ప్రధాన మంత్రి కార్యాలయం
‘వికసిత్ భారత్, వికసిత్ గుజరాత్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫిబ్రవరి 10 వ తేదీ నాడు ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మరియు ఇతర గృహ నిర్మాణ పథకాల లో భాగం గా గుజరాత్ లో 1.3 లక్షల కు పైగా గృహాల ప్రారంభం మరియు భూమి పూజ లలో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి
Posted On:
09 FEB 2024 5:41PM by PIB Hyderabad
‘వికసిత్ భారత్, వికసిత్ గుజరాత్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫిబ్రవరి 10 వ తేదీ నాడు మధ్యాహ్నం పూట ఒంటి గంట వేళ లో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి, గుజరాత్ లో ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ (పిఎమ్ఎవై) తదితర గృహ నిర్మాణ పథకాల లో భాగం గా 1.3 లక్షల కు పైగా గృహాల ప్రారంభం మరియు భూమి పూజలలో పాలుపంచుకొంటారు.
గుజరాత్ లో అన్ని జిల్లాల లో 180 కి పైగా ప్రదేశాల లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధాన కార్యక్రమం బనాస్‌కాంఠా జిల్లా లో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తం గా జరిగే ఈ కార్యక్రమం లో గృహ నిర్మాణ పథకాలు సహా వివిధ ప్రముఖ పథకాల యొక్క లబ్ధిదారులు వేల సంఖ్య లో పాల్గొనేందుకు ఆస్కారం ఉంది. ఈ కార్యక్రమం లో గుజరాత్ ముఖ్యమంత్రి, గుజరాత్ ప్రభుత్వం లోని ఇతర మంత్రులు, ఎమ్‌పి లు, ఎమ్ఎల్ఎ లు మరియు స్థానిక ప్రతినిధులు కూడాను హాజరు అవుతారు.
**
(Release ID: 2005106)
Visitor Counter : 101
Read this release in:
Kannada
,
Bengali-TR
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam