భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

2024 లోక్ సభ ఎన్నికలలో పోలింగ్ శాతం పెంచడానికి ఎంపిక చేసిన జిల్లాల, డిఈఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఎన్నికల సంఘం ' తక్కువ ఓటింగ్ శాతం పై సదస్సు' మొదటిసారిగా నిర్వహణ


లక్ష్య సాధనలో భాగంగా 266 పట్టణ మరియు గ్రామీణ పీసీల ఓటింగ్ శాతం
పెంచే ప్రణాళిక అమలుకు సన్నద్ధం

ఎన్నికలలో పాల్గొనేందుకు ఓటర్లు స్వయం ప్రేరేపణతో, ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వచ్చేలా వాతావరణం కలిపించాలని మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సీఈసీ రాజీవ్ కుమార్ ఆదేశం

Posted On: 05 APR 2024 4:37PM by PIB Hyderabad

2024లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు, భారత ఎన్నికల సంఘం (ఈసిఐ) గత సార్వత్రిక ఎన్నికల్లో తక్కువ పోలింగ్‌ శాతం చరిత్ర కలిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల్లో (పీసీలు) ఓటింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నాలను వేగవంతం చేసింది. కొత్తదిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో ఈరోజు జరిగిన 'తక్కువ పోలింగ్ శాతం సదస్సు'లో,  తక్కువ పోలింగ్ఎం శాతం ఉన్న పట్టణ, గ్రామీణ పీసీలలో ప్రధాన నగరాల మునిసిపల్ కమీషనర్లు, బీహార్, ఉత్తరప్రదేశ్‌ల నుండి జిల్లా ఎన్నికల అధికారులను (డిఈఓ) ఎంపిక చేసి, ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఒక రోడ్ మ్యాప్ ని  రూపొందించారు. ఈ సమావేశానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు శ్రీ జ్ఞానేష్ కుమార్, శ్రీ సుఖ్బీర్ సింగ్ సంధు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఓటరు ఉదాసీనతకు సంబంధించిన బుక్‌లెట్‌ను కమిషన్‌ విడుదల చేశారు.

బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, తెలంగాణ, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ వంటి 11 రాష్ట్రాలు/యుటీలు 2019 లోక్ సభకు జరిగిన సాధారణ ఎన్నికలలో జాతీయ సగటు 67.40 శాతం కంటే తక్కువ ఓటింగ్‌ జరిగింది. 2019లో జాతీయ సగటు కంటే తక్కువ ఓటర్లు ఉన్నట్లు గుర్తించిన 11 రాష్ట్రాల్లోని మొత్తం 50 గ్రామీణ పీసీలలో, 40 పీసీలు ఉత్తరప్రదేశ్ (22 పీసీలు), బీహార్ (18పీసీలు) ఉన్నాయి. యుపిలో, 51- ఫుల్‌పూర్ పిసిలో అత్యల్పంగా 48.7 శాతం పోలింగ్ నమోదైంది, బీహార్‌లో 29-నలంద పిసిలో అత్యల్పంగా 48.79 శాతం పోలింగ్ నమోదైంది.

 

మున్సిపల్ కమీషనర్లు,డిఈఓలను ఉద్దేశించి సీఈసీ శ్రీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, మొత్తం 266 పార్లమెంటరీ నియోజకవర్గాలు (215 గ్రామీణ & 51 అర్బన్) తక్కువ ఓటింగ్ నమోదయ్యాయని, అందువల్ల సంబంధిత మున్సిపల్ కమీషనర్లు, డిఈఓలు, రాష్ట్ర సీఈఓలను ఈరోజు పిలిపించామని తెలిపారు. క్యూ నిర్వహణ, రద్దీగా ఉండే ప్రాంతాల్లో షెల్టర్ పార్కింగ్ వంటి పోలింగ్ స్టేషన్ల వద్ద సౌకర్యాన్ని కల్పించే త్రిముఖ వ్యూహాన్ని ఆయన నొక్కి చెప్పారు; అలాగే లక్ష్య వ్యాప్తి, కమ్యూనికేషన్, పోలింగ్ స్టేషన్‌లకు వచ్చేలా ప్రజలను ఒప్పించేందుకు ఆర్డబ్ల్యూఏలు, స్థానిక ప్రముఖులు, యువ ప్రభావశీలులు వంటి కీలకమైన వాటాదారులను ఈ ప్రయత్నంలో భాగస్వాములను చేయాలన్నారు. 

మెరుగైన భాగస్వామ్యం, ప్రవర్తన మార్పు కోసం బూత్ వారీగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఈసీ కుమార్ వారిని ఆదేశించారు. అన్ని ఎంసిలు, డిఈఓ లు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వేర్వేరు వ్యూహాలను సిద్ధం చేయాలని, విభిన్న ప్రజల కోసం తదనుగుణంగా ప్రణాళికలు చేయాలన్నారు. "అందరికీ ఒకే పద్ధతి " అనే విధానం ఫలితాలను ఇవ్వదని ఆయన నొక్కి చెప్పారు. ప్రజాస్వామ్య ఉత్సవాల్లో పాల్గొని ఓటర్లు సగర్వంగా పాల్గొనేలా అధికారులు వ్యవహరించాలని సీఈసీ కుమార్ కోరారు. ప్రజలు స్వయం చైతన్యంతో ఓటు వేసేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

 

ఈసిఐ, ముఖ్య వాటాదారుల మధ్య సహకార ప్రయత్నమైన ఈ సమావేశం, ఓటరు ఉదాసీనతను పరిష్కరించడానికి, లాజిస్టికల్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఓటింగ్ శాతం పెంచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంపై దృష్టి సారించింది. పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ నిర్వహణను ఆప్టిమైజ్ చేయడం, ఎత్తైన భవనాల్లో ఓటింగ్‌ను సులభతరం చేయడం, ప్రభావవంతమైన సిస్టమాటిక్ ఓటర్ల విద్య,  ఎన్నికల భాగస్వామ్య (స్వీప్) ప్రోగ్రామ్‌ను ప్రభావితం చేయడం వంటి క్లిష్టమైన అంశాలపై చర్చలు జరిగాయి.

భాగస్వామ్యానికి, సమ్మేళనానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, మున్సిపల్ కమిషనర్లు, డిఈఓలు చొరవకు చురుకుగా సహకరించాలని ఈసీ కోరింది. ఓటర్ల సంఖ్య పెరగడానికి పట్టణ నిర్దిష్ట అడ్డంకులు గుర్తించారు. లక్ష్యంగా నగర నిర్దిష్ట జోక్యాలు ప్రణాళిక చేశారు. ఈ దృక్కోణానికి అనుగుణంగా, ఈసీ, స్వీప్ కింద వినూత్నమైన ఓటరు అవగాహన ప్రచారాల శ్రేణిని వివరించింది. 

  • అవసరమైన ఎన్నికల సందేశాలతో అలంకరించబడిన ప్రజా రవాణా, పారిశుధ్య వాహనాలను వినియోగించడం 
  • విస్తృత వ్యాప్తి కోసం ఓటరు అవగాహన సందేశాలను, యుటిలిటీ బిల్లుల్లో చేర్చడం.
  • రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (ఆర్డబ్ల్యూఏ లు), ఓటరు అవగాహన ఫోరమ్‌లతో కలిసి పని చేయడం.
    పార్కులు, మార్కెట్‌లు, మాల్స్ వంటి ప్రసిద్ధ బహిరంగ ప్రదేశాలలో సమాచార సెషన్‌లను నిర్వహించడం.
  • పార్కులు, మార్కెట్‌లు మరియు మాల్స్ వంటి ప్రముఖ బహిరంగ ప్రదేశాలలో సమాచార సెషన్‌లను నిర్వహించడం. 
  • ఓటరు ఆసక్తిని రేకెత్తించడానికి మారథాన్‌లు, వాక్‌థాన్‌లు, సైక్లోథాన్‌ల వంటి ఆకర్షణీయమైన ఈవెంట్‌లను నిర్వహించడం
  • ఓటరు విద్యా సామగ్రిని వ్యాప్తి చేయడం. విస్తృతమైన ఓటరు వ్యాప్తి, కోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను  ఉపయోగించడం.

ఈ సమావేశానికి ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే, థానే, నాగ్‌పూర్, పాట్నా సాహిబ్, లక్నో, కాన్పూర్ మునిసిపల్ కమిషనర్‌లతో పాటు బీహార్, ఉత్తరప్రదేశ్‌లోని ఎంపిక చేసిన జిల్లా ఎన్నికల అధికారులు, బీహార్ సీఈఓ, ఉత్తరప్రదేశ్ సీఈఓ, మహారాష్ట్ర సీఈఓ, ఢిల్లీ సీఈఓ కూడా సమావేశానికి హాజరయ్యారు. కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్ వంటి 7 రాష్ట్రాల సీఈఓలు వర్చువల్‌గా పాల్గొన్నారు. 

నేపథ్యం:

2019లో లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల్లో సుమారు 29.7 కోట్ల మంది అర్హతగల ఓటర్లు ఓటు వేయలేదు. కాబట్టి ఈ పరిస్థితిని మార్చడానికి ఎన్ని కీలకమైన చర్యలు చేపట్టాలో తీవ్రత అర్థం అవుతుంది. అంతేకాకుండా, ఇటీవల ఎన్నికలు జరిగిన వివిధ రాష్ట్రాలలో ఎన్నికల ప్రక్రియ పట్ల పట్టణ ఓటర్లు ఎంత ఉదాసీనంగా వ్యవహరించారో స్పషం అవుతుంది. అందువల్ల ఏ విధంగా సమస్యను లక్ష్యంగా చేసి పనిచేయాలో, ఉమ్మడి ప్రయత్నాలు ఎంత అవసరమో తెలుస్తుంది. 

 

 

 

లోక్‌సభకు 2019 సాధారణ ఎన్నికలలో అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైన 50 స్థానాలు... 17 నగరాల ఉదాసీనత వైఖరికి అద్దం పడుతున్నాయి. ఇది దురదృష్టకరం. ఈ ధోరణి మెట్రోపాలిటన్‌లు, ప్రధాన నగరాల్లో ప్రతిబింబిస్తోంది. గత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. సాధారణ గుజరాత్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు 2022లో, పారిశ్రామిక సంస్థలను కలిగి ఉన్న కచ్ఛ్ జిల్లాలోని గాంధీధామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యల్పంగా 48.14 శాతం పోలింగ్ నమోదైంది, 2017 లో గత ఎన్నికల కంటే దాదాపు 6 శాతం క్షీణత, కొత్త కనిష్ట స్థాయిని నమోదు చేసింది. అదేవిధంగా, హిమాచల్ ప్రదేశ్ 2022 సాధారణ ఎన్నికల్లో సిమ్లా జిల్లాలోని (రాష్ట్ర రాజధాని) సిమ్లా అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సగటు పోల్ 75.78 శాతానికి గాను అత్యల్పంగా 63.48 శాతం పోలింగ్ నమోదు అయింది. సూరత్‌లోని పట్టణ అసెంబ్లీ నియోజకవర్గాల కంటే అన్ని గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలు శాతం పరంగా ఎక్కువ ఓటు వేసినట్లు చూడవచ్చు. అత్యధిక గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న సూరత్‌లోని అత్యల్ప పట్టణ నియోజకవర్గాలలో వ్యత్యాసం 25 శాతం వరకు ఉంది. అదేవిధంగా, కర్ణాటక 2023 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో, రాష్ట్ర సగటు 73.84 శాతంతో పోలిస్తే బెంగళూరులోని అసెంబ్లీ నియోజకవర్గం బొమ్మనహల్లి (బెంగళూరు సౌత్) అత్యల్పంగా 47.5  శాతం నమోదు చేసింది.

2019 లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో అతి స్వల్పనగా పోలింగ్ శాతం నమోదైన 50 పార్లమెంటరీ నియోజకవర్గాలు:

క్రమ సంఖ్య

రాష్ట్రం 

పీసీ సంఖ్య 

 పీసీ పేరు 

పీసీ పోలింగ్ శాతం  (%)

రాష్ట్ర పోలింగ్ శాతం  (%)

1

జమ్మూ కాశ్మీర్ 

3

అనంతనాగ్ 

8.98

44.97

2

జమ్మూ కాశ్మీర్ 

2

శ్రీనగర్ 

14.43

44.97

3

జమ్మూ కాశ్మీర్ 

1

బారాముల్లా

34.60

44.97

4

తెలంగాణ 

9

హైదరాబాద్ 

44.84

62.77

5

మహారాష్ట్ర 

24

కళ్యాణ్ 

45.31

61.02

6

బీహార్ 

30

పాట్నా సాహిబ్ 

45.80

57.33

7

తెలంగాణ 

8

సికింద్రాబాద్ 

46.50

62.77

8

ఉత్తరప్రదేశ్ 

51

ఫుల్పూరు 

48.70

59.21

9

బీహార్ 

29

నలంద 

48.79

57.33

10

బీహార్ 

35

కరకాత్ 

49.09

57.33

11

మహారాష్ట్ర 

25

థానే 

49.39

61.02

12

తెలంగాణ 

7

మల్కాజిగిరి 

49.63

62.77

13

బీహార్ 

39

నావాడా 

49.73

57.33

14

మహారాష్ట్ర 

34

పూణే 

49.89

61.02

15

మహారాష్ట్ర 

31

ముంబై సౌత్ 

51.59

61.02

16

ఉత్తరప్రదేశ్ 

43

కాన్పూర్ 

51.65

59.21

17

బీహార్ 

36

జహానాబాద్ 

51.76

57.33

18

బీహార్ 

32

అర్రాహ్ 

51.81

57.33

19

ఉత్తర ప్రదేశ్ 

52

అలాహాబాద్ 

51.83

59.21

20

ఉత్తరప్రదేశ్ 

58

శ్రవస్తి 

52.08

59.21

21

ఉత్తరప్రదేశ్ 

59

గొండ 

52.20

59.21

22

ఉత్తరప్రదేశ్ 

60

దోమరియాగంజ్ 

52.26

59.21

23

ఉత్తరాఖండ్ 

3

అల్మోరా 

52.31

61.88

24

మహారాష్ట్ర 

23

భివాండీ 

53.20

61.02

25

తెలంగాణ 

10

చేవెళ్ల 

53.25

62.77

26

ఉత్తరప్రదేశ్ 

78

భాదోహి 

53.53

59.21

27

ఉత్తరప్రదేశ్ 

39<

 
...

(Release ID: 2017930) Visitor Counter : 199