భారత ఎన్నికల సంఘం

2024 సార్వత్రిక ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి సువిధ పోర్టల్ లో 73 వేలకు పైగా దరఖాస్తుల స్వీకరణ; 44,600కు పైగా అభ్యర్థనలకు ఆమోదం


ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సూత్రంతో పార్టీలు, అభ్యర్థులకు సమాన ప్రాధాన్యం

ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారించిన సువిధ పోర్టల్

Posted On: 07 APR 2024 12:14PM by PIB Hyderabad

ఎన్నికల ప్రకటన వెలువడి , ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసిసి) అమల్లోకి వచ్చిన  కేవలం 20 రోజుల వ్యవధిలోనే సువిధ పోర్టల్ లో  రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుంచి 73,379 అనుమతి అభ్యర్థనలు రాగా, వాటిలో 44,626 అభ్యర్థనలు (60%) ఆమోదం పొందాయి. దాదాపు 11,200 అభ్యర్థనలు తిరస్కరణకు గురయ్యాయి, ఇది వచ్చిన మొత్తం అభ్యర్థనలలో 15%.  10,819 దరఖాస్తులు చెల్లనివి లేదా నకిలీవిగా గుర్తించి రద్దు చేశారు. మిగిలిన దరఖాస్తులు ఏప్రిల్ 7, 2024 వరకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ప్రాసెస్ లోఉన్నాయి.

 

అత్యధికంగా తమిళనాడు (23,239), పశ్చిమబెంగాల్ (11,976), మధ్యప్రదేశ్ (10,636) నుంచి అభ్యర్థనలు వచ్చాయి. చండీగఢ్ (17), లక్షద్వీప్ (18), మణిపూర్ (20) నుంచి కనీస అభ్యర్థనలు వచ్చాయి. రాష్ట్రాల వారీగా వచ్చిన దరఖాస్తులను అనుబంధం లో ఉంచారు.

స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల ప్రజాస్వామిక సూత్రాలను నిలబెట్టేందుకు ఇసిఐ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిష్కారం సువిధ పోర్టల్. సువిధ పోర్టల్ ను bఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుంచి అనుమతులు, సౌకర్యాల కోసం వచ్చే అభ్యర్థనలను పొందడం, వాటిపై చర్యలు తీసుకునే ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించారు.

పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను చేరుకునే ఎన్నికల ప్రచార సమయం ప్రాముఖ్యతను గుర్తించి, సువిధ పోర్టల్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సూత్రంపై వివిధ రకాల అనుమతి అభ్యర్థనలను పారదర్శకంగా జారీ చేస్తుంది. ర్యాలీల నిర్వహణ, తాత్కాలికంగా పార్టీ కార్యాలయాలు తెరవడం, ఇంటింటి ప్రచారం, వీడియో వ్యాన్లు, హెలికాప్టర్లు, వాహనాల పర్మిట్లు పొందడం, కరపత్రాల పంపిణీ మొదలైన వాటికి అనుమతులు ఇస్తుంది.

సువిధ పోర్టల్ గురించి- ఇసిఐ ఐటి ఎకోసిస్టమ్ కు కీలకమైన అప్లికేషన్

సువిధ పోర్టల్ (https://suvidha.eci.gov.in) ద్వారా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఆన్ లైన్ అనుమతి అభ్యర్థనలను సమర్పించవచ్చు. అదనంగా, భాగస్వాములందరికీ సమ్మిళిత, సమాన అవకాశాన్ని నిర్ధారించడానికి ఆఫ్ లైన్ సబ్మిషన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

వివిధ రాష్ట్ర శాఖలలోని నోడల్ అధికారుల ద్వారా నిర్వహించే బలమైన ఐటి ప్లాట్ ఫాం అయిన సువిధ పోర్టల్ అనుమతి అభ్యర్థనలను సమర్థవంతంగా ప్రాసెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. సువిధకు ఒక అనుబంధ  యాప్ కూడా ఉంది, ఇది దరఖాస్తుదారులు,  వారి అభ్యర్థనల స్థితిని రియల్ టైమ్ లో ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్రక్రియకు మరింత సౌలభ్యం,  పారదర్శకతను జోడిస్తుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్స్ లో ఈ యాప్ అందుబాటులో ఉంది.

సువిధ ప్లాట్ఫామ్ ఎన్నికల ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, దరఖాస్తుల రియల్ టైమ్ ట్రాకింగ్, స్టేటస్ అప్డేట్స్, టైమ్ స్టాంప్డ్ సబ్మిషన్లు , ఎస్ఎంఎస్ ద్వారా కమ్యూనికేషన్ ను అందించడం ద్వారా పారదర్శకతను నిర్ధారిస్తుంది. అంతేకాక, పోర్టల్ లో అందుబాటులో ఉన్న అనుమతి డేటా ఎన్నికల ఖర్చులను పరిశీలించడానికి విలువైన వనరుగా పనిచేస్తుంది, ఎన్నికల ప్రక్రియలో మరింత జవాబుదారీతనం, సమగ్రతకు దోహదం చేస్తుంది.

సువిధ ప్లాట్ఫామ్ తో , అన్ని రాజకీయ పార్టీలుఅభ్యర్థులకు అవసరమైన అనుమతులు, ఆమోదాలకు సమాన ప్రాప్యత ఉన్న నిష్పాక్షిక, సమర్థవంతమైన , పారదర్శక ఎన్నికల వాతావరణాన్ని సులభతరం చేయడానికి భారత ఎన్నికల సంఘం తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.

అనుబంధం :

 వరస నెం.

 రాష్ట్రం

 మొత్తం అభ్యర్థనలు

1

 ఆంధ్రప్రదేశ్

1153

2

 అస్సాం

2609

3

 బీహార్

861

4

 గోవా

28

5

 గుజరాత్

648

6

 హర్యానా

207

7

 హిమాచల్ ప్రదేశ్

125

8

 కర్ణాటక

2689

9

 కేరళ

1411

10

 మధ్య ప్రదేశ్

10636

11

 మహారాష్ట్ర

2131

12

 మణిపూర్

20

13

 మేఘాలయ

1046

14

 మిజోరం

194

15

 నాగాలాండ్

46

16

 ఒడిశా

92

17

 పంజాబ్

696

18

 రాజస్థాన్

2052

19

 సిక్కిం

44

20

 తమిళ నాడు

23239

21

 త్రిపుర

2844

22

 ఉత్తర ప్రదేశ్

3273

23

 వెస్ట్ బెంగాల్

11976

24

 ఛత్తీస్ ఘడ్

472

25

 జార్ఖండ్

270

26

 ఉత్తరాఖండ్

1903

27

 తెలంగాణ

836

28

 అండమాన్ & నికోబార్ దీవులు

468

29

 చండీగఢ్

17

30

 దద్రా & నాగర్ హవేలీ అండ్  డామన్ & డయ్యు

108

31

 ఎన్ సి టి ఆఫ్ ఢిల్లీ

529

32

 లక్షద్వీప్

18

33

 పుదుచ్చేరి

355

34

 జమ్ము అండ్ కాశ్మీర్

383

 

 మొత్తం

73,379

                  

***



(Release ID: 2017920) Visitor Counter : 120