సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆధునిక మీడియా రంగం అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన పోర్టల్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్


దిన పత్రికలు /వార్తా పత్రికల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమూల మార్పులు తీసుకురానున్న ప్రెస్ సేవ పోర్టల్

ప్రభుత్వ కార్యక్రమాల పూర్తి సమగ్ర ప్రసారం కోసం పారదర్శక విధానంలో మీడియా ఎంప్యానెల్‌మెంట్ ప్రణాళిక, ఈ బిల్లింగ్ వ్యవస్థ

ప్రభుత్వ వీడియోల ప్రసారం కోసం ఏకీకృత నావిగేట్ భారత్ పోర్టల్ హబ్

కేబుల్ రంగం పటిష్టం కోసం కేంద్రీకృత రిపోజిటరీ గా ఎల్ సి ఓ కోసం జాతీయ రిజిస్టర్

Posted On: 22 FEB 2024 3:32PM by PIB Hyderabad
భారతదేశంలో మీడియా రంగంలో సమూల విప్లవాత్మక మార్పులు తీరుకురవాణానికి అభివృద్ధి చేసిన నాలుగు  పోర్టల్‌లను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ రోజు ప్రారంభించారు.వార్తాపత్రిక ప్రచురణకర్తలు,టీవీ ఛానెల్‌లకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని అందుబాటులోకి తెచ్చి, ప్రభుత్వ సమాచారం  పారదర్శకంగా,సమర్ధంగా ప్రసారం అయ్యేలా చూసి   , అధికారిక ప్రభుత్వ వీడియోలను సులభంగా చూసే అవకాశం కల్పించడం,  స్థానిక కేబుల్ ఆపరేటర్‌ల ( LCOలు)  విస్తృతమైన సమాచారాన్ని సిద్ధం చేయడం లక్ష్యంగా  పోర్టల్‌లను అభివృద్ధి చేశారు. దీనివల్ల భవిష్యతులో కేబుల్ టెలివిజన్ రంగంలో ప్రభుత్వ నియంత్రణ సాధించడానికి అవకాశం కలుగుతుంది. 
ఈ సందర్భంగా మాట్లాడిన  మంత్రి  భారతదేశం పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందన్నారు. అంతర్జాతీయ సంస్థలు దేశంలో  వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయన్నారు  పరివర్తనాత్మక పాలన, ఆర్థిక సంస్కరణలకు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారని దీనివల్ల  భారతదేశంలో సులభతర  వ్యాపార నిర్వహణ సాధ్యమైందన్నారు. దీనివల్ల  వ్యాపారాలు ,కొత్త వ్యవస్థాపకులు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని మంత్రి వివరించారు. దేశంలో  స్టార్టప్ రంగం  అభివృద్ధి చెందిందని , స్టార్టప్‌లు, యునికార్న్‌ల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు. 
సులభతర వ్యాపార నిర్వహణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయని  శ్రీ ఠాకూర్ తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అమలు చేస్తున్న విధానాలకు గుర్తింపు లభించిందన్నారు.  ప్రపంచ బ్యాంకు రూపొందించిన  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ , లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ వంటి అంతర్జాతీయ సూచికల్లో భారతదేశ  ర్యాంకింగ్ మెరుగుపడిందని శ్రీ  ఠాకూర్ అన్నారు. 
ఎంఎస్ఎంఈ లు, చిన్న వ్యాపారాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు అమలు చేస్తోందని శ్రీ ఠాకూర్ తెలిపారు. ఈ-మార్కెట్ ప్లేస్ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం  ఎంఎస్ఎంఈ లు, చిన్న వ్యాపారాల అభివృద్ధికి అవకాశాలు కల్పిస్తుంది అని  శ్రీ ఠాకూర్ వివరించారు.కేవలం ఆర్థిక సంస్కరణల పైనే కాకుండా ప్రజల ఆలోచనా విధానంలో మార్పులు తీసుకువచ్చి  దేశాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలను భాగస్వాములుగా మార్చడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న   విధానం వల్ల  సంపద సృష్టి జరగడమే కాకుండా  ఉపాధి అవకాశాలు పెరిగాయని, ప్రజల  ఆదాయం పెరిగిందన్నారు. ఈ పరిణామం దేశాభివృద్ధి, సంక్షేమానికి దోహదపడుతుందన్నారు. 
అంతకుముందు , సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ  మీడియా రంగంతో ప్రభుత్వ సంబంధాలు బలోపేతం చేయడానికి, వ్యవస్థను   క్రమబద్ధీకరించడానికి , మెరుగుపరచడానికి నూతన విధానాల వల్ల అవకాశం కలుగుతుందన్నారు. పారదర్శకత, ఆవిష్కరణలను ప్రోత్సహించడమే కాకుండా విభాగాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నారు. 
ప్రెస్ సేవా పోర్టల్: 
వార్తాపత్రిక నమోదును క్రమబద్ధీకరించడం కోసం  ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ యాక్ట్ , 2023 ( PRP చట్టం , 2023)  కింద   ప్రెస్ సేవా పోర్టల్ ను ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ( PRGI - పూర్వపు RNI ) అభివృద్ధి చేసింది.  ఆటోమేషన్ ప్రక్రియ ద్వారా  వార్తాపత్రిక నమోదు, ఇతర సంబంధితకార్యక్రమాలు అమలు జరుగుతాయి..  PRP చట్టం 2023 కింద అమలు లోకి వచ్చిన  పోర్టల్ వల్ల వలసవాద చట్టం  PRB చట్టం 1867 కింద  సంక్లిష్టమైన రిజిస్ట్రేషన్ విధానాలు సులభతరం అవుతాయి. 

ప్రెస్ సర్వీస్ పోర్టల్  ముఖ్య లక్షణాలు:

·         ఆన్‌లైన్ దరఖాస్తు : ప్రచురణకర్తలు ఆధార్ ఆధారిత  సంతకాలను ఉపయోగించి టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను అందజేయవచ్చు  

 

·         సంభావ్యత మీటర్ : టైటిల్ లభ్యతను  సూచిస్తుంది .

·         అప్లికేషన్ స్థితి  నిజ సమయ ట్రాకింగ్ : అప్రత్యేకంగా రూపొందించిన డాష్‌బోర్డ్ లో తాజా పరిస్థితి చూడవచ్చు. 

·         అంకితమైన డిఏం  మాడ్యూల్ :  ప్రచురణకర్తల నుంచి అందిన  దరఖాస్తులను కేంద్రీకృత డ్యాష్‌బోర్డ్‌లో పరిశీలించడానికి జిల్లా మేజిస్ట్రేట్‌లను అనుమతిస్తుంది .

నూతన  వెబ్‌సైట్ : పోర్టల్‌తో పాటు వెబ్‌సైట్  సంబంధిత సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి  తెస్తుంది.  వినియోగదారు - స్నేహపూర్వక పరస్పర చర్యల కోసం ఏఐ - ఆధారిత చాట్‌బాట్‌ను కలిగి ఉంటుంది 

ఆటోమేషన్ ప్రయోజనాలు : టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ సేవలు , ఇ - సైన్ సౌకర్యాలతో పేపర్‌లెస్ ప్రక్రియ, , డైరెక్ట్ పేమెంట్ గేట్‌వేల ఇంటిగ్రేషన్ , QR కోడ్ ఆధారిత డిజిటల్ సర్టిఫికేట్లు , ప్రింటింగ్ ప్రెస్‌ల గురించి ఆన్‌లైన్ సమాచారాన్ని అందించడానికి ప్రెస్ కీపర్లు / యజమానుల కోసం మాడ్యూల్ , వార్తాపత్రిక రిజిస్ట్రేషన్‌ల సమర్థవంతమైన ట్రాకింగ్ , చాట్‌బాట్ -ఆధారిత ఇంటరాక్టివ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సాఫ్ట్‌వేర్ ద్వారా వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కారం .

పారదర్శక ఎంప్యానెల్‌మెంట్ మీడియా ప్లానింగ్, ఈబిల్లింగ్ సిస్టమ్: మీడియా ప్లానింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకుని రావడానికి  ప్రెస్ సేవా పోర్టల్‌తో పాటు  సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కోసం పారదర్శక ఎంపానెల్‌మెంట్ , మీడియా ప్లానింగ్ ,ఎబిల్లింగ్ సిస్టమ్‌ను కూడా మంత్రిత్వ శాఖ ప్రవేశపెడుతోంది .  మంత్రిత్వ శాఖలు , విభాగాలు , ప్రభుత్వ సంస్థలు మరియు స్వయం ప్రతిపత్తి సంస్థలకు సమగ్ర 360 డిగ్రీల మీడియా మరియు కమ్యూనికేషన్ పరిష్కారాలను సిబిసి అందిస్తుంది మీడియా ప్లానింగ్ ప్రక్రియలలో పారదర్శకత , సామర్థ్యాన్ని పెంచడానికి రూపొందింది.  మీడియా రంగానికి  పేపర్‌లెస్, ఫేస్‌లెస్ విధానంలో  వ్యాపారాన్ని నిర్వహించడానికి ఎండ్ - టు - ఎండ్ ERP పరిష్కారాన్ని అందిస్తుంది . ముఖ్యమైన లక్షణాలు ఇలా  ఉన్నాయి :

·       సమగ్ర ఎంప్యానెల్‌మెంట్ ప్రాసెస్ : పారదర్శకత , సామర్థ్యాన్ని నిర్ధారించడానికి వార్తాపత్రికలు మ్యాగజైన్‌లు టీవీ రేడియో , డిజిటల్ మీడియా ప్యానెల్ తయారీ కోసం ఆన్‌లైన్ సిస్టమ్ .

·         ఆటోమేటెడ్ మీడియా ప్లానింగ్: కనిష్ట మానవ  జోక్యంతో ఆన్‌లైన్‌లో మీడియా ప్లాన్‌ల అభివృద్ధి  కోసం మెరుగైన సాధనాలు, సౌకర్యాలు. దీనివల్ల  మీడియా ప్లాన్ తయారీ సమయం గణనీయంగా తగ్గుతుంది .

·         స్వయంచాలక బిల్లింగ్ : సులువుగా, పారదర్శక విధానంలో బిల్లు సమర్పణ ధృవీకరణ మరియు చెల్లింపు కోసం ఈ-బిల్లింగ్ వ్యవస్థ  

·         మొబైల్ యాప్ : వ్యవస్థీకృత పర్యవేక్షణ కోసం ట్యాంపర్ ప్రూఫ్ టైమ్‌స్టాంప్ , జియో-ట్యాగింగ్ కార్యాచరణతో భాగస్వాముల కోసం ఒక సమగ్ర మొబైల్ యాప్ .

·         విశ్వసనీయమైన, ఆచరణ సాధ్యమైన  పరిష్కారం: నిజ-సమయ విశ్లేషణాత్మక నివేదికలను రూపొందించడం, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునే సంస్థను ఎంపిక చేయడంలో సహాయపడటానికి పోర్టల్ తాజా సాంకేతికతతో అనుసంధానించబడింది .

·         వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడం : ఆన్‌లైన్ పారదర్శక వ్యవస్థ త్వరిత ఎంప్యానెల్‌మెంట్,అవాంతరాలు లేని వ్యాపార వాతావరణం స్వయంచాలక సమ్మతి, శీఘ్ర చెల్లింపును నిర్ధారిస్తుంది.  వ్యాపారం చేయడం సౌలభ్యాన్ని గణనీయంగా పెంచుతుంది .

 

·         త్వరిత సమస్య పరిష్కారం కోసం అంకితమైన IVR హెల్ప్‌డెస్క్: సిబిసి వినియోగదారులు,  భాగస్వాముల సమస్యల పరిష్కారం, సేవలను అందించడానికి అంకితమైన హెల్ప్‌లైన్ నంబర్‌లతో సిబిసి లో ప్రత్యేక ఐవీఆర్ బృందం ఏర్పాటు అవుతుంది. 

నావిగేట్ ఇండియా పోర్టల్: నేషనల్ వీడియో గేట్‌వే ఆఫ్ ఇండియా
వివిధ భాషల్లో 
ప్రభుత్వ అభివృద్ధి, పౌర సంక్షేమ కార్యక్రమాలను ప్రసారం చేయడానికి  నావిగేట్ భారత్ ' పోర్టల్ అంటే నేషనల్ వీడియో గేట్‌వే ఆఫ్ ఇండియా ను  మంత్రిత్వ శాఖ న్యూ మీడియా వింగ్ అభివృద్ధి చేసింది.  

ఫిల్టర్ ఆధారిత అధునాతన శోధన ఎంపికతో సహా వివిధ ప్రభుత్వ పథకాలు , కార్యక్రమాలు, ప్రచారాలకు సంబంధించిన వీడియోలను గుర్తించడానికి, చూడడానికి, భాగస్వామ్యం చేయడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి  ఒక ఇంటరాక్టివ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో  ' NaViGate India ' ప్రజలకు అధికారం ఇస్తుంది .
పోర్టల్ బహుళ మూలాధారాల నుంచి అధికారిక,విశ్వసనీయ సమాచారాన్ని కనుగొనడంలో సహకరిస్తుంది.  మీడియా , సాధారణ ప్రజల కోసం ఒక వ్యవస్థను  అందిస్తుంది .
దేశంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలందరికి ' నావిగేట్ ఇండియా '  ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విధానాలు అందుబాటులోకి తీసుకు వస్తుంది. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వికసిత భారత్ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయడానికి పోర్టల్ కృషి చేస్తుంది.  
' నావిగేట్ ఇండియా ' పోర్టల్  ముఖ్య లక్షణాలు :
- మంత్రిత్వ శాఖలు , విభాగాలు , పథకాలు , ప్రచారాలకు అంకితమైన పేజీలు
 మంత్రిత్వ శాఖలు , రంగాలు , పథకాలు,ప్రచారాల కోసం ప్రత్యేక పేజీలను 
నావిగేట్ ఇండియా అందిస్తుంది. వీటిలో పొందు పరిచిన  వీడియోలు  వివరణాత్మక వర్ణనలతో ప్రభుత్వ కార్యక్రమాల పూర్తి అవలోకనాన్ని అందిస్తాయి. 

- సులభమైన నావిగేషన్ , శోధన
వినియోగదారులు తమకు కావాల్సిన  వీడియోలను సులభంగా చూడడానికి వీలవుతుంది. 
- వర్గీకరణ, ట్యాగింగ్
సబ్జెక్ట్ / కీ వర్డ్ ద్వారా వీడియోల కోసం శోధించడానికి వినియోగదారులను అనుమతించే వర్గాలు లేదా ట్యాగ్‌లు
- అతుకులు లేని వీడియో ప్లేబ్యాక్ మరియు స్ట్రీమింగ్
ఇబ్బందులు లేని వీక్షణ అనుభవం కోసం వీడియో ప్లేయర్, స్ట్రీమింగ్ సామర్థ్యాలు
- డౌన్‌లోడ్, భాగస్వామ్య ఎంపికలు
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇతరులతో వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి, భాగస్వామ్యం చేయడానికి వినియోగదారులకు అనుమతి ఉంటుంది. 
- అధునాతన శోధన కార్యాచరణ
ఫిల్టర్ - హోమ్ పేజీలో , పోర్టల్‌లోని ప్రతి విభాగంలో అధునాతన శోధన కార్యాచరణ
ఎల్ సి ఓ  కోసం జాతీయ రిజిస్టర్ : కేబుల్ రంగాన్ని బలోపేతం చేయడానికి  స్థానిక కేబుల్ ఆపరేటర్ల కోసం జాతీయ రిజిస్టర్ ( LCOలు ) ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పోస్టాఫీసుల్లో ఉన్న LCOల రిజిస్ట్రేషన్‌ను కేంద్రీకృత రిజిస్ట్రేషన్ విధానంలోకి తీసుకుని వస్తారు.  జాతీయ రిజిస్టర్ ప్రయోజనం కోసం స్థానిక కేబుల్ ఆపరేటర్  సమాచారాన్ని సేకరించడానికి వెబ్ ఫారమ్ అందుబాటులోకి వస్తుంది.  నేషనల్ రిజిస్టర్ ఆన్‌లైన్‌లో కూడా  ఎల్ సి ఓ అందుబాటులో ఉంటుంది.   క్రమం తప్పకుండా నవీకరించబడుతుంది . ఇది  ఎల్ సి ఓ  ల కోసం జాతీయ నమోదు సంఖ్యతో మరింత వ్యవస్థీకృత కేబుల్ రంగానికి  హామీ ఇస్తుంది. బాధ్యతాయుతమైన సేవ కోసం కొత్త విధానాలను రూపొందించడానికి, కేబుల్ ఆపరేటర్‌లకు సౌకర్యాన్ని అందిస్తుంది.  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం సెంట్రల్ పోర్టల్ అభివృద్ధిలో ఉంది .  అభివృద్ధి చెందిన భారతదేశం అవసరాలకు  అనుగుణంగా కేబుల్ రంగానికి కొత్త అవకాశాలను  ఎల్ సి ఓ   నేషనల్ రిజిస్టర్ సదుపాయాలు అందిస్తుంది. 
ఈ కార్యక్రమాలు సమిష్టిగా భారతదేశంలో డిజిటలైజ్డ్, ఆధునికీకరించిన మీడియా రంగం గణనీయమైన పురోగతిని సూచిస్తాయి. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా రంగంలో ఆవిష్కరణలు , పారదర్శకత , పురోగతిని ప్రోత్సహించడానికి కృషి చేస్తోంది. 
నేపథ్యం: 
  ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ యాక్ట్ , 2023  
ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ యాక్ట్ , 2023 ( PRP చట్టం , 2023) కాలానుగుణ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది. భౌతిక సమర్పణల అవసరం లేకుండా టైటిల్ కేటాయింపు, రిజిస్ట్రేషన్ కోసం ఏకీకృత ఆన్‌లైన్ వ్యవస్థను  ప్రవేశపెట్టింది.  ఈ సమర్థవంతమైన విధానం చిన్న, మధ్యస్థ ప్రచురణకర్తలకు ప్రయోజనకరంగా ఉంటుంది.  జిల్లా మేజిస్ట్రేట్‌ల ముందు బహుళ డిక్లరేషన్‌లను దాఖలు చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది. దీని స్థానంలో ప్రచురణకర్తలు ఇప్పుడు ప్రెస్ సేవా పోర్టల్ ద్వారా ఒకే ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించవచ్చు.  గతంలో ఎనిమిది దశలు కలిగి ఉన్న మొత్తం ప్రక్రియను క్రమబద్ధీకరిస్తారు.  ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ , 1867 లో పొందుపరిచిన  కఠినమైన నిబంధనలతో పోల్చితే 2023 చట్టంలో  సమగ్ర మార్పులు అమలు లోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను  ఆధునీకరించి  సరళీకృతం చేయడం ద్వారా వేగంగా ప్రచురణలు ప్రారంభించడం, ప్రస్తుతం  నడుస్తున్న ప్రచురణలకు అనుకూలమైన వాతావరణాన్ని అందించడం లక్ష్యంగా మార్పులు జరిగాయి.  .
PRP చట్టం డిసెంబర్ 2023లో రాష్ట్రపతి ఆమోదం పొందింది.  సమీప భవిష్యత్తులో నోటిఫై చేయబడే అవకాశం ఉంది . ఈ చట్టం ప్రస్తుతం ఉన్న PRB చట్టం 1867 స్థానంలో అమలు లోకి వస్తుంది.  ఈ చట్టం ప్రకారం  రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా కార్యాలయం స్థానంలో ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు అవుతుంది. 
 సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో  ఒక ముఖ్యమైన విభాగంగా 
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ( CBC ) పని చేస్తోంది.  8 డిసెంబర్ 2017 న పూర్వపు డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ ( DAVP ), డైరెక్టరేట్ ఆఫ్ ఫీల్డ్ పబ్లిసిటీ ( DFP ), పాటలు, నాటక విభాగాలను విలీనం చేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ను ఏర్పాటు చేశారు. 

23 ప్రాంతీయ కార్యాలయాలు ( RO లు ) మరియు 148 ఫీల్డ్ ఆఫీస్‌లతో ( FOs ) న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న  సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్  ప్రింట్ , టీవీ , రేడియో , అవుట్‌డోర్ , వెబ్‌సైట్‌లు , సోషల్ మీడియా, వివిధ మీడియా మాధ్యమాల  ద్వారా భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు , విభాగాలు , ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి  కలిగిన సంస్థలకు సేవలు అందిస్తోంది. అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు. సమగ్ర కమ్యూనికేషన్ పరిష్కారాలను అందిస్తుంది .
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సేవలను  మీడియా మరియు కమ్యూనికేషన్ అవసరాల కోసం 360 డిగ్రీల పరిష్కారాల కోసం కేంద్ర ప్రభుత్వం  నిధులు సమకూరుస్తున్న  దాదాపు 1100 మంత్రిత్వ శాఖలు  / విభాగాలు  / పిఎస్‌యులు / సంస్థలు పొందుతున్నాయి. 
ప్రస్తుతం 7000 కంటే ఎక్కువ ప్రచురణకర్తలు ( వార్తాపత్రికలు / మ్యాగజైన్‌లు ), సుమారు 551 టెలివిజన్ ఛానెల్‌లు , 388 ప్రైవేట్ FM ఛానెల్‌లు, దాదాపు 360 కమ్యూనిటీ రేడియో స్టేషన్‌లు  సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్  తో అనుబంధంగా ఉన్నాయి. 

***


(Release ID: 2008241) Visitor Counter : 181