ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దాదాపు గా 41,000 కోట్ల రూపాయల విలువైన 2,000 లకు పైగా రైల్ వే సంబంధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కు శంకుస్థాపన, ప్రారంభోత్సవం లతో పాటు, దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి


పంతొమ్మిది వేల కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో 553 రైల్ వే స్టేశన్ ల పునరభివృద్ధి పనుల కు అమృత్ భారత్ స్టేశన్ స్కీము లో భాగంగా ఆయన శంకుస్థాపన చేశారు

పునరభివృద్ధి పనులు పూర్తి అయిన గోమతి నగర్ రైల్ వేస్టేశను ను ప్రారంభించారు

సుమారు 21,520 కోట్ల రూపాయల ఖర్చు తో దేశవ్యాప్తం గా 1500 రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ లు మరియు అండర్‌పాస్ లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడంతో పాటు దేశ ప్రజల కుఅంకితం ఇచ్చారు

‘‘ఒకే సారి 2,000 ప్రాజెక్టుల ను ప్రారంభిస్తుండడం తో, భారతదేశం రైల్వే సంబంధి మౌలిక సదుపాయాల పరం గా ఒక బృహత్ పరివర్తన కు సాక్షి గా ఉండబోతోంది’’

‘‘ప్రస్తుతంభారతదేశం ఏ కార్యాన్ని తలపెట్టినా,  అపూర్వమైన విస్తృతి తోను వేగం తోనుఅమలు చేస్తున్నది.  మనం పెద్ద కలల ను కంటాం; వాటి ని పండించుకోవడాని కి అలసట అనేదే ఎరుగకుండాశ్రమిస్తాం.  ఈ సంకల్పం ‘వికసిత్ భారత్, వికసిత్ రైల్ వే’ కార్యక్రమం లో కనిపిస్తోంది’’

‘‘వికసిత్ భారత్ ఏవిధం గా కార్యరూపం దాల్చాలి అనేది నిర్ణయించడాని కి యువత కే  ఎక్కువ అధికారాలు ఉన్నాయి’’

‘‘అమృత్ భారత్స్టేశన్ లు ఇటు వికాసానికీ, అటు వారసత్వాని కి సంకేతాలు గా ఉన్న

Posted On: 26 FEB 2024 2:01PM by PIB Hyderabad

దాదాపు గా 2,000 రైల్ వే రంగ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా శంకుస్థాపన, ప్రారంభోత్సవా లు జరపడమే కాకుండా, దేశ ప్రజల కు అంకితం చేశారు కూడా. ఆ ప్రాజెక్టుల విలువ 41,000 కోట్ల రూపాయల కు పైచిలుకు గా ఉంది. 500 రైల్ వే స్టేశను ల లో, 1500 ఇతర స్థలాల లో లక్షల కొద్దీ ప్రజలు గుమికూడి వికసిత్ భారత్, వికసిత్ రైల్ వేస్కార్యక్రమం తో పాలుపంచుకొన్నారు.

 

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు న జరుగుతున్న ఈ కార్యక్రమం న్యూ ఇండియా లో క్రొత్త శ్రమ సంస్కృతి కి ఒక ప్రతీక గా ఉంది అన్నారు. ‘‘ప్రస్తుతం భారతదేశం ఏమి చేస్తున్నప్పటికీ, ఇది వరకు ఎన్నడు ఎరుగనంత వేగం తోను మరియు పెద్ద స్థాయి లోను చేస్తోంది. మనం పెద్ద పెద్ద కలల ను కంటూ, వాటి ని నెరవేర్చుకోవడం కోసం అలుపు అనేదే ఎరుగకుండా పని చేస్తాం. ఈ యొక్క సంకల్పం తాజా గా చేపట్టిన వికసిత్ భారత్, వికసిత్ రైల్ వే’’ కార్యక్రమం లో కనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు. కార్యక్రమాల అమలు తీరు అన్నది ఇటీవల అపూర్వమైనటువంటి గతి ని అందుకొంది అని ఆయన అన్నారు. తాను జమ్ము లో మరియు గుజరాత్ లో గత కొన్ని రోజులు గా పాలుపంచుకొన్న కార్యక్రమాల ను గురించి ఆయన ప్రస్తావించారు. ఆ కార్యక్రమాల లో విద్య రంగానికి మరియు ఆరోగ్య రంగానికి సబంధించినటువంటి మౌలిక సదుపాయాల ను భారీ ఎత్తున విస్తరించే కార్యక్రమాల ను ఆయన ప్రారంభించారు. అదే విధం గా ఈ రోజు న కూడాను 12 రాష్ట్రాల లోని 300 కు పైగా జిల్లాల లో 550 స్టేశన్ లకు సరిక్రొత్త రూపు రేఖల ను ఇవ్వడం జరుగుతున్నది. ఉత్తర్ ప్రదేశ్ లోని గోమతి నగర్ స్టేశను ను గురించి మరియు 1500 కు పైచిలుకు రహదారులు, ఇంకా ఓవర్ బ్రిడ్జి ప్రాజెక్టుల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. న్యూ ఇండియాతాలూకు మహత్వాకాంక్ష మరియు సంకల్పం లు విస్తృతం గాను, వేగం గాను సాకారం అవుతున్నాయని నొక్కి చెప్పారు.

