ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంత్ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహరాజ్ జీకి శ్రద్ధాంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 21 FEB 2024 12:47PM by PIB Hyderabad

సంత్ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహరాజ్ జీ సమాధి స్థితి లోకి పోవడం మనందరినీ దు:ఖితులను గా చేసివేసింది. విస్తారమైన జ్ఞానం, అపరిమితమైన కరుణ, మానవాళి ని ఉద్ధరించాలన్న అచంచలమైన నిబద్ధత తో ఆయన జీవితం ఆధ్యాత్మికంగా సుసంపన్నం అయింది. అనేక సందర్భాల లో ఆయన ఆశీస్సులు ప్రాప్తించిన గౌరవాన్ని నేను దక్కించుకొన్నాను. అందువల్ల నాతో సహా లెక్కలేనంతమంది కి మార్గాన్ని ప్రకాశవంతం గా మార్చివేసిన మార్గదర్శకమైనటువంటి కాంతి ని కోల్పోయినట్లుగా నేను తీవ్రమైన లోటు ను అనుభవిస్తున్నాను. ఆయన ఆప్యాయత, అనురాగం మరియు ఆశీస్సులు సుహృద్భావ సంకేతాలు మాత్రమే కాక ఆధ్యాత్మిక శక్తి ని ప్రసరింపజేసి, ఆయనతో సన్నిహితం గా మెలిగిన అదృష్టవంతులందరినీ శక్తివంతం చేసి, స్ఫూర్తిదాయకంగా కూడా నిలచాయి.

 

 

జ్ఞానం, కరుణ, సేవ అనే మూడు పాయల ను కలిగివున్న నది గా పూజ్య ఆచార్య జీ ని ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన సిసలైనటువంటి తపస్వి, ఆయన యొక్క జీవనం భగవాన్ మహావీరుని ఆదర్శాలకు ప్రతీక. ఆయన జీవనం జైన మతం మూల సూత్రాలకు ఉదాహరణగా నిలచింది, దాని

ఆదర్శాలను తన స్వంత చర్యలు, బోధనల ద్వారా ప్రతిబింబింప చేశారు. సకల జీవరాశుల పట్ల ఆయనకున్న శ్రద్ధ జైన మతానికి జీవనం పట్ల ఉన్న అమితమైనటువంటి గౌరవానికి అద్దం పట్టింది. ఆలోచనలో, మాటలో, చేతల్లో నిజాయితీ కి జైన మతం ఇచ్చిన ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తూ ఆయన నిజాయతీ తో కూడిన జీవనాన్ని గడిపారు. ఆయన చాలా సరళమైన జీవనశైలి ని

కూడా అనుసరించారు. జైనమతం, భగవాన్ మహావీర్ జీవనం ల నుండి ప్రపంచం ప్రేరణ ను పొందింది అంటే దానికి ఆయన వంటి మహానుభావులు ఒక కారణం. జైన సముదాయం లో ఆయన ఉన్నత స్థానం లో నిలచినప్పటికీ ఆయన ప్రభావం, పలుకుబడి ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం కాలేదు. మతాల కు, ప్రాంతాల కు, సంస్కృతుల కు అతీతం గా ప్రజలు ఆయన వద్దకు

వచ్చారు. ఆధ్యాత్మిక జాగృతి కి, మరీముఖ్యం గా యువత లో ఆధ్యాత్మిక జాగృతి కి ఆయన అవిశ్రాంతం గా కృషి చేశారు.

 

 

విద్య ఆయన హృదయాని కి చాలా దగ్గరైనటువంటి రంగం గా ఉండింది. విద్యాధర్ (ఆయన చిన్ననాటి పేరు) నుండి విద్యాసాగర్ వరకు ఆయన ప్రయాణం విజ్ఞానాన్ని సంపాదించడం, విజ్ఞానాన్ని అందించడంలో అకుంఠితమైన నిబద్ధత తో కూడుకున్నది. న్యాయమైన, విజ్ఞానవంతమైన

 

 

సమాజాని కి విద్య మూలస్తంభం అని ఆయన ప్రగాఢం గా విశ్వసించారు. వ్యక్తుల ను సశక్తులను చేసే, వారు జీవనాన్ని పరమార్థం తో, సమన్వయంతో గడపడానికి వీలు కల్పించే ఒక సాధనం జ్ఞానం అని ఆయన నమ్మి, ఆ అంశాన్ని వ్యాప్తి లోకి తెచ్చారు. న్యాయమైన మరియు జ్ఞానోదయమైన సమాజానికి విద్య మూలస్తంభమని అతని దృఢ విశ్వాసం. స్వీయ-అధ్యయనానికి మరియు స్వీయ-చైతన్యానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని, అవే నిజమైన జ్ఞానానికి బాటలు అని ఆయన బోధ లు నొక్కిపలికాయి. జీవనపర్యంతం నేర్చుకొంటూనే ఉండడం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలలో నిమగ్నం కావడం చేయాలి అంటూ ఆయన బోధన లు ఆయన యొక్క అనుచరుల కు ఉగ్గుపాల మాదిరి గా రంగరించి పోశాయి.

 

అదే కాలం లో, సాంస్కృతిక విలువలతో ముడిపడి ఉన్న విద్యను మన యువత పొందాలి అని సంత్ శిరోమణి ఆచార్య విద్యాసాగర్ జీ మహరాజ్ జీ ఆకాంక్షించారు. నీటి ఎద్దడి వంటి కీలక సవాళ్లకు పరిష్కారాన్ని కనుగొనలేక పోయామని, గతం నుండి నేర్చుకొన్న పాఠాల కు దూరం గా ఉండడం వల్లే ఈ స్థితి ఏర్పడింది అని ఆయన తరచుగా చెప్పే వారు. నైపుణ్యం, నూతన ఆవిష్కరణల పై దృష్టి సారించేదే సంపూర్ణమైనటువంటి విద్య అని కూడా ఆయన నమ్మారు. భారతదేశం లో మాట్లాడే భిన్న భాషలంటే ఆయనకు అమిత గర్వం గా ఉండేది; యువతరం భారతీయ భాషల ను నేర్చుకోవాలి అంటే ఆయన ప్రోత్సహించారు.

 

 

పూజ్య ఆచార్య జీ స్వయం గా సంస్కృతం లోను, ప్రాకృత భాష లోను మరియు హిందీలోను విస్తృతంగా రచనలు చేశారు. ఒక సాధువుగా ఆయన చేరుకొన్న శిఖరాలు, భూమి మీద ఆయన ఎంత నమ్రం గా ఉండేవారో ఆయన యొక్క ప్రతిష్ఠాత్మక రచన మూకమతి లో స్పష్టం గా కనిపిస్తుంది. నిరాదరణ కు గురి అయినటువంటి వర్గాల వారికి ఆయన తన రచన ల ద్వారా వాణి ని అందించారు.

 

ఆరోగ్య సంరక్షణ రంగం లో కూడాను, పూజ్య ఆచార్య జీ చేసిన కృషి పరివర్తనాత్మకమైంది గా ఉంది. అనేక కార్యక్రమాల లో, విశేషించి పలువురు ఉపేక్షించినటువంటి ప్రాంతాల లో జరిగిన కార్యక్రమాల లో ఆయన పాలుపంచుకున్నారు. ఆరోగ్య సంరక్షణ పట్ల ఆయన విధానం సంపూర్ణమైనదిగా, శారీరికమైన శ్రేయస్సు ను ఆధ్యాత్మిక శ్రేయస్సు తో మిళితం చేసి, తద్ద్వారా ఒక వ్యక్తి యొక్క పూర్తి అవసరాల ను తీర్చేదిగా ఉండింది.

 

సంత్ శిరోమణి ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహరాజ్ జీ దేశ నిర్మాణం పట్ల చూపిన నిబద్ధత ను గురించి రాబోయే తరాలు విస్తృతంగా అధ్యయనం చేయాలి అని నేను ప్రత్యేకం గా విన్నవిస్తున్నాను. పక్షపాత భరితమైనటువంటి ఆలోచనల కు అతీతంగా జాతీయ ప్రయోజనాలపై దృష్టి సారించాలి అని ప్రజలకు ఆయన సదా మనవి చేసే వారు. ప్రజాస్వామ్య ప్రక్రియల లో పాలుపంచుకోవడమే వోటు హక్కు ను వినియోగించుకోవడం అని ఆయన భావించినవందువల్ల వోటు ను వేయడం ముఖ్యం అని ఆయన గట్టి గా వాదించే వారు. ఆయన ఆరోగ్యకరమైనటువంటి మరియు స్వచ్ఛమైనటువంటి రాజకీయాలను సమర్థించారు, విధాన రూపకల్పన అనేది ప్రజా సంక్షేమాన్ని గురించే ఉండాలి అంతే తప్ప స్వీయ ప్రయోజనాల గురించి కాదు అని కూడా ఆయన చెప్పారు.

 

పౌరుల తమ పట్ల, తమ కుటుంబాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల బాధ్యతల విషయంలో తన పౌరుల నిబద్ధత పునాదులపై ఒక బలమైన దేశం నిర్మితమవుతుంది అని ఆయన విశ్వసించారు.

నిజాయితీ, చిత్తశుద్ధి, స్వావలంబన వంటి సుగుణాలను పెంపొందించుకోవాలి అని వ్యక్తులను ఆయన ప్రోత్సహించారు. ఇది న్యాయమైన, దయ కలిగిన, అభివృద్ధి చెందుతున్న సమాజం నిర్మాణానికి అవసరం అని ఆయన భావించారు. మనం వికసిత్ భారత్ నిర్మాణం కోసం కృషి చేస్తున్నందున విధుల కు పెద్ద పీట ను వేయాలి అని పేర్కొనడానికి చాలా ప్రాముఖ్యం ఉన్నది.

 

 

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ క్షీణత విపరీతంగా ఉన్న ఈ కాలంలో, పూజ్య ఆచార్య జీ ప్రకృతి కి కలిగే హాని ని తగ్గించే జీవన విధానాన్ని అనుసరించాటి అంటూ పిలుపునిచ్చారు. అదేవిధంగా, మన ఆర్థిక వ్యవస్థ లో వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైన పాత్రను ఇవ్వాలని ఆయన చెప్పారు. వ్యవసాయాన్ని ఆధునికమైందిగా, సుస్థిరమైందిగా మార్చాలి అని కూడా నొక్కి చెప్పారు. జైలు లో ఉండే వారి ని ఉద్ధరించే దిశ లో ఆయన చేసిన కృషి కూడా చెప్పుకోదగింది.

 

వేల సంవత్సరాలుగా మన దేశం ఇతరులకు వెలుగు ను చూపించి మన సమాజాన్ని బాగు చేసిన మహానుభావులను అందించింది. సాధువులు, సంఘ సంస్కర్తల ఈ మహోన్నత వంశంలో పూజ్య ఆచార్య జీ మహోన్నత వ్యక్తి గా నిలుస్తారు. ఆయన ఏం చేసినా వర్తమానం కోసమే కాకుండా భవిష్యత్తు కోసం కూడా చేసే వారు. గత ఏడాది నవంబరు లో ఛత్తీస్ గఢ్ లోని

డోంగర్ గఢ్ లో చంద్రగిరి జైన మందిరాన్ని సందర్శించే అవకాశం నాకు లభించింది. అప్పటి పూజ్య ఆచార్య జీ సందర్శన నా చివరి సమావేశం అవుతుంది అనే సంగతి ని నేను ఎరుగను. ఆ క్షణాలు చాలా ప్రత్యేకమైనవి. ఆయన నాతో చాలాసేపు మాట్లాడి, దేశానికి సేవ చేయడం లో నేను చేసిన కృషి ని ఆశీర్వదించారు. మన దేశం తీసుకుంటున్న దిశ పట్ల, ప్రపంచ వేదికపై భారతదేశాని కి లభిస్తున్న గౌరవం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాను చేస్తున్న పని ని గురించి మాట్లాడేటప్పుడు ఆయన లో ఉత్సాహం తొణికిసలాడింది. అప్పుడు, ఎప్పుడూ వారి ప్రశాంతమైన చూపు లు, చిరునవ్వు లు చాలు మనలో శాంతియుక్త భావన, ఒక పరమార్ధం వంటివి రగుల్కొనడానికి. ఆయన దీవెన లు మనసు కు ఓదార్పు ను ఇచ్చే ఔషధం వలె, మనలోపల, బయట గల దైవీయమైనటువంటి ఉనికి ని గుర్తు చేసినట్లు అనిపించింది.

 

సంత్ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహరాజ్ జీ గురించి తెలిసినటువంటి వారు, ఆయన బోధనల నుండి, ఆయన జీవనం నుండి ప్రేరణ ను పొందినటువంటి వారు అందరూ ఆయన లేని లోటు ను భరించలేరు. ఏమైనా, ఆయన వల్ల స్ఫూర్తి ని పొందినటువంటి వారి హృదయాల లో ఆయన ఎప్పటికీ నిలచిపోతారు. ఆయన జ్ఞాపకాల ను గౌరవించడం కోసం, ఆయన బోధించిన విలువల ను ఆచరించడానికి మనం కట్టుబడి ఉందాం. ఈ విధం గా, మనం ఒక గొప్ప ఆత్మ కు నివాళి ని అర్పించడమే కాకుండా, మన దేశం కోసం మరియు మన ప్రజల కోసం ఆయన నిర్దేశించుకొన్నటువంటి లక్ష్యాన్ని కూడా ముందుకు తీసుకుపోదాం.

 

 

***


(Release ID: 2007705) Visitor Counter : 130