ప్రధాన మంత్రి కార్యాలయం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను (2024, ఫిబ్రవరి 13-14 తేదీల లో) సందర్శించనున్న ప్రధాన మంత్రి

Posted On: 10 FEB 2024 5:37PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 13 వ తేదీ మరియు 14 వ తేదీ లలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ని ఆధికారికం గా సందర్శించనున్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015 వ సంవత్సరం తరువాత నుండి యుఎఇ ని సందర్శించడం ఇది ఏడో సారి; అలాగే గడచిన ఎనిమిది నెలల కాలం లో చూసినప్పుడు ఇది మూడో సందర్శన అని చెప్పాలి. ప్రధాన మంత్రి తన సందర్శన లో, యుఎఇ యొక్క అధ్యక్షుడు శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ తో ద్వైపాక్షిక సమావేశాల లో పాలుపంచుకోనున్నారు. నేత లు ఇరువురు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా గాఢతరం గా మలచడం, విస్తరించడం తో పాటు బలపరచడం కోసం అనుసరించవలసిన మార్గాల పై చర్చించడం తో పాటుగా పరస్పర హితం ముడిపడి ఉన్న ప్రాంతీయ అంశాలు మరియు అంతర్జాతీయ అంశాల పై వారి వారి అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు తెలియజేసుకోనున్నారు.

 

యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాని మరియు రక్షణ మంత్రి అయినటువంటి శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్తూమ్ తో కూడా ప్రధాన మంత్రి సమావేశం కానున్నారు. శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్తూమ్ ఆహ్వానాన్ని అందుకొని ప్రధాన మంత్రి దుబయి లో జరుగనున్న ‘వరల్డ్ గవర్నమెంట్ సమిట్ 2024 లో గౌరవ అతిథి గా పాల్గొనడం తో పాటు గా ఆ శిఖర సమ్మేళనం లో ఒక విశిష్టమైన కీలకోపన్యాసాన్ని ఇవ్వనున్నారు.

 

అబూ ధాబీ లో ఒకటో హిందూ దేవాలయం అయినటువంటి బిఎపిఎస్ మందిరాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. అబూ ధాబీ లో జాయద్ స్పోర్ట్స్ సిటీ లో జరిగే ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొని, యుఎఇ లోని భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

 

భారతదేశం మరియు యుఎఇ లు బలమైన రాజకీయ , సాంస్కృతిక మరియు ఆర్థిక లంకె ల తో కూడిన స్నేహపూర్ణ, సన్నిహిత, బహుముఖీన సంబంధాలను కలిగివున్నాయి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015 వ సంవత్సరం ఆగస్టు లో యుఎఇ లో జరిపిన చరిత్రాత్మకమైన యాత్ర దరిమిలా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఒక విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయి కి చేరుకొన్నాయి. రెండు దేశాలు ఒక కాంప్రిహెన్సివ్ ఇకానామిక్ పార్ట్‌నర్‌ శిప్ ఎగ్రీమెంట్ (సిఇపిఎ) పైన 2022 ఫిబ్రవరి లో సంతకాలు చేశాయి. అంతేకాకుండా, సరిహద్దుల కు ఆవల జరిగే లావాదేవీల కోసం ఇండియన్ రూపీ మరియు ఎఇడి ల ఉపయోగాన్ని ప్రోత్సహించడం కోసం ఒక లోకల్ కరెన్సీ సెటిల్‌మెంట్ (ఎల్‌సిఎస్) సిస్టమ్ పైన 2023 జులై లో సంతకాలు చేశాయి.

 

ఉభయ దేశాలు పరస్పరం అగ్రగామి వ్యాపార భాగస్వాములు గా ఉన్నాయి; ఈ రెండు దేశాల మధ్య 2022-23 లో సుమారు 85 బిలియన్ యుఎస్ డాలర్ విలువ కలిగిన ద్వైపాక్షిక వ్యాపారం నమోదు అయింది. యుఎఇ 2022-23 లో భారతదేశం లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరం గా అగ్రగామి నాలుగు ఇన్వెస్టర్ దేశాల లో ఒకటి గా కూడా ఉంది.

 

దాదాపు గా 3.5 మిలియన్ మంది తో కూడిన చైతన్యభరితమైన భారతీయ సముదాయం యుఎఇ లో అతి పెద్దది అయినటువంటి నిర్వాసిత సమూహం గా ఉంది. వారు వారి కి ఆతిథేయ దేశం గా ఉన్న యుఎఇ యొక్క అభివృద్ధి లో సకారాత్మకమైన మరియు బహుళ అభినందనల కు పాత్రం అయిన తోడ్పాటు ను అందిస్తూ ఉండడం యుఎఇ తో మనకు గల ఉత్కృష్టమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాల కు ఒక ముఖ్యమైన లంకె గా ఉంటోంది.

 

***



(Release ID: 2005514) Visitor Counter : 58