గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

మొదటి పే జల్ సర్వేక్షన్ అవార్డులను మార్చి 5న ప్రదానం చేయనున్న రాష్ట్రపతి


జల రంగంలో కనబరిచిన రాష్ట్రాలు, నగరాలకు అవార్డుల ప్రధానం

ఉత్తమ వాటర్ బాడీ, సస్టైనబిలిటీ ఛాంపియన్, రీయూజ్ ఛాంపియన్, వాటర్ క్వాలిటీ, సిటీ సాచ్యురేషన్ తరగతి లో అవార్డులు, ప్రతిష్టాత్మకమైన అమృత్ 2.0 రొటేటింగ్ ట్రోఫీ ఆఫ్ ది ఇయర్ ని ప్రదానం చేయనున్న రాష్ట్రపతి

Posted On: 27 FEB 2024 10:53AM by PIB Hyderabad

గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మొదటి పే జల్ సర్వే అవార్డుల ప్రదానోత్సవం  5 మార్చి 2024 న విజ్ఞాన్ భవన్‌లో జరుగుతుంది. భారత రాష్ట్రపతి శ్రీమతి  ద్రౌపది ముర్ము అవార్డుల ప్రదానోత్సవానికి  అధ్యక్షత వహిస్తారు.  జల సంరక్షణ రంగంలో అత్యుత్తమ ప్రతిభ  కనబరిచిన నగరాలు, రాష్ట్రాలకు అవార్డులు అందజేస్తారు.  

జల సంరక్షణ రంగంలో నగరాలు, రాష్ట్రాలు కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా  130 అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ అవార్డులు ప్రతిష్టాత్మకమైన  పే జల్   గోల్డ్ , సిల్వర్ , బ్రాంజ్ సిటీ అవార్డులతో  సహా వివిధ తరగతుల్లో అవార్డులు అందజేస్తారు.జనాభా కేటగిరీలలో (1 నుండి 10 లక్షలు , 10 నుంచి 40 లక్షలు మరియు 40 లక్షలు ) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాలు/నగరాలకు పే జల్   గోల్డ్ (1 వ ) అందజేస్తారు.ఈ తరగతిలో 2వ స్థానంలో నిలిచిన నగరాలు/రాష్ట్రాలకు  పే జల్  సిల్వర్, 3వ సాధించిన రాష్ట్రాలు/నగరాలకు  పే జల్  బ్రాంజ్ అవార్డు అందిస్తారు.  అవార్డులలో బెస్ట్ వాటర్ బాడీ , సస్టైనబిలిటీ ఛాంపియన్ , రీయూజ్ ఛాంపియన్ , వాటర్ క్వాలిటీ , సిటీ సాచ్యురేషన్, ప్రతిష్టాత్మకమైన అమృత్ 2.0 రొటేటింగ్ ట్రోఫీ ఆఫ్ ది ఇయర్ అవార్డులు  ఉన్నాయి  485 నగరాల్లో అమృత్ 2.0 కింద వివిధ ప్రమాణాలు పరిశీలించిన తర్వాత అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు. అందుబాటు, పరిధి,  ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, గృహాలలో నీటి నాణ్యత, రిజర్వాయర్‌ల సంరక్షణ,ఎస్సిఏడిఏ, / ఫ్లోమీటర్‌ల లభ్యత, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగానికి సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.నగరాలకు 5 స్టార్ గ్రేడ్ నుంచి నో స్టార్ ర్యాంకింగ్ ఇచ్చారు. ముఖ్యమైన ప్రమాణాలపై  పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇస్తారు.ప్రజల అవసరాల మేరకు  పరిశుభ్రమైన నీరు సరఫరా చేసిన నగరాలను గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించి గౌరవిస్తుంది. 

కార్యక్రమంలో 1500 మందికి పైగా అవార్డు గ్రహీతలు, ప్రతినిధులు పాల్గొంటారు. కార్యక్రమంలో అవార్డులను అందించడంతో పాటు అమృత్ మిత్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళా స్వయం సహాయక బృందాలను అమృత్ మిత్ర కార్యక్రమం ద్వారా అనుసంధానం చేస్తారు. అమృత్ 2.0 కింద 2023 నవంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించిన " విమెన్ ఫర్ వాటర్ , వాటర్ ఫర్ విమెన్ " కార్యక్రమం స్పూర్తితో  అమృత్ మిత్ర  కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. పట్టణ నీటి సరఫరా రంగంలో మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రాధాన్యత కల్పించి, గృహాల్లో నీటి వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించి తగిన పాత్ర కల్పించడం ప్రధాన లక్ష్యంగా అమృత్ మిత్ర కార్యక్రమం అమలు జరుగుతుంది. బిల్లులు , సేకరణ , నీటి వృథాను గుర్తించడం,  , ప్లంబింగ్ పనులు , నీటి నాణ్యత నమూనాల సేకరణ,  మౌలిక సదుపాయాల నిర్వహణ వంటి కార్యక్రమాల అమలులో అమృత్ మిత్ర సభ్యులు కీలక పాత్ర పోషిస్తారు. మహిళల్లో యాజమాన్య భావనను కలిగించడం , సాంప్రదాయకంగా పురుష - ఆధిపత్య రంగాల్లో సమగ్రతను, వైవిధ్యాన్ని ప్రోత్సహించడం , అదే సమయంలో కుటుంబాలకు సురక్షితమైన తాగునీటిని అందించడం, లింగ అసమానతలు పరిష్కరించడం, లక్ష్య సాధన ద్వారా  మహిళా స్వయం సహకార బృందాల  సామాజిక - ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం కార్యక్రమాలు అమలు జరుగుతాయి.  అమృత్ 2.0 లక్ష్యాల సాధన,   అవగాహన పెంపుదల,  సమాజంపై సానుకూల ప్రభావం,భవిష్యత్ కార్యక్రమాల అమలులో మహిళా స్వయం సహాయక బృందాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తారు. 

జల వనరుల లభ్యత, సరఫరా వద్ద ఎన్ఏబిఎల్ ల్యాబ్ పరీక్షల ద్వారా ప్రజలకు సురక్షిత మంచినీరు సరఫరా చేయడానికి  పే జల్ సర్వేక్షన్ కార్యక్రమం జరిగింది. జిఐఎస్ ఆధారిత వెబ్ పోర్టల్, జియో టాగింగ్, మౌలిక సదుపాయాల మ్యాపింగ్ ద్వారా సర్వేలో పారదర్శక విధానంలో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించారు. సర్వేలో వెయ్యికి పైగా ప్రాంతాలకు చెంది 5 లక్షల కుటుంబాల నుంచి అభిప్రాయాలు సేకరించి విశ్లేషించారు. 24,000 నీటి నమూనాలు పరీక్షించారు. 

విధాన నిర్ణయాలు తీసుకోవడం, సేవలు నాణ్యత పెంచడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం,ప్రజలకు నీటి వినియోగం, సంరక్షణ అంశాలలో అవగాహన కల్పించడానికి  పే జల్ సర్వేక్షన్ ఫలితాలు స్థానిక సంస్థలకు అవకాశం కల్పిస్తాయి. 

***



(Release ID: 2009354) Visitor Counter : 104