ప్రధాన మంత్రి కార్యాలయం

2023-24 యొక్క మూడో త్రైమాసికం లో జిడిపి లో 8.4 శాతం మేరకు పటిష్టమైన వృద్ధి నమోదు కావడం భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క శక్తి ని మరియు సత్తా ను చాటుతోంది: ప్రధాన మంత్రి

Posted On: 29 FEB 2024 8:55PM by PIB Hyderabad

స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) లో 2023-24 యొక్క మూడో త్రైమాసికం లో 8.4 శాతం మేర పటిష్టమైన వృద్ధి నమోదు కావడం భారతదేశం ఆర్థిక వ్యవస్థ కు ఉన్న శక్తి ని మరియు సామర్థ్యానన్ని చాటుతోంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వేగవంతమైనటువంటి ఆర్థిక వృద్ధి ని సాధించడం కోసం మా ప్రయాసలు కొనసాగుతాయి అని, దీని ద్వారా 140 కోట్ల మంది భారతీయులకు ఒక మెరుగైన జీవనాన్ని జీవించడం తో పాటు గా ఒక వికసిత్ భారత్ ను ఆవిష్కరించడం లో సహాయం అందుతుందని ఆయన పునరుద్ఘాటించారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘2023-24 సంవత్సరం లో మూడో త్రైమాసికం లో జిడిపి లో 8.4 శాతం మేరకు పటిష్టమైన వృద్ధి నమోదు అయిన పరిణామం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కు ఉన్న శక్తి ని మరియు సామర్థ్యాన్ని చాటిచెబుతున్నది. వేగవంతమైనటువంటి ఆర్థిక వృద్ధి ని సాధించడం కోసం మా ప్రయాసలు కొనసాగుతాయి అని, దీని ద్వారా 140 కోట్ల మంది భారతీయులకు ఒక మెరుగైన జీవనాన్ని జీవించడం తో పాటు గా ఒక వికసిత్ భారత్ ను ఆవిష్కరించడం లో సహాయం అందుతుంది.’’ అని పేర్కొన్నారు.

********

DS/ST



(Release ID: 2010538) Visitor Counter : 114