భారత ఎన్నికల సంఘం
అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు తేదీలో మార్పు
Posted On:
17 MAR 2024 4:28PM by PIB Hyderabad
1. లోక్‌సభ, వివిధ రాష్ట్రాల శాసనసభలకు సాధారణ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం శాసనసభలకు కూడా ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ షెడ్యూల్ ప్రకారం రెండు రాష్ట్రాలలో ఎన్నికల తేదీ 19.04.2024, ఓట్ల లెక్కింపు తేదీ 04.06.2024.
2. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఆర్టికల్ 324, 172(1), ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 15 కింద దఖలు పడిన అధికారాల ప్రకారం, ఈసీఐ, అరుణాచల్‌ప్రదేశ్ & సిక్కిం శాసనసభల కాల గడువు ముగిసే లోపు ఎన్నికలు నిర్వహించాలి, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం శాసనసభల సభల కాల గడువు 02.06.2024న ముగుస్తుంది.
3. దీని దృష్ట్యా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభల సాధారణ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి ఈ కింది వాటిని సవరించాలని ఈసీఐ నిర్ణయించింది:
క్ర.సం.
|
ఎన్నికల తేదీ
|
ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్
|
సవరించిన షెడ్యూల్
|
1
|
ఓట్ల లెక్కింపు తేదీ
|
4 జూన్, 2024
(మంగళవారం)
|
జూన్ 2, 2024
(ఆదివారం)
|
2
|
ఎన్నికలు ముగించాల్సిన తేదీ
|
జూన్ 6, 2024
(గురువారం)
|
జూన్ 2, 2024
(ఆదివారం)
|
4. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదు.
***
(Release ID: 2015356)
Visitor Counter : 137
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam