భారత ఎన్నికల సంఘం
2024 లోక్‌సభ ఎన్నికల 6వ దశలో భాగంగా పోలింగ్ జరుగుతున్న 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో బరిలో నిలిచిన 889 మంది అభ్యర్థులు
ఆరో విడత ఎన్నికలు జరుగుతున్న 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్‌సభ నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు దాఖలైన 1978 నామినేషన్లు
Posted On:
18 MAY 2024 3:36PM by PIB Hyderabad
2024 లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరవ దశలో పోలింగ్ జరుగుతున్న 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుండి 889 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇందులో జమ్మూ కాశ్మీర్‌లోని వాయిదా పడ్డ స్థానం 3-అనంతనాగ్-రాజౌరీ స్థానం నుండి 20 మంది అభ్యర్థులు ఉన్నారు.
ఈ దశలో ఎన్నికలు జరుగుతున్న 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 1978 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 07 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు(పిసీ 3- జమ్మూ & కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీలో వాయిదా వేసిన పోల్ మినహా) ఆరవ విడత నామినేషన్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ మే 06, 2024. దాఖలు చేసిన అన్ని నామినేషన్ల పరిశీలన తర్వాత 900 నామినేషన్లకు ఆమోదం లభించింది. 3-అనంతనాగ్-రాజౌరిలో ఫేజ్ 3లో మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయి వాటిలో 21 నామినేషన్లు చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించబడ్డాయి.
ఆరో దశ పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌లోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాల నుండి గరిష్టంగా 470 నామినేషన్లు దాఖలయ్యాయి. తర్వాత హర్యానాలో 10 పార్లమెంటు నియోజకవర్గాల నుండి 370 నామినేషన్లు వచ్చాయి. జార్ఖండ్‌లోని 8-రాంచీ పార్లమెంటరీ నియోజకవర్గానికి గరిష్టంగా 70 నామినేషన్లు దాఖలయ్యాయి. తర్వాతి స్థానంలో 69 నామినేషన్లతో ఢిల్లీలోని ఎన్‌సిటిలో 2-నార్త్ ఈస్ట్ ఢిల్లీ నిలిచింది. 6వ దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు సంఖ్య 15గా ఉంది.
2024 లోక్‌సభ ఎన్నికలు 6వ దశకు సంబంధించి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా వివరాలు:
రాష్ట్రం/యూటీ ఆరవ దశలో పీసీలు అందిన నామినేషన్లు చెల్లుబాటైన నామినేషన్లు పోటీలో నిలిచిన అభ్యర్థులు
బీహార్ 8 246 89 86
హర్యానా 10 370 239 223
జమ్మూ కాశ్మీర్* 1 20
జార్ఖండ్ 4 245 96 93
ఢిల్లీ ఎన్‌సిటీ 7 367 166 162
ఒడిశా 6 130 65 64
ఉత్తర ప్రదేశ్ 14 470 164 162
పశ్చిమ బెంగాల్ 8 150 81 79
మొత్తం 58 1978 900 889
*జమ్మూ కాశ్మీర్‌లోని పిసీ 3-అనంతనాగ్-రాజౌరీలో ఫేజ్ 3 నుండి 6వ దశకు వాయిదా పడింది.
***
(Release ID: 2021105)
Visitor Counter : 108
Read this release in:
Malayalam
,
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada