భారత ఎన్నికల సంఘం

ఐఏఎస్, ఐపీఎస్ హోదా లేని డీఎంలు, ఎస్పీలను బదిలీ చేసిన ఎన్నికల సంఘం


గుజరాత్, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 8 మంది నాన్ కేడర్ ఎస్పీ/ ఎఎస్పీలు, 5 మంది నాన్ కేడర్ డీఎంలను బదిలీ చేసిన ఎన్నికల సంఘం

డీఎం/ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రముఖ రాజకీయ నాయకుల సమీప బంధువులు బదిలీ ఎస్ఎస్పి . బతిండా (పంజాబ్), ఎస్పీ సోనిత్పూర్ (అసోం) బదిలీ

Posted On: 21 MAR 2024 4:36PM by PIB Hyderabad

2024  లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేలా చూసేందుకు అమలు చేస్తున్న చర్యల్లో భాగంగా  గుజరాత్, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం), ఎస్పీలుగా ప్రముఖ  స్థానాల్లో విధులు నిర్వహిస్తున్న నాన్ క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ జిల్లాల్లో  డీఎం, ఎస్పీ పోస్టులను  ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్, ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారులకు కేటాయించారు.

ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ అధ్యక్షతన సమావేశమైన ఎన్నికల కమిషనర్లు శ్రీ జ్ఞానేష్ కుమార్, శ్రీ సుఖ్ బీర్ సింగ్ సంధు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

బదిలీ అయిన  అధికారులు:
1. గుజరాత్ - చోటా ఉదయపూర్, అహ్మదాబాద్ రూరల్ జిల్లాల ఎస్పీ
2. పంజాబ్ - పఠాన్‌కోట్, ఫజిల్కా, జలంధర్ రూరల్, మలేర్‌కోట్ల జిల్లాల ఎస్ఎస్పి
3. ఒడిశా – దెంకనల్ డిఎం , డియోగర్ , కటక్ రూరల్ జిల్లాల ఎస్పీలు 
4. పశ్చిమ బెంగాల్ - పుర్బా మేదినీపూర్, ఝర్‌గ్రామ్, పుర్బా బర్ధమాన్ , బీర్భూమ్ జిల్లాల డిఎం 
అదనంగా, ఎన్నికైన రాజకీయ ప్రతినిధులతో బంధుత్వం లేదా కుటుంబ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని  పంజాబ్‌లోని ఎస్‌ఎస్‌పి బటిండా, అస్సాంలోని  సోనిత్‌పూర్‌ ఎస్పీలను బదిలీ చేయాలని కూడా కమిషన్ ఆదేశించింది. ఈ రెండు జిల్లాల్లోని అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తుండడం లేదా రాజీ పడుతున్నట్లు భావించడం లాంటి అపోహలు  తొలగించేందుకు ముందస్తు చర్యగా ఈ అధికారులను  బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఎన్నికల సంఘం ఆదేశాల  ప్రకారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమల్లోకి వచ్చేలా నాన్ క్యాడర్ డిఎం, ఎస్పీ,ఎస్ఎస్పీ అధికారులను వారి ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ చేసి   కమిషన్‌కు సమ్మతి నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 

***



(Release ID: 2015969) Visitor Counter : 74