భారత ఎన్నికల సంఘం

2024 వ సంవత్సరం లోక్ సభ ఎన్నికల నాలుగో దశ లో 10 రాష్ట్రాలు/కేంద్ర పాలితప్రాంతాల లో పోటీ చేయనున్న 1717 మంది అభ్యర్థులు


96 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధి లో దాఖలైన 4264 నామినేశన్ పత్రాలు

Posted On: 03 MAY 2024 1:27PM by PIB Hyderabad

2024 వ సంవత్సరం లో లోక్ సభ ఎన్నికల తాలూకు నాలుగో దశ లో 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 1717 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. 96 పార్లమెంటరీ నియోజకవర్గాల (పిసి స్) లో మొత్తం 4264 నామినేశన్ లు దాఖలు అయ్యాయి. నాలుగో దశ నామినేశన్ ల దాఖలు కు చివరి గడువు తేదీ 2024 ఏప్రిల్ 25 గా ఉండింది. దాఖలైన అన్ని నామినేశన్ లను పరిశీలించిన తరువాత, 1970 నామినేశన్ లు చెల్లుబాటు అయ్యేవి గా ఉన్నాయి అని గుర్తించడమైంది.

 

 

నాలుగో దశ లో, తెలంగాణా లోని 17 పార్లమెంటరీ నియోజక వర్గాల కు గరిష్ఠం గా 1488 నామినేశన్ పత్రాలు అందాయి. ఆ తరువాతి స్థానం లో ఆంధ్ర ప్రదేశ్ ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లోని 25 పార్లమెంటరీ నియోజక వర్గాల నుండి 1103 నామినేశన్ లు దాఖలు అయ్యాయి. తెలంగాణ లోని 7-మల్కాజ్‌ గిరి పార్లమెంటరీ నియోజక వర్గం లో గరిష్ఠం గా 177 నామినేశన్ లు అందాయి; అదే రాష్ట్రం లోని 13-నల్గొండ మరియు 14-భువనగిరి లలో చెరి 114 నామినేశన్ పత్రాల వంతున దాఖలు అయ్యాయి. నాలుగో దశ లో ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గాని కి పోటీ పడుతున్న అభ్యర్థుల సగటు 18 మంది గా ఉంది.

 

లోక్ సభ ఎన్నికలు 2024 లో నాలుగో దశ తాలూకు రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం వారీ వివరాలు:

 

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

నాలుగో దశ లో పోలింగ్ జరిగే పిసి ల సంఖ్య

అందిన నామినేశన్ పత్రాలు

పరిశీలన అనంతరం రంగం లో మిగిలిన అభ్యర్థులు

ఉపసంహరణ తరువాత అంతిమంగా బరిలో మిగిలిన అభ్యర్థులు

ఆంధ్ర ప్రదేశ్

25

1103

503

454

బిహార్

5

145

56

55

జమ్ము & కశ్మీర్

1

39

29

24

ఝార్‌ఖండ్

4

144

47

45

మధ్య ప్రదేశ్

8

154

90

74

మహారాష్ట్ర

11

618

369

298

ఒడిశా

4

75

38

37

తెలంగాణ

17

1488

625

525

ఉత్తర్ ప్రదేశ్

13

360

138

130

పశ్చిమ బంగాల్

8

138

75

75

మొత్తం

96

4264

1970

1717

 

 

 

***



(Release ID: 2019702) Visitor Counter : 61