భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

2024 సార్వత్రిక ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా శాంతియుతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ర్టాలు / కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, కేంద్రప్రభుత్వ సంస్థలను ఆదేశించిన ఇసిఐ

అక్రమ మద్యం రవాణా, నగదు, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఉచితంగా పంపిణీ చేసే సామగ్రి రవాణానున సమర్థవంతంగా అరికట్టేందుకు అంతర్ రాష్ర్ట, అంతర్జాతీయ సరిహద్దుల్లో గట్టి నిఘా వేయాలని సూచన

Posted On: 03 APR 2024 6:31PM by PIB Hyderabad

లోక్ సభకు 2024 సంవత్సరంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుతంగా, శాంతియుతంగా, ఎలాంటి ప్రలోభాలకు లోను చేయనివిగా నిర్వహించే క్రమంలో భాగంగా విభిన్న ప్రాంతాల్లో శాంతి భద్రతల స్థితిని; అక్రమ కార్యకలాపాల నిరోధానికి అంతర్ రాష్ర్ట, అంతర్జాతీయ సరిహద్దుల్లో పటిష్ఠమైన నిఘా తీరును సమీక్షించేందుకు భారత ఎన్నిలక సంఘం నేడు అన్ని రాష్ర్టాలు / కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో కీలక సమావేశం నిర్వహించింది. ఎన్నికల శాంతియుత నిర్వహణకు కీలకమైన భాగస్వామ్య వర్గాలన్నింటినీ ఒకే వేదిక పైకి తెచ్చి రాష్ర్టాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ఏజెన్సీల మధ్య నిరంతర సహకారం, సమన్వయం సాధించడం ఈ ఉమ్మడి సమీక్షా సమావేశ లక్ష్యం. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రతీ ఒక్క రాష్ర్టం / కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన ప్రత్యేక సమస్యలను సవివరంగా సమీక్షించింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇసిలు శ్రీ జ్ఞానేశ్ కుమార్, శ్రీ సుఖ్ బీర్ సింగ్ సంధు, అన్ని రాష్ర్టాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ఏజెన్సీలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా, ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా నిర్వహించేందుకు తాము కట్టుబడి ఉన్నామని సిఇసి శ్రీ రాజీవ్ కుమార్ ప్రారంభోపన్యాసంలో తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడేందుకు, అందరూ స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనేందుకు వీలుగా అధికారులందరూ సంఘటితంగా, నిరంతరాయంగా కృషి చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రతీ ఒక్క ఓటరు స్వేచ్ఛగా, ఎలాంటి బెదిరింపులకు తావు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని రాష్ర్టాలు / కేంద్రపాలిత ప్రాంతాలు హామీ ఇవ్వాలని ఆయన సూచించారు. అలాగే ఎన్నికలు ఎలాంటి బెదిరింపులకు తావు లేకుండా, స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా నిర్వహిస్తామన్న ‘‘సంకల్పాన్ని’’ అన్ని రాష్ర్టాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్రప్రభుత్వ ఏజెన్సీలు ‘‘కార్యరూపం’’లో పెట్టాలని సిఇసి శ్రీ కుమార్ పిలుపు ఇచ్చారు.

ఇరుగు, పొరుగు రాష్ర్టాలు / కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగాలు మరింత సమన్వయంతో పని చేయడం; అన్ని రాష్ర్టాలు / కేంద్రపాలిత ప్రాంతాలు తగినంతగా సిఏపిఎఫ్ దళాలను రంగంలోకి దించడం; తమ సరిహద్దుల్లోని రాష్ర్టాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్ కు సిఏపిఎఫ్ సిబ్బందిని తరలించేందుకు లాజిస్టిక్ మద్దతు ఇవ్వడం; ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే అవకాశం గల సరిహద్దు ప్రాంతాల్లోని కీలక ప్రదేశాల గుర్తింపు, నిఘా పెంపు; గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగడాన్ని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వంటి కీలక అంశాలన్నింటినీ ఈ సమావేశంలో చర్చించారు. మాదక ద్రవ్యాలు, మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్థాల వంటి  నిషిద్ధ వస్తువులు అంతర్జాతీయ సరిహద్దుల గుండా రవాణా కావడాన్ని నిరోధించేందుకు గట్టి నిఘా వేయాల్సిన అవసరం ఉన్నదని కమిషన్ నొక్కి చెప్పింది. సరిహద్దుల ద్వారా మద్యం, నగదు అక్రమంగా రవాణా అయ్యేందుకు అవకాశం గల ప్రవేశ, నిర్గమ ప్రాంతాలను గుర్తించాలని; కొన్ని రాష్ర్టాల్లో గంజాయి సాగును నిలువరించాలని కూడా కమిషన్ ఆదేశించింది.

అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్, మహారాష్ర్ట వంటి 11 రాష్ర్టాల్లోని సంక్లిష్టమైన ప్రాంతాలకు పోలింగ్  బృందాలను తరలించేందుకు భారత వైమానిక దళం, పౌర విమానయాన శాఖ మద్దతు చర్యలను కూడా కమిషన్ సమీక్షించింది. దేశంలోను, ప్రత్యేకించి చత్తీస్ గఢ్, జమ్ము కశ్మీర్ వంటి రాష్ర్టాల్లోను రాజకీయ కార్యకర్తలు, అభ్యర్థులకు తగినంతగా భద్రత కల్పించే చర్యలపై కూడా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ లో ఇటీవల జరిగిన దౌర్జన్యకర, సంక్షుభిత వాతావరణం నేపథ్యంలో ఎన్నికల శాంతియుత నిర్వహణపై వాటి ప్రభావం గురించి కూడా సమీక్షించారు. అంతర్గతంగా ఇతర ప్రాంతాలకు పారిపోయి తల దాచుకున్న వారు కూడా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కమిషన్ కోరింది.

ఈ సమావేశం సందర్భంగా ఈ దిగువన పొందుపరిచిన విధంగా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

శాంతి, భద్రతల సంబంధిత చర్యలు

1.    గట్టి నిఘా కోసం అంతర్జాతీయ, అంతర్ రాష్ర్ట సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి.

2.     నేరస్థులు, సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన గూఢచర్య సమాచారం సరిహద్దు రాష్ర్టాల మధ్య మార్పిడి చేసుకోవాలి

3.    బోగస్ ఓటింగ్ ను నివారించేందుకు చివరి 48 గంటల కాలంలో  అంతర్ రాష్ర్ట సరిహద్దుల మూసివేయాలి.

4.    సరిహద్దు జిల్లాల విషయంలో నిరంతర అంతర్ రాష్ర్ట సమన్వయ సమావేశాలు నిర్వహించుకుంటూ ఉండాలి.

5.    అంతర్ రాష్ర్ట సరిహద్దుల్లో ఆయా రాష్ర్టాల పోలీసు యంత్రాంగం గస్తీ ముమ్మరం చేయాలి.

6.    వ్యూహాత్మక ప్రదేశాల్లో సరిహద్దు రాష్ర్టాల సమన్వయంతో అదనపు నకాలు ఏర్పాటు చేయాలి.

7.    పోలింగ్ రోజున అంతర్ రాష్ర్ట సరిహద్దులు మూసివేయాలి.

8.    సరిహద్దు రాష్ర్టాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎక్సైజ్ కమిషనర్లు పర్మిట్ల నిజాయతీని నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. అన్ని రాష్ర్టాల్లోను, ప్రత్యేకించి సరిహద్దు రాష్ర్టాల్లోను మద్యం దుకాణాలపై ఆకస్మిక దాడులు చేస్తూ ఉండాలి.

9.    లైసెన్స్ డ్ ఆయుధాలను కూడా సకాలంలో స్వాధీనం చేసుకోవాలి; నాన్ బెయిలబుల్ వారెంట్లను సకాలంలో వినియోగించాలి.

10.  ఎన్నికల సంబంధిత నేరాల్లో భాగస్వాములై తప్పించుకు తిరిగే వారు, చారిత్రకంగా రౌడీ షీట్లున్న వారు, నేరస్థులపై సకాలంలో చర్యలు తీసుకోవాలి.

11.  బెదిరింపు అవకాశాలను పరిగణనలోకి తీసుకుని రాజకీయ కార్యకర్తలు/ అభ్యర్థులకు అవసరమైన భద్రత కల్పించాలి.

వ్యయ పర్యవేక్షణ

1.    అంతర్ రాష్ర్ట సరిహద్దులు, అంతర్జాతీయ సరిహద్దుల ద్వారా అక్రమ మద్యం, నగదు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలి.

2.    చెక్ పోస్టులన్నింటిలోనూ సిసిటివిలు ఏర్పాటు చేయడం ద్వారా పర్యవేక్షణ పటిష్ఠం చేయాలి.

3.    పోలీసులు, ఎక్సైజ్, రవాణా, జిఎస్ టి, అటవీ శాఖలు ఉమ్మడి తనిఖీ, నిఘా కార్యకలాపాలు చేపట్టాలి.  

4.    హెలీపాడ్ లు, విమానాశ్రయాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో నిఘా పటిష్ఠం చేయాలి.

5.    అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు తరలించే ముఠా నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దేశవాళీ మద్యం రవాణాను కట్టడి చేయాలి. ఇందుకోసం ఫార్వర్డ్, బ్యాక్ వర్డ్ లింకేజిలు ఏర్పాటు చేసుకోవాలి.

6.    మద్యం, నగదు, మాదక ద్రవ్యాలు, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉచితంగా పంపిణీ చేసే వస్తువుల కీలక రవాణా ప్రదేశాలన్నింటినీ గుర్తించాలి.

కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలు

1.    ఇండో-మయన్మార్ సరిహద్దులో అస్సాం రైఫిల్స్; నేపాల్ సరిహద్దులో ప్రత్యేకించి నేపాల్ తో పోరస్ సరిహద్దు గల ప్రదేశాల్లో ఎస్ఎస్ బి సిబ్బంది; భారత-బంగ్లాదేశ్ సరిహద్దు, పశ్చిమ ప్రాంత సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ సిబ్బంది; ఇండో-చైనా సరిహద్దులో ఐటిబిపి దళాలు; రాష్ర్టాలకు చెందిన కోస్తా ప్రాంతాల్లో భారత సరిహద్దు గస్తీ దళం గట్టి నిఘా వేయాలి.

2.    రాష్ర్ట పోలీసు యంత్రాంగం, సిఏపిఎఫ్ సిబ్బందితో అస్సాం రైఫిల్స్ నిరంతరం ఉమ్మడి భద్రతా సమన్వయ సమావేశాలు నిర్వహించాలి.

3.    నేపాల్, బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా ఎస్ఎస్ బి గట్టి నిఘా వేయాలి. ప్రత్యేకించి పోలింగ్ కు 72 గంటల ముందు నిఘాను మరింత పటిష్ఠం చేయాలి.

4.    కొత్తగా నియమితులైన సిఏపిఎఫ్ సిబ్బందికి ఆయా ప్రాంతాలపై అవగాహన ఏర్పడేందుకు వీలుగా పౌర యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపట్టాలి.

5.    రాష్ర్ట పోలీసుల సమన్వయంతో ఉమ్మడి చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి.  

రాష్ర్టాలు / కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డిజిపిలు, ప్రిన్సిపల్ కార్యదర్శులు (హోమ్), ప్రిన్సిపల్ కార్యదర్శులు (ఎక్సైజ్), ముఖ్య ఎన్నికల అధికారులు, అన్ని రాష్ర్టాలు / కేంద్రపాలిత ప్రాంతాల నోడల్ అధికారులు; సరిహద్దు భద్రతా దళం, అస్సాం రైఫిల్స్, సశాస్ర్త సీమా బల్, ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసులు, కోస్తా గస్తీ దళం వంటి కేంద్ర ఏజెన్సీల అధిపతులు; సిఆర్ పిఎఫ్, సెంట్రల్ సిఏపిఎఫ్ అధిపతులు, ఎంహెచ్ఏ అదనపు కార్యదర్శి; రక్షణ, రైల్వే మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.  

(Release ID: 2017935) Visitor Counter : 139