపుకొని మొత్తం ముప్ఫై ఆరింటి లోను 51 టెలి మానస్ సెల్స్ విధుల ను నిర్వహిస్తూ ఇరవై వేరు వేరు భాషల లో సేవల ను అందిస్తున్నాయి. 2022 అక్టోబరు లో మొదలుపెట్టినప్పటి నుండి చూస్తే, టెలిమానస్ 10 లక్షల కు పైగా టెలిఫోన్ కాల్స్ ను అందుకొంది. టెలి మానస్ రోజూ 3,500 కు పైగా కాల్స్ ను సంబాళిస్తున్నది. ఈ సమాచారాన్ని పట్టి చూస్తే, మానసిక స్వస్థత సంబంధి సేవల కు చెప్పుదగిన డిమాండు ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా, మానసిక స్వస్థత సంబంధి అంశాల ను సమగ్రం గా, అన్ని వర్గాల ను కలుపుకొని పోయేది గా ఉండాలన్న విషయం - మరీ ముఖ్యంగా సాయుధ బలగాల వంటి ప్రత్యేకమైన సందర్భాల లో – ముఖ్యం అని సూచిస్తున్నది.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారిలో ఆర్థిక సలహాదారు డాక్టర్ శ్రీ కె.కె. త్రిపాఠి; హాస్పిటల్ సర్వీసెస్ (సాయుధ దళాలు) డైరెక్టర్ జనరల్ ఎయర్ మార్శల్ సాధన సక్సేన నాయర్ గారు, విఎస్ఎమ్; ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (వైద్య పరిశోధన, ఆరోగ్యం మరియు శిక్షణ)ల అడిశనల్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ శ్రీ ధర్మేశ్; ఆర్మ్ డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (హెల్థ్) డైరెక్టర్ కర్నల్ శ్రీ శుభదీప్ ఘోష్, విఎస్ఎమ్ మరియు రెండు మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు ఉన్నారు.
***
(Release ID: 2022996)
Visitor Counter : 121
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam