సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మేరా పెహ్లా ఓట్ దేశ్ కె లియే ప్రచారంలో పాల్గొనవలసిందిగా ప్రజలను ఆహ్వానించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ
ప్రచార గీతాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
27 FEB 2024 4:26PM by PIB Hyderabad
తొలిసారి ఓటు వేయనున్న ఓటర్లలో మేరా పెహ్లా ఓట్ దేశ్ కె లియే (నా తొలి ఓటు దేశం కోసం) అన్న సందేశాన్ని తమదైన శైలిలో వ్యాప్తి చేసేందుకు అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తూ, ఎన్నికల ప్రక్రియలో మరింత భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టమైన పిలుపిచ్చారు. ప్రధానమంత్రి ఎక్స్‌లో సందేశాన్ని పోస్ట్ చేసి పంచుకున్నారు.
ఈ రోజు ఉదయం, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ # మెరాపెహ్లా వోట్ దేశ్ కెలియే ప్రచార గీతాన్ని ఎక్స్‌పై ప్రారంభించారు. యువ ఓటర్లు తమ ప్రజాస్వామిక హక్కు అయిన ఓటును వినియోగించుకునేందుకు ప్రోత్సహించడం ఈ ప్రచార లక్ష్యం.
దిగువన ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ఈ గీతాన్ని వినవచ్చు, వీక్షించవచ్చుః
ఎక్స్‌పై ఈ గీతాన్ని ప్రారంభాన్ని ప్రకటిస్తూ, మంత్రి -
మన గౌరవ ప్రధాని శ్రీ@ నరేంద్ర మోడీజీ ఇటీవల తన మన్ కి బాత్ ముచ్చట్లలో & ప్రజాస్వామ్యపు అతిపెద్ద పండుగకు దేశం సిద్ధమైన తరుణంలో స్పష్టమైన పిలుపిచ్చారు. # మెరాపెహ్లా వోట్ దేశ్ కెలియే ప్రచారంలో పాల్గొని, యువ ఓటర్లు తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు.
ఇదిగో, # మెరాపెహ్లా వోట్ దేశ్ కెలియే ప్రచార గీతాన్ని వినండి, అందరికీ షేర్ చేయండి.
మన పద్ధతుల్లో & శైలుల్లో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకువెడదాం.
ఈ బాధ్యతను ఆహ్వానిద్దాం, ఆన్‌లైన్‌లో మన సామూహిక గళ శక్తిని వేడుక చేసుకుందాం.
@మైగవ్ఇండియా & కళాశాలల్లో!
ఓటరు చైతన్యం దిశగా ఎన్నికల కమిషన్ ప్రారంభించిన ప్రచారానికి దోహదం చేసే దిశగా జరిగిన కృషి ఈ గీతం. తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రచారం గురించి మాట్లాడుతూ, మొదటిసారి ఓటు వేస్తున్నవారిని ఎన్నికల ప్రక్రియలో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడంపై ప్రచారం దృష్టి పెడుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అన్నారు. శక్తి, సామర్ధ్యాలు, ఉద్వేగభరితమైన తన యువశక్తి పట్ల భారత్ సగర్వంగా ఉందని, ఎన్నికల ప్రక్రియలో యువత ఎంతగా పాల్గొంటే, దేశానికి అంత మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు.
18వ లోక్‌సభ యువత ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తుందని, దీనితో యువత ఓటు విలువ అనేక రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, సినీ పరిశ్రమ, సాహిత్యం, ఇతర వృత్తులకు సంబంధించిన ప్రభావశీలురందరూ ఈ ప్రచారంలో చురుకుగా పాల్గొని, తొలిసారి ఓటర్లకు ప్రేరణను ఇవ్వవలసిందిగా ప్రధాని విజ్ఞప్తి చేశారు.
***
(Release ID: 2009486)
Visitor Counter : 156
Read this release in:
Tamil
,
Assamese
,
Odia
,
Malayalam
,
Khasi
,
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Bengali-TR
,
Punjabi
,
Kannada