ప్రధాన మంత్రి కార్యాలయం

పిఎం-సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన కింద కోటికిపైగా కుటుంబాల నమోదుపై ప్రధాని అభినందన

Posted On: 16 MAR 2024 9:19AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి-సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన కోసం కోటికిపైగా కుటుంబాల నమోదుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హర్షం ప్రకటించారు.

ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

‘‘ఇదెంతో అద్భుతమైన వార్త! ఈ పథకానికి శ్రీకారం చుట్టిన నెల రోజుల వ్యవధిలోనే కోటికిపైగా కుటుంబాలు ప్రధానమంత్రి-సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన కింద నమోదు చేసుకున్నాయి. ఆ మేరకు దేశం నలుమూలల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. అస్సాం, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిషా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ల రాష్ట్రాల పరిధిలో 5 లక్షలకుపైగా కుటుంబాలు నమోదు చేసుకున్నాయి. ఇంకా నమోదు చేసుకోనివారు pmsuryaghar.gov.in ద్వారా ఈ అవకాశాన్ని త్వరగా సద్వినియోగం చేసుకోవాలి’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

   అలాగే ‘‘ఈ కార్యక్రమం వల్ల విద్యుదుత్పాదనకు భరోసా లభించడంతోపాటు గృహవిద్యుత్ చార్జీల భారం గణనీయంగా తగ్గడం ఖాయం. అంతేకాకుండా భూగోళం ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేసే పర్యావరణ హిత జీవనశైలిని (లైఫ్-LiFE) ఇది ఎంతగానో ప్రోత్సహిస్తుంది’’ అని స్పష్టం చేశారు.

 

***



(Release ID: 2015336) Visitor Counter : 150