వ్యవసాయ మంత్రిత్వ శాఖ
అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి, ధనుక అగ్రిటెక్ లిమిటెడ్
Posted On:
20 MAR 2024 12:19PM by PIB Hyderabad
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్ - భారత వ్యవసాయ పరిశోధనా మండలి), ధనుక అగ్రిటెక్ లిమిటెడ్‌లు అవగాహనా ఒప్పందం (ఎంఒయు)పై సంతకాలు చేశాయి.ఆయా సంస్థల తరఫున ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (వ్యవసాయ విస్తరణ) డా. యు.ఎస్. గౌతమ్, ధనుక అగ్రిటెక్ లిమిటెడ్ చైర్మన్ డా. ఆర్ జి అగర్వాల్ ఎంఒయుపై నిన్న (మంగళవారం) సంతకాలు చేశారు.
రైతులకు నూతన సాంకేతికతను బదిలీ చేయడంలో ఇరు సంస్థల సామర్ధ్యాన్ని వినియోగించడం ఈ ఒప్పందం లక్ష్యమని డా. గౌతమ్ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 14.5 కోట్లమందికి పైగా ఉన్న రైతులలో ఎక్కువమంది చిన్న కమతాలు కలిగినవారేనని పేర్కొన్నారు. ఎటిఎఆర్ఐలు, కెవికెల వంటి కేంద్ర సంస్థలతో అనుసంధానం ద్వారా ఇటుటి చిన్న రైతులకు వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన శిక్షణను ధనుక అగ్రిటెక్ అందిస్తుంది.
నేడు మొత్తం ప్రపంచమే పర్యావరణ మార్పుకు సంబంధించిన సవాళ్ళను ఎదుర్కుంటోందని, భారత్‌కు ఇది కొత్త కాదని, ఈ నేపథ్యంలో పర్యావరణ అనుకూలమై వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన నూతన పద్ధతిపై రెండు సంస్థలు కలిసి పని చేయవలసి ఉందని డా. గౌతమ్ అన్నారు. మారుతున్న వాతావరణంలో సహజ/ పర్యావరణ అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఎంఒయు లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఐసిఎఆర్- ఎటిఎఆర్ఐ, కెవికెల సమన్వయంతో రైతులకు శిక్షణ, రసలహా సేవలను ధనుక అగ్రిటెక్ అందిస్తుందని డా. అగర్వాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిఎఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్, ఐసిఎఆర్ కేంద్ర కార్యాలయ డైరెక్టర్లు, సీనియర్ శాస్త్రవేత్తలు, సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
***
(Release ID: 2015809)
Visitor Counter : 160