ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తర్ ప్రదేశ్ రోజ్‌ గార్ మేళా సందర్భం లో ప్రధాన మంత్రి వీడియో మాధ్యం ద్వారా ఇచ్చిన సందేశం యొక్క పూర్తి పాఠం

Posted On: 26 FEB 2023 12:52PM by PIB Hyderabad

ప్రస్తుతం ‘రోజ్‌గార్ మేళా’ నాకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం గా అయిపోయింది. గత అనేక నెలలు గా బిజెపి పాలనలోని రాష్ట్రాల లో ప్రతి వారం ఏదో ఒక రాష్ట్రం లో రోజ్‌గార్ మేళా లు జరుగుతూ ఉన్నాయి, వేల కొద్దీ యువజనుల కు నియామక లేఖల ను ఇస్తున్నారు. ఈ మేళాల లో నేను సాక్షి గా ఉండే సౌభాగ్యం నాకు దక్కుతోంది. ఈ ప్రతిభావంతులైన యువజనులు ప్రభుత్వ వ్యవస్థ లోకి నూతన ఆలోచనల ను తీసుకు వస్తూ, సామర్థ్యాన్ని పెంచడం లో సాయ పడుతున్నారు.

 

మిత్రులారా,

ఈ రోజు న ఉత్తర్ ప్రదేశ్ లో ఏర్పాటు చేసిన రోజ్‌గార్ మేళా కు ప్రత్యేకమైన ప్రాముఖ్యం ఉంది. ఈ ఉద్యోగ మేళా 9,000 కుటుంబాల కు సంతోషాన్ని వెంటబెట్టుకు రావడం తో పాటు గా యుపి లో సురక్ష యొక్క భావన ను మరింత గా బల పరుస్తోంది. క్రొత్త నియామకాల తో ఉత్తర్ ప్రదేశ్ పోలీసు బలగం మరింత ఎక్కువ శక్తి ని నింపుకొని మరి మెరుగు పడబోతోంది. ఈ రోజు న నియామక లేఖల ను అందుకొంటున్న యువత కు సరిక్రొత్త ఆరంభాలు మరియు నూతన బాధ్యత లు లభిస్తున్న తరుణం లో వారికి నా తరఫు నుండి ఇవే అనేకానేక అభినందన లు. 2017 వ సంవత్సరం నుండి ఉత్తర్ ప్రదేశ్ పోలీసు లో, ఒక్క ఈ విభాగం లోనే, ఒకటిన్నర లక్షల కు పైగా క్రొత్త నియామకాలు అయినట్లు నా దృష్టి కి వచ్చింది. అంటే బిజెపి యొక్క పాలన లో ఇటు ఉపాధి, అటు సురక్ష .. రెండిటి లోను వృద్ధి చోటు చేసుకొందన్నమాట.

 

మిత్రులారా,

యుపి అంటేనే మాఫియాల కు పేరు మోసిన కాలం అంటూ ఒకటి ఉండింది; చట్టం మరియు చట్టం యొక్క అమలు సంబంధి సమస్య లు పెచ్చుపెరిగిపోయాయప్పుడు. ప్రస్తుతం, ఉత్తర్ ప్రదేశ్ లో ఒక మెరుగైనటువంటి చట్టం మరియు చట్ట అమలు సంబంధి స్థితి నెలకొంది అనేటటువంటి ఒక గుర్తింపు లభించింది. ఈ రాష్ట్రం అభివృద్ధి దిశ లో పయనిస్తున్న రాష్ట్రాల లో ఒక రాష్ట్రం గా లెక్క కు వచ్చింది. బిజెపి ప్రభుత్వం ప్రజల లో సురక్ష సంబంధి భావన ను పటిష్ట పరచింది. చట్టం మరియు చట్టం యొక్క అమలు బలం గా ఉన్న చోటల్లా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది మనకు అందరికి తెలిసిన విషయమే. వ్యాపారం చేసుకోవడాని కి ఒక సురక్షితమైనటువంటి పర్యావరణం ఉన్న చోటల్లా పెట్టుబడి పెరగడం మొదలు అవుతుంది. భారతదేశం లో పౌరుల కు లెక్కలేనన్ని తీర్థయాత్ర కేంద్రాలు మరియు పర్యటక ప్రదేశాలు ఉన్నాయి అనేది మీకు తెలుసు ను. విభిన్నమైన సంప్రదాయాల ను అనుసరించే వారందరికి ఉత్తర్ ప్రదేశ్ సకలం సమకూర్చుతున్నది. చట్టం మరియు చట్టం యొక్క అమలు వ్యవస్థ బలం గా ఉన్న చోట ఆ సంగతి దేశం లో ప్రతి ప్రాంతాని కి వెల్లడి అయ్యి, తద్ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోకి వచ్చే పర్యటకుల సంఖ్య పెరిగేందుకు దారి తీసింది. బిజెపి యొక్క డబల్ ఇంజన్ ప్రభుత్వం ఉత్తర్ ప్రదేశ్ లో అభివృద్ధి కి పెద్ద పీట ను వేస్తున్న తీరు ను బట్టి చూస్తే ప్రతి రంగం లో ఉద్యోగ అవకాశాలు అనేకం పెరుగుతూ ఉన్న సంగతి ని మీరు గమనిస్తూనే ఉన్నారు. ఆధునికమైన ఎక్స్ ప్రెస్ వేస్ నిర్మాణం, క్రొత్త విమానాశ్రయాల నిర్మాణం, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ నిర్మాణం, న్యూ డిఫెన్స్ కారిడర్ నిర్మాణం, మొబైల్ తయారీ సంబంధి క్రొత్త యూనిట్టు లు, ఆధునిక రూపు ను సంతరించుకొంటున్న జల మార్గాలు, ఉత్తర్ ప్రదేశ్ లో వెలుస్తున్నటువంటి ఆధునిక మౌలిక సదుపాయాలు ఇక్కడి మూల మూల న అనేక క్రొత్త ఉద్యోగ అవకాశాల ను సృష్టిస్తున్నాయి.

 

మిత్రులారా,

ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లో ఎక్స్ ప్రెస్ వేస్ సంఖ్య అన్నిటి కంటే ఎక్కువ గా ఉంది. ఇక్కడ హైవే స్ ను అదే పని గా విస్తరించడం జరుగుతోంది. కాసేపటి క్రితం ఒక కుటుంబం నాతో భేటీ అయింది. వారి వెంట వారి కుమార్తె కూడా ఉన్నారు. నేను వారి ని ఉద్దేశించి మీరు ఉత్తర్ ప్రదేశ్ నుండి వచ్చారా ? అని అడిగాను. దానికి వారు ‘‘లేదండీ, మేము ఎక్స్ ప్రెస్ ప్రదేశ్ నుండి వచ్చాం’’ అంటూ బదులిచ్చారు. చూడండి, ఇది ఉత్తర్ ప్రదేశ్ యొక్క గుర్తింపు గా మారిపోయింది. ప్రతి నగరం తో హైవే స్ ను కలపడానికి క్రొత్త క్రొత్త రహదారుల ను కూడా నిర్మించడం జరుగుతోంది. ఈ అభివృద్ధి ప్రాజెక్టు లు ఉద్యోగ అవకాశాల ను కల్పించడం ఒక్కటే కాకుండా ఉత్తర్ ప్రదేశ్ లో ఇతర ప్రాజెక్టు లు చేపట్టడాని కి కూడా బాటల ను పరుస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఏ విధం గా తన పర్యటన పరిశ్రమ ను ప్రోత్సహించిందో, క్రొత్త సదుపాయాల ను కల్పించిందో వాటిని బట్టి కూడా ఉద్యోగాల సంఖ్య లో అమాంతం వృద్ధఇ చోటు చేసుకొంది. కొన్ని రోజుల క్రిందట, నేను క్రిస్ మస్ కాలం లో ప్రజలు గోవా కు వెళ్తారు అని చదివాను. గోవా లో అన్ని ప్రాంతాలు కిక్కిరిసిపోతాయి. ఈ సారి క్రొత్త గణాంకాల ను బట్టి చూస్తే, బుకింగు లు గోవా కంటే కాశీ లో అధికం గా ఉన్నాయి. కాశీ యొక్క పార్లమెంటు సభ్యుని గా ఈ సంగతి నన్ను ఉబ్బితబ్బిబ్బు చేసివేసింది. కొద్ది రోజుల క్రితం జరిగిన గ్లోబల్ ఇన్ వెస్టర్స్ సమిట్ లో ఇన్ వెస్టర్ లలో పొంగిపొరలినటువంటి ఉత్సాహాన్ని నేను గమనించాను. వేల కోట్ల కొద్దీ రూపాయల విలువైన ఈ పెట్టుబడి తో, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల తో పాటు ప్రభుత్వేతర ఉద్యోగ అవకాశాలు అధికం కానున్నాయి.

 

మిత్రులారా,

సురక్ష మరియు ఉపాధి ల ఉమ్మడి శక్తి తో ఉత్తర్ ప్రదేశ్ లో ఆర్థిక వ్యవస్థ కు ఒక క్రొత్త జోరు అందింది. పూచీకత్తు లేకుండానే 10 లక్షల రూపాయల వరకు రుణాల ను అందించే ముద్ర యోజన యుపి లో లక్షల కొద్దీ యువజనుల కలల కు క్రొత్త రెక్కల ను తొడిగింది. వన్ డిస్ట్రిక్ట్ , వన్ ప్రోడక్ట్ప్రతి జిల్లా లో సరిక్రొత్త గా కొలువుల అవకాశాల ను అందించింది. దీనితో యువత కు వారి నైపుణ్యాల ను ప్రధాన బజారు వరకు తరలించే సౌకర్యం సొంతం అయింది. యుపి లో నమోదైన సూక్ష్మ, లఘు, మధ్య తరహా వాణిజ్య వ్యవస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ) లు లక్షల సంఖ్య లో ఉన్నాయి. తత్ఫలితం గా ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం లో చిన్న తరహా పరిశ్రమల కు అతి పెద్ద నిలయం గా మారిపోయింది. నవ పారిశ్రమికత్వ రంగం లో అడుగిడే వారి కోసం తగిన స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ ను సమకూర్చడం లో ఉత్తర్ ప్రదేశ్ నాయక పాత్ర ను పోషిస్తోంది.

 

మిత్రులారా,

ఈ రోజు న నియామక లేఖల ను అందుకొన్న వారు ఒక విషయాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. మీ జీవనం లోకి క్రొత్త బాధ్యతలు, క్రొత్త సవాళ్ళు మరియు క్రొత్త అవకాశాలు రానున్నాయి. ప్రతి రోజు మీ కోసం ఒక క్రొత్త అవకాశం వేచి ఉంటుంది. ఇన్ని ఉన్నప్పటికీ, మీకు నేను వ్యక్తిగతం గాను, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఒక పార్లమెంటు సభ్యుని గాను మరియు నా సార్వజనిక జీవనం లో ఇన్నేళ్ల అనుభవం తోను ఒక విషయాన్ని చెప్పదలచుకున్నాను. అది ఏమిటి అంటే ఈ రోజు న మీరు నియామక లేఖల ను అందుకొంటూ ఉన్నారు. అయినప్పటికి మీ లోపలి విద్యార్థి ని ఎన్నడూ చంపివేయనివ్వకండి అనేదే. ప్రతి క్షణం క్రొత్త క్రొత్త అంశాల ను నేర్చుకోవడం, మీ సామర్థ్యాల కు పదును పెట్టుకోవడం, మరి మీ దక్షత ను పెంచుకొంటూ పోవడం చేస్తూ ఉండండి. ప్రస్తుతం ఆన్ లైన్ మాధ్యం ద్వారా క్రొత్త అంశాల ను నేర్చుకొనేందుకు మార్గం అందుబాటు లో ఉంది. తెలుసుకోవడానికి ఎన్నో అంశాలు దీనిలో ఉన్నాయి. మీరు మీ జీవన మార్గం లో మునుముందుకు సాగిపోవడానికి ఈ నేర్చుకొనే ప్రక్రియ అనేది చాలా ముఖ్యం. మీ జీవనానికి ఏనాడూ ఒక బిందువు వద్ద నిలిపి ఉంచేయకండి. జీవనం సదా చైతన్యవంతం గా ఉండాల్సిందే. మీరు సరిక్రొత్త శిఖరాల ను అందుకొంటూ ఉంటారని ఆకాంక్షిస్తున్నాను. మీరు మీ జ్ఞానాన్ని మరియు మీ నైపుణ్యాల ను దీని కోసం పెంచుకోవాలి. ఆ అవసరం ఉంది. మిమ్ముల ను ఈ సేవ లోకి భర్తీ చేసుకోవడం జరిగింది; మరి ఇది మీ విషయం లో ఆరంభం గా పరిగణించండి. మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకోవడం పట్ల శ్రద్ధ ను తప్పక వహించాలి; మీ జ్ఞానాన్ని పెంచుకొంటూ, పురోగమించాలి. మరి, మీరు నియామక లేఖల ను అందుకొన్నారు గనుక, పోలీసు దుస్తుల ను మీరు ధరించబోతున్నారన్న మాట. మీరు చేతి లో పట్టుకొనేందుకు ఒక లాఠీ ని ప్రభుత్వం మీకు ఇచ్చింది. మీరు ఒకటి మరచిపోనే కూడదు. అది ప్రభుత్వం తరువాత వచ్చింది. మొదట దైవం మీకు మనస్సు ను కూడా ఇచ్చింది. ఈ కారణం గానే మీరు లాఠీ కంటే మీ మనస్సు ను అర్థం చేసుకోవలసి ఉంటుంది. మీరు సంవేదనశీలురు గా తయారు కావాలి; మరి వ్యవస్థ ను సైతం ఇలాగ సంవేదనభరితం గా దిద్ది తీర్చాల్సింది మీరు. ఈ రోజు న నియామక లేఖల ను అందుకొన్నటువంటి యువజనుల కు శిక్షణ ఇచ్చే కాలం లో వారి కి వీలైనంత గా వారి బాధ్యతల ను ఏ విధం గా నిర్వర్తించాలో అనేది చాలా జాగ్రత లు తీసుకొంటూ బోధించడం జరుగుతున్నది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పోలీసు బలగాల కు ఇచ్చే శిక్షణ లో బోలెడన్ని మార్పుల ను తీసుకొని రావడం ద్వారా వారి శిక్షణ ను చాలా వరకు మెరుగు పరచే దిశ లో పాటుపడుతున్నది. ఉత్తర్ ప్రదేశ్ లో స్మార్ట్ పోలీసింగు ను పోత్సహించడం కోసం యువత కు సైబర్ క్రైమ్, ఫరెన్సిక్ సైన్స్ లతో పాటు అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం తాలూకు శిక్షణ ను కూడా ఇస్తారు.

 

మిత్రులారా,

ఈ రోజు న నియామక లేఖల ను అందుకొనే యువజనులు అందరు సామాన్య పౌరుల సురక్ష తో పాటు సమాజాని కి దిశ ను చూపే బాధ్యత ను కూడా వహిస్తారు. మీరు ప్రజల కు సేవ మరియు శక్తి ఈ రెండిటి ప్రతిబింబం గా మారవచ్చును. మీరు మీ యొక్క నిష్ఠ మరియు కృత నిశ్చయాల తో ఎటువంటి ఒక వాతావరణాన్ని తయారు చేస్తారు అంటే మరి ఆ స్థితి గతుల లో అపరాధులు భయభీతులు గా మారితే, చట్టాన్ని పాలన చేసే వారు అందరి కంటే నిర్భయం గా మెలగాలి అన్నమాట. మరొక్కసారి మీకు అందరికి శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను. మీ కుటుంబ సభ్యుల కు నా యొక్క శుభాకామనలు. మీకు అనేకానేక ధన్యవాదాలు.

 

అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి భావానువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష‌ లో సాగింది.

 

***


(Release ID: 2016375) Visitor Counter : 55