సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒటిటి ప్లాట్ఫారంలపై అశ్లీల ప్రసారాలపై చర్యలు తీసుకున్న కేంద్రసమాచార ప్రసార మంత్రిత్వశాఖ.


అశ్లీల,అసభ్య ప్రసారాల విషయమై పలు మార్లు కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ హెచ్చరించిన అనంతరం 18 ఒటిటి ప్లాట్ఫారంలను బ్లాక్ చేసిన మంత్రిత్వశాఖ.

దేశవ్యాప్తంగా 19 వెబ్సైట్లు, 10 యాప్లు, ఒటిటి ప్లాట్ఫారంల 57 సోషల్మీడియా హ్యాండిల్స్ను ప్రభుత్వం బ్లాక్ చేసింది.

ఒటిటి ప్రసారాల విషయంలో ఐటిటి చట్టం , ఇండియన్ పీనల్ కోడ్, మహిళల అసభ్య చిత్రీకరణ నిరోధక చట్టం వంటి ఉల్లంఘనతో వీటిపై చర్య.

Posted On: 14 MAR 2024 11:43AM by PIB Hyderabad

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ 18 ఓటిటి ప్లాట్ఫారంలపై చర్యలు తీసుకుంది. అశ్లీలఅసభ్యప్రసారాలు కొన్నింటి విషయంలో మహిళలను అసభ్యంగా చిత్రాల ప్రసారం వంటి వాటి కారణంగా కేంద్ర ప్రభుత్వం వీటి   ప్రసారాలను నిలిపివేసింది. వీటితోపాటు 19 వెబ్సైట్లు, 10 యాప్లు (7 గూగుల్ ప్లే స్టోర్లోనివి కాగా ,3 ఆపిల్ యాప్ స్టోర్లోనివి) ఉన్నాయి. ఈ ప్లాట్ఫారంలకు అనుబంధంగా   ఉన్న 57 సోషల్ మీడియా ఖాతాలను భారతదేశంలో అందుబాటులో లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.


అశ్లీల కార్యక్రమాలుఅసభ్యకార్యక్రమాలను ప్రసారం చేయరాదనిఆయా ప్లాట్ ఫారంలు బాధ్యతతో వ్యవహరించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ పలు మార్లు సూచించారు. సృజనాత్మక వ్యక్తీకరణ ముసుగులో అశ్లీలతను ప్రసారం చేయరాదని కూడా సూచిస్తూ వచ్చారు.  అశ్లీలఅసభ్య కంటెంట్ను ప్రసారంప్రచురణ చేస్తున్నందుకు 18 ఒటిటి ప్లాట్ఫారంలపై చర్యలు తీసుకున్నట్టు 2024 మార్చి 12న కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని నిబంధనల ప్రకారం ,భారత ప్రభుత్వంలోని వివిధ విభాగాలుమంత్రిత్వశాఖలుడోమైన్ నిపుణులుమీడియాఎంటర్టైన్మెంట్ రంగాలలో నిపుణులుమహిళా హక్కులుపిల్లల హక్కుల రంగంలో నిపుణులతో సంప్రదించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఒటిటి ప్లాట్ ఫారంల జాబితా


 

డ్రీమ్ఫిల్మ్స్

వూవి

ఎస్మా

అన్ కట్ అడ్డా

ట్రి ఫ్లిక్స్

X Prime

నియాన్ ఎక్స్ విఐపి

బెష్రామ్స్

హంటర్స్

రాబిట్

ఎక్స్ట్రా మూడ్

Nuefliks

మూడ్ ఎక్స్

మోజ్ ప్లిక్స్

హాట్ షాట్స్ విఐపి

              ఫుగి

చికూఫ్లిక్స్

Prime Play

.కంటెంట్ స్వభావం:

ప్రభుత్వం నిలిపివేసిన ప్లాట్ఫారంలలో చాలావరకు ప్లాట్ఫారంలలో అశ్లీలఅసభ్య ప్రసారాలుమహిళలను అసభ్యంగా చిత్రించే కార్యకలాపాలు ఉన్నాయి. సందర్భశుద్ధి లేకుండా నగ్నత్వాన్నిలైంగిక కార్యకలాపాలను కొన్ని ప్రసారం చేశాయి. కొన్ని టీచర్కు విద్యార్థికి మధ్య అవాంఛిత సంబంధాలనుఅనుచిత కుటుంబ సంబంధాలను ఇవి ప్రదర్శించాయి. కొన్నింటిలో అశ్లీల కంటెంట్తోపాటు ఎలాంటి సందరరర్భం సామాజిక సహేతుకత లేకుండా అభ్యంతకర సన్నివేశాలనుప్రదర్శించారు.. ఇలాంటివి ప్రాథమికంగా ఐటి చట్టంలోని సెక్షన్ 67సెక్షన్ 67 ఎ,మహిళల అసభ్య చిత్రీకరణ నిరోధక చట్టం 1986  సెక్షన్ 4 ఐపిసిలోని సెక్షన్ 292 లకు విరుద్ధంగా ఉన్నాయి.

 

చెప్పుకోదగిన స్థాయిలో వీక్షకులు:

ఒక ఒటిటి యాప్ కోటి డౌన్ లోడ్లను సాధించింది.మరో రెండు గూగుల్ప్లే స్టోర్నుంచి డౌన్ లోడ్ అయ్యాయి.దీనికి తోడు ఈ ఒటిటి ప్లాట్పారంలు సోషల్ మీడియా ప్లాట్ఫారంలను విస్తృతంగా వాడాయి. ఇవి ట్రైలర్లుకొన్ని ప్రత్యేక దృశ్యాలువెబ్ సైట్లకు ఎక్స్టర్నల్ లింకులు ఇవ్వడం ద్వారా వీక్షకులను ఆకర్షిస్తున్నట్టు గుర్తించారు. ఇలాంటి ఒటిటి ప్లాట్ఫారంల లను ఫాలో అవుతున్న వారు 32 లక్షలకు పైనే ఉన్నారు.

సామాజిక మాధ్యమ ప్లాట్ఫారం

ఖాతాల సంఖ్య

ఫేస్ బుక్

12

ఇన్ స్టా గ్రామ్

17

ఎక్స్ ( పూర్వపు ట్విట్టర్)

16

యూ ట్యూబ్

12

 

సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు ఒటిటి ప్లాట్ఫారంలుఐటి నిబంధనలు 2021 కింద ఏర్పాటైన స్వయం నియంత్రిత సంస్థల ద్వారా ,వెబినార్లు,వ ర్క్షాప్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపడుతోంది.

ప్రభుత్వం ఒటిటి పరిశ్రమ వృద్ధిఅభివృద్ధికి కట్టుబడి ఉంది. ఈ దిశగా పలు చర్యలు సైతం తీసుకుంది.54వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో వెబ్ సిరీస్కు ప్రారంభ ఒటిటి అవార్డును కూడా ప్రవేశపెట్టింది. మీడియా ఎంటర్టైన్మెంట్ రంగాల సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. 2021 ఐటి నిబంధనల కింద తేలిక పాటి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ను తీసుకురావడమే కాకఐటిరూల్స్ 2021 కింద స్వీయ నియంత్రణ ప్రాధాన్యతను తెలియజేస్తూ వస్తోంది.

 

***


(Release ID: 2014882) Visitor Counter : 130