ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        భూటాన్ యొక్క ప్రధాని తో ప్రధాన మంత్రి  ద్వైపాక్షిక సమావేశం లో పాల్గొన్నారు ;  ఎమ్ఒయు ల ఆదాన- ప్రదానం కూడ జరిగింది
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                22 MAR 2024 6:30PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                ప్రధాన  మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న థిమ్పూ లో తన గౌరవార్థం ఏర్పాటైన మధ్యాహ్న భోజనం సందర్భం లో భూటాన్ యొక్క ప్రధాని శ్రీ శెరింగ్ టోబ్ గే తో సమావేశమయ్యారు. మంత్రి తనకు అసాధారణమైన రీతి లో సార్వజనిక స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను ప్రధాని శ్రీ శెరింగ్ టోబ్ గే కు ధన్యవాదాల ను తెలియ జేశారు. పారో నుండి థిమ్పూ కు ప్రయాణించిన సందర్భం లో ప్రజలు మంత్రి కి స్వాగతం పలికారు.
 
బహుముఖీనమైన ద్వైపాక్షిక సంబంధాల తాలూకు విభిన్న అంశాల ను గురించి ఇద్దరు నేత లు చర్చించారు. నవీకరణ యోగ్య శక్తి, వ్యవసాయం, యువజన బృందాల ఆదాన ప్రదానం, పర్యావరణం, వనాల పెంపకం మరియు పర్యటన వంటి రంగాల లో సహకారాన్ని ఇప్పటికంటే ఎక్కువ గా వృద్ధి చెందింప చేసుకోవాలన్న సమ్మతి ని వారు వ్యక్తం చేశారు. భారతదేశం మరియు భూటాన్ ల మధ్య అన్ని స్థాయిల లో అత్యధిక విశ్వాసం, సద్భావన మరియు పరస్పర అవగాహన లు ప్రధానం గా ఉన్న విశిష్టమైన సంబంధాలు దీర్ఘ కాలం గాను, అసాధారణం గాను కొనసాగుతూ వస్తున్నాయి.
 
 
సమావేశాని కంటే ముందు, శక్తి, వ్యాపారం, డిజిటల్ కనెక్టివిటీ, అంతరిక్షం, వ్యవసాయం, యువజనుల మధ్య వివిధ కార్యక్రమాలు వంటి సంబంధిత విభిన్నమైన ఎమ్ఒయు లు/ఒప్పందాల ఆదాన ప్రదానం కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు భూటాన్ యొక్క ప్రధాని లు పాలుపంచుకొన్నారు.
 
***
                
                
                
                
                
                (Release ID: 2016314)
                Visitor Counter : 158
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam