భారత ఎన్నికల సంఘం

పోలైన మొత్తం వోటు లు - అయిదో దశ లో రాత్రి 11:30 గంటల వేళ వరకు 60.09 శాతం

Posted On: 20 MAY 2024 11:57PM by PIB Hyderabad

సాధారణ ఎన్నికల యొక్క అయిదో దశ లో పోలైన వోట్ లలో రాత్రి 11:30 గంటల వేళ వరకు చూస్తే మొత్తం వోటు లు సుమారు గా 60.09 శాతం స్థాయి లో నమోదు అయ్యాయి. పోలింగ్ పార్టీలు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తూ ఉంటాయో, ఈ గణాంకాల ను క్షేత్ర స్థాయి లోని అధికారుల ద్వారా నవీకరించడం జరుగుతూ ఉంటుంది. మరి ఇది మొదటి దశ ల మాదిరిగానే విటిఆర్ ఏప్ పైన పార్లమెంటరీ నియోజకవర్గాల (పిసి స్) వారీ (సంబంధిత విధాన సభ నియోజక వర్గాలను కలుపుకొని) నేరు గా అందుబాటులో ఉంచడం జరుగుతుంది.

 

 

 

రాత్రి 11:30 గంటల వేళ వరకు రాష్ట్రం వారీ వోటు ల శాతం అంచనాలు ఈ క్రింది విధం గా

ఉన్నాయి:

క్రమ

సంఖ్య

రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతాలు

పిసి ల సంఖ్య

తరలి వచ్చిన వోటర్‌ల శాతం ఎంతంటే?

1

బిహార్

05

54.85

2

జమ్ము & కశ్మీర్

01

56.73

3

ఝార్‌ఖండ్

03

63.07

4

లద్దాఖ్

01

69.62

5

మహారాష్ట్ర

13

54.29

6

ఒడిశా

05

67.59

7

ఉత్తర్ ప్రదేశ్

14

57.79

8

పశ్చిమ బంగాల్

07

74.65

పైన పేర్కొన్న 8 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు (49 పిసి లు)

49

60.09

 

 

 

ఇక్కడ తెలిపిన గణాంకాలు క్షేత్ర అధికారుల ద్వారా సిస్టమ్స్ లో నమోదు చేస్తున్నటువంటి సమాచారానికి అనుగుణం గా ఉన్నాయి. ఇది స్థూలమైన సరళి ; ఎందుకంటే కొన్ని పోలింగ్ కేంద్రాల (పిఎస్) నుండి గణాంకాలు అందడం లో సమయం పట్టనుంది అంతేకాకుండా ఈ గణాంకాల లో పోస్టల్ బ్యాలెట్ ల సమాచారాన్ని కలపలేదు. ప్రతి ఒక్క పిఎస్ కోసం నమోదు అయినటువంటి వోటు ల అంతిమ వాస్తవిక స్వరూపం పోలింగ్ ముగిసిన అనంతరం పోలింగ్ ఏజెంట్ లు అందరి ద్వారా ఫారమ్ 17సి లో వెల్లడించడం జరుగుతుంది.

 

 

 

***



(Release ID: 2021258) Visitor Counter : 50