ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం లో చిరుతపులులసంతతి వృద్ధి చెందడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


వన్య ప్రాణుల సంరక్షణ దిశ లో జరుగుతున్న అనేక సామూహికప్రయాసల లో పాలుపంచుకొన్న వారందరిని ఆయన ప్రశంసించారు

Posted On: 29 FEB 2024 8:54PM by PIB Hyderabad

భారతదేశం లో చిరుతపులుల సంతతి పెరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిరుతపులుల సంఖ్య లో ఈ గణనీయ వృద్ధి జీవ వైవిధ్యం పట్ల భారతదేశానికి ఉన్న అచంచల సమర్పణ భావాన్ని కనబరుస్తోందనడాని కి ఒక నిదర్శన గా ఉంది అని ఆయన అన్నారు.

 

 

వన్య ప్రాణుల సంరక్షణ దిశ లో సాగుతున్న అనేక సామూహిక ప్రయాసల లో పాలుపంచుకొంటున్న వారందరికీ కూడా ను శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.

 

 

భారతదేశం లో చిరుతపులుల సంతతి 2018వ సంవత్సరం నాటికి 12,852 గా ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 13,874 గా ఉంది అని అంచనా వేయడమైంది.

 

 

భారతదేశం లోని మధ్య ప్రాంతం లో అత్యధిక సంఖ్య లో చిరుతపులులు ఉన్నాయి, అందునా మధ్య ప్రదేశ్ లో 3,907 చిరుతపులుల కు నిలయం గా ఉంది అంటూ పర్యావరణం, అడవులు మరియు జలవాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ భారతదేశం లో చిరుతపులులు ఎన్ని ఉన్నాయన్న అంశం పై ఎక్స్ మాధ్యం లో పొందుపరచిన ఒక నివేదిక లో తెలియజేయగా, ఆ నివేదిక పై ప్రధాన మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

 

కేంద్ర మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన సందేశాని కి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందిస్తూ -

‘‘భలే కబురు. చిరుతపులుల సంఖ్య లో ఈ యొక్క గణనీయమైన వృద్ధి నమోదు కావడం జీవవైవిధ్యం పట్ల భారతదేశం ప్రదర్శిస్తున్న అచంచల సమర్పణ భావాని కి ఒక నిదర్శన గా ఉంది. వన్యప్రాణుల సంరక్షణ దిశ లో సాగుతున్న అనేక సామూహిక ప్రయాసల లో పాలుపంచుకొంటున్న వారు అందరూ ఆ క్రమం లో దీర్ఘకాలిక సహజీవనాని కి బాట ను పరుస్తున్నారు. వారి కి ఇవే నా అభినందన లు.’’ అని పేర్కొన్నారు.

 

 



(Release ID: 2010542) Visitor Counter : 108