ప్రధాన మంత్రి కార్యాలయం

ఇటలీ యొక్క ప్రధాని జియోర్జియా మెలోని గారి తోమాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ఇటలీ యొక్క విముక్తి దినం సందర్భం లో శుభాకాంక్షల నుతెలిపిన ప్రధాన మంత్రి

ఇటలీ లో జరుగనున్న జి7 శిఖర సమ్మేళనాని కి ఆహ్వాన పత్రం పంపినందుకుధన్యవాదాల ను పలికిన ప్రధాన మంత్రి

వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచుకోవాలనే నిబద్ధతను ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు

వారు పరస్పర హితంముడి పడిన ప్రాంతీయ మరియు ప్రపంచ అంశాల పై ఆలోచనల ను ఒకరికి మరొకరువెల్లడించుకొన్నారు

Posted On: 25 APR 2024 9:03PM by PIB Hyderabad

ఇటలీ యొక్క ప్రధాని జియోర్జియా మెలోని గారి తో ఈ రోజు న టెలిఫోన్ ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు.

విముక్తి దినం యొక్క డెబ్భై తొమ్మిదో వార్షికోత్సవం సందర్భం లో ఇటలీ యొక్క ప్రజల కు మరియు ప్రధాని జియోర్జియా మెలోని గారి కి ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ఇటలీ లోని పుగ్‌లియా లో 2024 జూన్ లో జరుగనున్న జి7 సమిట్ అవుట్ రీచ్ సెశన్స్ లో పాలుపంచుకోవలసిందంటూ ఆహ్వానించినందుకు గాను ప్రధాని జియోర్జియా మెలోని గారి కి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాల ను తెలియ జేశారు. జి20 కి అధ్యక్ష బాధ్యతల ను భారతదేశం నిర్వహించిన కాలం లో అందిన ముఖ్య ఫలితాల ను, ప్రత్యేకించి వికాస శీల (గ్లోబల్ సౌథ్) దేశాల కు సమర్ధన ను అందించడాన్ని ఇటలీ అధ్యక్షత న జరిగే జి7 శిఖర సమ్మేళనం లో మరింతగా ముందుకు తీసుకు పోవాలి అని నేత లు చర్చించారు.

వారు ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరచుకోవడాన్ని కొనసాగించాలి అనే విషయం లో వారి నిబద్ధత ను పునరుద్ఘాటించారు.

ఇద్దరు నేత లు పరస్పర హితం తో ముడి పడి ఉన్న ప్రాంతీయ మరియు ప్రపంచ ఘటన క్రమాల ను గురించి కూడా వారి యొక్క అభిప్రాయాల ను ఒకరి దృష్టి కి మరొకరు తీసుకు వచ్చారు.

***



(Release ID: 2018936) Visitor Counter : 81