ప్రధాన మంత్రి కార్యాలయం

ఒఎన్‌జిసి ఇన్స్ టిట్యూట్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ సీ సర్‌వైవల్ ట్రైనింగ్ సెంటరు ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

Posted On: 06 FEB 2024 2:39PM by PIB Hyderabad

ఒఎన్‌జిసి ఇన్స్‌టిట్యూట్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ సీ సర్‌వైవల్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోవా లో ఈ రోజు న ప్రారంభించారు. జలాల అడుగు భాగం లో ఉన్నప్పుడు ఎదురయ్యే ఆపదల బారి నుండి తప్పించుకొనే అభ్యాసాల కు సంబంధించినటువంటి ఒక వివరణ ను, శిక్షణ కేంద్రం యొక్క ప్రత్యేక ప్రదర్శన విన్యాసాన్ని శ్రీ నరేంద్ర మోదీ తిలకించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ఒఎన్‌జిసి యొక్క సీ సర్‌వైవల్ సెంటర్ ను గోవా లో దేశ ప్రజల కు అంకితం చేసినందుకు సంతోషిస్తున్నాను. సీ సర్‌వైవల్ ట్రైనింగ్ ఇకోసిస్టమ్ లో తనదైన ముద్ర ను భారతదేశం వేయడం లో ఒక మేలు మలుపు గా ఈ అత్యాధునికమైన కేంద్రం ఉంది. అత్యవసర స్థితి ఎదురైనప్పడు స్పందించేందుకు సంబంధించిన కఠినమైన మరియు ప్రబలమైన శిక్షణ ను ఇస్తూ, ఇది అనేక మంది ప్రాణాల ను కాలబద్ధ రీతి లో కాపాడడాని కి పూచీ పడనుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

ఒక ఆధునికమైన సీ సర్‌వైవల్ సెంటర్ ఎందుకు అవసరమో కళ్ళకు కట్టేటటువంటి ఒక వీడియో ను కూడా ప్రధాన మంత్రి శేర్ చేస్తూ, ‘‘మనకు ఒక ఆధునికమైన సీ సర్‌వైవల్ సెంటర్ ఎందుకు కావాలి; అది మన దేశ ప్రజల కు ఏ విధం గా అమిత ప్రయోజనకారి కాగలుగుతుంది అనేది ఇక్కడ గమనించగలరు.’’ అని కూడా పేర్కొన్నారు.

 

ప్రధాన మంత్రి వెంట గోవా ముఖ్య మంత్రి శ్రీ ప్రమోద్ సావంత్ మరియు పెట్రోలియం, చమురు, ఇంకా సహజ వాయువు శాఖ కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింహ్ పురిలతో పాటు ఇతరులు ఉన్నారు.

 

 

ఒఎన్‌జిసి సీ సర్‌వైవల్ సెంటర్

 

ఒఎన్‌జిసి సీ సర్‌వైవల్ సెంటరు ను దాని కోవ కు చెందిన అద్వితీయమైన ఇంటిగ్రేటెడ్ సీ సర్‌వైవల్ ట్రైనింగ్ సెంటరు వలె ప్రపంచ ప్రమాణాల కు తులతూగేటట్లు గా అభివృద్ధి పరచడమైది. దీనిలో ఒక్కో సంవత్సరం లో పదివేల మంది నుండి పదిహేను వేల మంది వరకు శ్రమికుల కు శిక్షణ ను ఇవ్వవచ్చును. దీని ద్వారా సిమ్యులేటెడ్ ఎండ్ కంట్రోల్డ్ హార్శ్ వెదర్ స్థితుల లో అభ్యాసాలు శిక్షణ లో ఉన్న అభ్యర్థుల కు సముద్ర జీవనం తాలూకు నైపుణ్యా లను వృద్ధి చెందింప చేయగలవు. అలాగే, ఒకవేళ ప్రమాదాలు తలెత్తితే వాటి బారి నుండి సురక్షితం గా ఉండే అవకాశాలను కూడా పెంచుకోవచ్చును.



(Release ID: 2003136) Visitor Counter : 91