 

సుమారు 40,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టు లు ఈ రోజు న వెలుగు చూస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. దేశం లో 500 రైల్ వే స్టేశన్ లను ఆధునికీకరించేందుకు సంబంధించిన పనుల ను అమృత్ భారత్ స్టేశన్ ప్రాజెక్టు లో భాగం గా కొన్ని నెలల క్రిందట మొదలు పెట్టిన సంగతి ని ఆయన గుర్తు కు తెచ్చారు. నేటి కార్యక్రమం ఈ సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకు పోవడం తో పాటు భారతదేశం యొక్క ప్రగతి జోరు ఏ విధం గా ఉన్నదీ పట్టి చూపుతోంది అని ఆయన అన్నారు. ఈ రోజు న మొదలుపెట్టుకొన్న రైల్ వే ప్రాజెక్టుల కు గాను భారతదేశం పౌరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

 

వికసిత్ భారత్ తాలూకు సిసలైన లబ్ధిదారులు యువతీ యువకులే అయినందువల్ల ఈ రోజు న చేపడుతున్న అభివృద్ధి పథకాల కు గాను భారతదేశం యొక్క యువశక్తి కి ప్రధాన మంత్రి ప్రత్యేకంగా అభినందనల ను తెలియజేశారు. ఈ రోజు న ప్రారంభించుకొంటున్న అభివృద్ధి ప్రాజెక్టు లు లక్షల కొద్దీ యువతీ యువకుల కు ఉద్యోగ అవకాశాల తో పాటు, స్వతంత్రోపాధి అవకాశాల ను కూడా అందిస్తాయి; పాఠశాలల లో చదువుకొంటున్న వారి కి కూడా మేలు చేస్తాయి అని ఆయన అన్నారు. ‘‘వికసిత్ భారత్ ఏ విధం గా రూపుదిద్దుకోవాలో నిర్ణయించేందుకు అత్యధిక స్థాయి అధికారాలు యువత వద్దే ఉన్నాయి’’ అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. వేరు వేరు పోటీలలో యువత పాలుపంచుకోవడం ద్వారా వికసిత్ భారత్ కు సంబంధించి రైల్ వే రంగం యొక్క కలల ను సాకారం చేసినందుకు ప్రధాన మంత్రి తన కృతజ్ఞతల ను వ్యక్తం చేయడం తో పాటు ఇదే సందర్భం లో విజేతల కు అభినందనల ను కూడా తెలియ జేశారు. యువతీ యువకులు కనే కలలు, వారు ఒడిగట్టే కఠోర శ్రమ మరియు ప్రధాన మంత్రి సంకల్పం కలసి వికసిత్ భారత్ తాలూకు హామీ ని నెరవేర్చుతాయి అంటూ ఆయన యువత కు భరోసా ను ఇచ్చారు.

 

త్వరలో ఏర్పాటు అయ్యే అమృత్ భారత్ స్టేశన్ లు ఇటు అభివృద్ధి కి, అటు వారసత్వాని కి చిహ్నాలు గా రూపుదిద్దుకొంటాయి అంటూ ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒడిశా లోని బాలేశ్వర్ స్టేశన్ ను భగవాన్ జగన్నాథ్ దేవాలయం ఇతివృత్తం ఆధారం గా రూపొందించారు అని ఆయన తెలియ జేశారు; అదే మాదిరి గా సిక్కిమ్ లోని రంగ్‌పుర్ స్టేశన్ లో స్థానిక వాస్తు కళ కొలువుదీరుతుందన్నారు. రాజస్థాన్ లోని సాంగనేర్ స్టేశన్ పదహారో శతాబ్ది కి చెందిన హ్యాండ్-బ్లాక్ ప్రింటింగ్ ను పది మంది కి చాటి చెబుతుంది; ఇక తమిళ నాడు లోని కుంబకోణం స్టేశన్ లో చోళ రాజరికం ఛాయల ను చూడవచ్చును; అలాగే అహమదాబాద్ స్టేశన్ లో మొఢేరా సూర్య మందిరం తాలూకు ముద్ర; ద్వారక స్టేశన్ లో ద్వారకాధీశ్ దేవాలయం నుండి ప్రేరణ గా స్వీకరించిన గుర్తులు; ఐటి సిటీ గురుగ్రామ్ స్టేశన్ లో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని తలపించేటటువంటి అలంకరణ లు ఏర్పాటు అవుతాయి అని చెప్పారు. ‘‘ఒక్క మాట లో చెప్పాలంటే అమృత్ భారత్ స్టేశన్ అనేది అది నెలకొనేటటువంటి నగరం యొక్క ప్రత్యేకతల ను ప్రపంచాని కి వివరించేది గా ఉంటుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రైల్ వే స్టేశన్ లు దివ్యాంగుల కు మరియు సీనియర్ సిటిజన్ లకు అనుకూలమైనటువంటి ఏర్పాటుల తో కొలువుదీరనున్నాయి.

 

గడచిన 10 సంవత్సరాల లో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని (‘వికసిత్ భారత్’) ఆవిష్కరించడాని కి ప్రయాసలు జరిగాయి. ప్రత్యేకించి రైల్ వే పరం గా చూసినప్పుడు ఈ మార్పు అనేది ప్రస్ఫుటం గా కనిపిస్తోంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గత 10 ఏళ్ళ లో చూసినట్లయితే గనుక ఒకప్పుడు అసాధ్యం అనుకున్న సదుపాయాలు అన్నీ కూడాను ప్రస్తుతం వాస్తవ రూపాన్ని దాల్చాయి అని ఆయన చెబుతూ, వందే భారత్ వంటి ఆధునికీకరించిన సెమీ-హైస్పీడ్ రైళ్ళు, ‘అమృత్ భారత్’, ‘నమో భారత్’, రైలు మార్గాల ను శరవేగం గా విద్యుదీకరించడం మరియు రైళ్ళ లోపల మరియు రైల్ వే స్టేశన్ ప్లాట్ ఫారమ్ లలో పరిశుభ్రత కు పెద్దపీట వేయడం వంటి అంశాల ను ఉదాహరించారు. భారతీయ రైల్ వేల లో కాపలా లేని రైల్ వే గేటులు సర్వసాధారణం గా ఏ విధం గా ఉండిందీ ఆయన ఒక పోలిక ను చెబుతూ, దీని కి భిన్నం గా ప్రస్తుతం ఓవర్ బ్రిడ్జిలు మరియు అండర్ బ్రిడ్జిలు నిరంతరాయమైనటువంటి, ప్రమాదాల కు ఆస్కారం ఉండనటువంటి విధం గా రైళ్ళ రాకపోకల కు పూచీ పడుతున్నాయి అని వివరించారు. విమానాశ్రయాల లో ఉండే తరహా ఆధునిక సదుపాయాల ను రైల్ వే స్టేశన్ లలో పేద ప్రజల మరియు మధ్య తరగతి వర్గాల కు ప్రస్తుతం అందుబాటు లోకి తీసుకు రావడం జరుగుతోంది అని కూడా ఆయన చెప్పారు.

 

ప్రస్తుత ప్రయాణ సౌలభ్యం పరం గా చూసినప్పుడు పౌరుల కు ప్రబల సాధనం గా రైల్ వే లు మారిపోతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. రైల్ వే లలో చోటుచేసుకొంటున్న పరివర్తన ను గురించి ప్రధాన మంత్రి మరింత వివరం గా మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ వ్యాప్తం గా చూసుకొంటే పదకొండో స్థానం నుండి అయిదో స్థానాని కి ఎగబాకిన కారణంగా రైల్ వే బడ్జెటు లో ఇవాళ భారీ వృద్ధి ఉంది; రైల్ వే బడ్జెటు పదేళ్ళ క్రిందట 45,000 కోట్లు రూపాయలు గా ఉంటే ఇవాళ 2.5 లక్షల కోట్ల రూపాయల కు పెరిగింది అని ఆయన అన్నారు. ‘‘మనం ప్రపంచం లో మూడో అతి పెద్ద ఆర్థిక మహాశక్తి గా మారామా అంటే మన బలం ఏ స్థాయి కి వృద్ధి చెందుతుందో ఒక్కసారి ఊహించండి. ఈ కారణం గా మోదీ సాధ్యమైనంత త్వరగా భారతదేశాన్ని ప్రపంచం లో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా తీర్చిదిద్దడాని కి పాటుపడుతున్నాడు’’ అని ఆయన అన్నారు.

 

కుంభకోణాల కు తావు లేకపోవడం వల్ల మిగిలిన సొమ్ము దే ఈ ఖ్యాతి అని కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెబుతూ, అలా మిగిలిన సొమ్ము ను క్రొత్త రైలు మార్గాల నిర్మాణం లో వేగాన్ని రెట్టింపు చేయడం లోను, జమ్ము కశ్మీర్ నుండి ఈశాన్య ప్రాంత రాష్ట్రాల లోని క్రొత్త ప్రాంతాల కు రైల్ వే ను తీసుకు పోవడాని కి, అలాగే 2,500 కిలో మీటర్ ల మేరకు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పనుల కు వెచ్చించడం జరుగుతోంది అని ఆయన అన్నారు. పన్నుల ను చెల్లించేటటువంటి వ్యక్తుల సొమ్ము లో ప్రతి ఒక్క పైసా ను ప్రయాణికుల సంక్షేమం కోసం వినియోగించడం జరుగుతోంది అని ఆయన అన్నారు. ప్రతి ఒక్క రైల్ వే టికెట్ పైన ప్రభుత్వం ద్వారా 50 శాతం డిస్కౌంట్ లభిస్తోంది అని ఆయన అన్నారు.

 

‘‘బ్యాంకుల లో జమ చేసిన డబ్బు మీద వడ్డీ ని అందుకొనే విధం గానే మౌలిక సదుపాయలపై ఖర్చు పెట్టే ప్రతి ఒక్క పైసా సైతం ఆదాయాన్ని మరియు నూతన ఉద్యోగాల ను సృష్టిస్తుంది’’ అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. క్రొత్త గా రైలు మార్గాల ను వేయడం వల్ల అనేక మంది కి ఉద్యోగ అవకాశాలు.. అది హమాలీ గాని లేదా ఇంజినీర్ గాని.. అంది వస్తాయి అని ఆయన అన్నారు. అనేక పరిశ్రమల లో మరియు దుకాణాల లో ఉదాహరణ కు సిమెంటు, ఉక్కు మరియు రవాణా వంటి రంగాల లో క్రొత్త గా కొలువులు ఏర్పడ్డాయి అని ఆయన చెప్పారు. ‘‘ప్రస్తుతం పెట్టుబడి పెడుతున్న లక్షల కోట్ల రూపాయలు వేల కొద్దీ నౌకరీల కు సంబంధించినటువంటి ఒక హామీ ’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. చిన్న రైతులు, చేతివృత్తిదారులు మరియు విశ్వకర్మ మిత్రులు తయారు చేసే ఉత్పత్తుల కు సంబంధించిన వన్ స్టేశన్, వన్ ప్రోడక్ట్కార్యక్రమాన్ని గురించి కూడా ఆయన మాట్లాడారు. అటువంటి వారు తయారు చేసే ఉత్పత్తుల ను రైల్ వే స్టేశన్ లలో ఏర్పాటు చేసిన వేల కొద్దీ స్టాల్స్ ద్వారా రైల్ వే లు ప్రోత్సహించడం జరుగుతోంది అని ఆయన వివరించారు.

 

‘‘భారతీయ రైల్ వే లు అనేవి కేవలం ప్రయాణికుల కు సంబంధించినటువంటి ఒక సౌకర్యం మాత్రమే కాదు, అది భారతదేశం యొక్క వ్యావసాయిక పురోగతి మరియు పారిశ్రామిక పురోగతి లకు అతిపెద్ద వాహకం గా కూడా ఉంది’’ అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. ఒక రైలు చాలా వేగం గా నడిచిందా అంటే గనుక, అది రవాణా లో ఎక్కువ సమయాన్ని ఆదా చేస్తుంది. పరిశ్రమ కు అయ్యే ఖర్చుల ను కూడా తగ్గిస్తుంది అని ఆయన వివరించారు. అందువల్ల మేక్ ఇన్ ఇండియా’ కు మరియు ‘ఆత్మనిర్భర్ భారత్కు ఉత్తేజాన్ని అందిస్తుంది అన్నారు. భారతదేశం లో ఆధునిక మౌలిక సదుపాయాల ఖ్యాతి ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రపంచం అంతటి లోకి అత్యంత ఆకర్షణీయమైనటువంటి పెట్టుబడి నిలయం గా దేశం మారింది అంటూ ప్రశంసించారు. రాబోయే అయిదు సంవత్సరాల కు దారి ని చూపెట్టడం ద్వారా ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ వేల కొద్దీగా స్టేశన్ లను ఆధునికీకరిస్తే భారతీయ రైల్ వే ల సామర్థ్యం వృద్ధి చెంది, భారీ ఎత్తున పెట్టుబడి సంబంధి క్రాంతి ని తీసుకు వస్తుంది అని ఆయన అన్నారు.

 

పూర్వరంగం

 

ఇంతకు ముందు ప్రధాన మంత్రి రైల్ వే స్టేశన్ లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి తరచు గా నొక్కిచెప్పారు. ఈ ప్ర‌య‌త్నం లో భాగంగా ఒక ప్ర‌ధానమైన ముందంజ అన్నట్లుగా ప్రధాన మంత్రి అమృత్ భార‌త్ స్టేశన్ ప‌థ‌కం లో భాగం గా 553 రైల్ వే స్టేశన్ ల పున‌రభివృద్ధి పనుల కు ప్ర‌ధాన మంత్రి శంకుస్థాప‌న చేశారు. 27 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల లో నెలకొన్న ఈ స్టేశన్ లను 19,000 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో అభివృద్ధి చేస్తున్నారు. ఈ స్టేశను లు నగరం రెండు వైపులను కలుపుతూ ‘సిటీ సెంటర్స్’ వలె పని చేస్తాయి. మొదలైన ఈ స్టేశనుల లో ఆధునిక ప్రయాణికుల కు ఆధునిక సౌకర్యాలు ప్రాప్తిస్తాయి. ఆయా సదుపాయాల లో రూఫ్ ప్లాజా, అందమైన లేండ్‌స్కేపింగ్, ఇంటర్ మోడల్ కనెక్టివిటీ, మెరుగైన ఫసాడ్, పిల్లలు ఆడుకొనేందుకు ఆట స్థలం, కియోస్క్‌లు, ఫూడ్ కోర్ట్‌ ల వంటివి కలిసి ఉన్నాయి. వీటితో పాటే, ఈ స్టేశన్ భవనాల ను పర్యావరణ అనుకూలమైనవిగాను, దివ్యాంగుల కు అనుకూలమైనవిగాను పునరభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ స్టేశన్ భవనాల ఆకృతి ని స్థానిక సంస్కృతి, వారసత్వం మరియు వాస్తుకళ ల నుండి ప్రేరణ ను అందుకొని తీర్చిదిద్దడం జరుగుతుంది.

 

ప్రధాన మంత్రి ఉత్తర్ ప్రదేశ్‌ లోని గోమతి నగర్ స్టేశను ను కూడా ప్రారంభించారు. ఈ స్టేశను ను మొత్తం 385 కోట్ల రూపాయల తో పునరభివృద్ధి పరచడమైంది. భవిష్యత్తు లో పెరిగే ప్రయాణీకుల సంఖ్య ను దృష్టి లో పెట్టుకొని ఈ స్టేశన్‌ లో రాక, పోక ల సౌకర్యాల ను వేరు చేయడమైంది. ఇది నగరం లో రెండు భాగాల ను కలుపుతుంది. ఈ సెంట్రల్ ఎయర్ కండిశన్డ్ స్టేశన్‌ లో ఎయర్‌ కాన్ కోర్స్, రద్దీ కి తావు ఉండని సర్క్యులేశన్, ఫూడ్ కోర్టు మరియు ఎగువ, దిగువ బేస్‌మెంట్‌ లో వాహనాల ను నిలిపి ఉంచడానికి తగినంత స్థలం వంటి ప్రయాణికుల సంబంధి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.

 

 

 

ప్రధాన మంత్రి 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌‌పాస్‌ లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం తో పాటు జాతి కి అంకితం చేశారు. 24 రాష్ట్రాల తో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల లో విస్తరించి ఉన్న ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జిలు మరియు అండర్‌పాస్‌ల మొత్తం వ్యయం దాదాపు 21,520 కోట్ల రూపాయలు గా ఉంది. ఈ ప్రాజెక్టులు రద్దీ ని తగ్గించడంతో పాటు, భద్రత ను, కనెక్టివిటీ ని వృద్ధి చెందింపచేసి, రైలు ప్రయాణం లో సామర్థ్యాన్ని మరియు దక్షత ను కూడా మెరుగుపరచగలవు.

 

 


(Release ID: 2009168) Visitor Counter : 219