ప్రధాన మంత్రి కార్యాలయం

గ్రామీస్ లో‘ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్’ పురస్కారాన్ని గెలుచుకొన్నందుకు గాను ఉస్తాద్ శ్రీ జకీర్హుస్సేన్ కు మరియు ఇతరుల కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 05 FEB 2024 2:51PM by PIB Hyderabad

‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్’ కేటగిరి లో ఇచ్చే గ్రామీ అవార్డు ను గెలుచుకొన్నందుకు గాను సంగీతకారులు శ్రీయుతులు ఉస్తాద్ జకీర్ హుస్సేన్, రాకేశ్ చౌరసియా, శంకర్ మహదేవన్, సెల్వగణేశ్. వి మరియు గణేశ్ రాజగోపాలన్ లకు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తెలియ జేశారు.

 

‘శక్తి’ అనే పేరు ను కలిగి ఉన్నటువంటి వారి బ్యాండు ఒక ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూపు గా పనిచేస్తోంది. ‘దిస్ మూమంట్’ కు గాను ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువిం అవార్డు ను ఈ బ్యాండు గెలుచుకొంది.

 

వారి యొక్క అసాధారణమైనటువంటి ప్రతిభ మరియు సంగీతం పట్ల వారికి గల సమర్పణ భావాలు ప్రపంచ వ్యాప్తం గా ఎంతో మంది యొక్క మనస్సుల ను గెలుచుకొని, భారతదేశానికి గర్వకారణం అయ్యాయి అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

సంగీతకారులు శ్రీయుతులు ఉస్తాద్ జకీర్ హుస్సేన్, రాకేశ్ చౌరసియా, శంకర్ మహదేవన్, సెల్వగణేశ్. వి మరియు గణేశ్ రాజగోపాలన్ లారా, గ్రామీస్ లో మీ యొక్క బ్రహ్మాండమైన సాఫల్యానికి గాను ఇవే అభినందన లు. మీ యొక్క అసాధారణమైనటువంటి ప్రతిభ మరియు సంగీతం పట్ల వారికి గల సమర్పణ భావాలు ప్రపంచ వ్యాప్తం గా ఎంతో మంది యొక్క మనస్సుల ను గెలుచుకొన్నాయి. భారతదేశం గర్వపడుతున్నది. ఈ కార్యసాధన లు మీరు పెడుతున్నటువంటి కఠోర శ్రమ కు ఒక ప్రమాణం గా ఉన్నాయి. ఈ కార్యసాధన పెద్దవైన కలల ను కనేందుకు మరియు సంగీతం లో రాణించేందుకు నవ తరం కళాకారుల కు కూడాను ప్రేరణ ను అందించగలదు.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/RT



(Release ID: 2002601) Visitor Counter : 94