ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'అమృత్ కాల్' వ్యూహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్


సకాలంలో తగినంత ఫైనాన్స్, సంబంధిత టెక్నాలజీలు ఎం ఎస్ ఎం ఇ లకు తగిన శిక్షణ- ప్రభుత్వ విధాన ప్రాధాన్యత

'పంచామృత' లక్ష్యాలకు అనుగుణంగా, అధిక మరింత వనరుల-సమర్థవంతమైన ఆర్థిక వృద్ధిని సులభతరం చేయడానికి ; ఇంధన భద్రత కోసం పని చేయనున్న ప్రభుత్వం

తదుపరి తరం సంస్కరణలను చేపట్టడానికి , 'సంస్కరణ, పనితీరు, పరివర్తన' సూత్రం తో రాష్ట్రాలు, భాగస్వాములతో ఏకాభిప్రాయాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం కృషి

Posted On: 01 FEB 2024 12:50PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 'అమృత్ కాల్' కోసం వ్యూహాన్ని ఆవిష్కరించారు. రోజు పార్లమెంటులో 2024-25 మధ్యంతర బడ్జెట్ ను.ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, సూక్ష్మ, చిన్న ,మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ) వృద్ధి చెందడానికిఅంతర్జాతీయంగా పోటీపడటానికి సకాలంలో, తగినంత ఆర్థిక, సంబంధిత సాంకేతికతలు తగిన శిక్షణను అందించడం ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన విధాన ప్రాధాన్యత అని చెప్పారు. ‘వాటి ఎదుగుదలకు దోహదపడేలా రెగ్యులేటరీ వాతావరణాన్ని ఓరియెంటెడ్ చేయడం విధాన సమ్మిళితం లో ఒక ముఖ్యమైన అంశంఅన్నారు.

'పంచామృత' లక్ష్యాలకు అనుగుణంగా, తమ ప్రభుత్వం అధిక, మరింత వనరుల-సమర్థవంతమైన ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి దోహదపడుతుందని మంత్రి అన్నారు. లభ్యత, అందుబాటు చౌక పరంగా ఇంధన భద్రతకు కూడా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.

'సంస్కరణ, పనితీరు ,పరివర్తన' సూత్రం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ప్రభుత్వం తదుపరి తరం సంస్కరణలను చేపడుతుందని, సమర్థవంతమైన అమలు కోసం రాష్ట్రాలు , భాగస్వాములతో ఏకాభిప్రాయాన్ని ఏర్పరుస్తుందని శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు.

వృద్ధిని పెంపొందించడానికి, సుస్థిర పరచడానికి, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధికి , ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు, అందరికీ అవకాశాలను సృష్టించడానికి, వారి సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడే, పెట్టుబడులను శక్తివంతం చేయడానికి, ఆకాంక్షలను నెరవేర్చడానికి వనరుల ఉత్పత్తికి దోహదపడే ఆర్థిక విధానాలను  ప్రభుత్వం అమలు చేస్తుందని ఆమె అన్నారు.

పెట్టుబడుల అవసరాలను తీర్చడానికి పరిమాణం, సామర్థ్యం, నైపుణ్యాలు , నియంత్రణ చట్రం పరంగా ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని సిద్ధం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.

***


(Release ID: 2001720) Visitor Counter : 322