ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రతికూల భౌగోళిక రాజకీయ పరిణామాల వల్ల అనిశ్చితి ఉన్నప్పటికీ స్థితిస్థాపకతను, ఆరోగ్యకరమైన స్థూల ఆర్థిక మౌలికాంశాలను ప్రదర్శిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ
2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండొచ్చని అంచనా
2025-26 నాటికి ఆర్థిక లోటును 4.5 శాతానికి తగ్గించేందుకు ద్రవ్య స్థిరీకరణ బాటలో పయనిస్తున్న భారత్
వచ్చే ఏడాదికి 11.1 శాతం పెరుగుదలతో రూ.11,11,111 కోట్లకు చేరనున్న మూలధన వ్యయ పెట్టుబడి
Posted On:
01 FEB 2024 12:53PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రతికూల భౌగోళిక రాజకీయ పరిణామాలు , విస్తరణ ఆర్థిక చర్యల వల్ల అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రదర్శించింది. ఆరోగ్యకరమైన స్థూల ఆర్థిక మౌలికాంశాలను నిర్వహించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం జాతీయాదాయం తొలి ముందస్తు అంచనాల ప్రకారం, భారత వాస్తవ జి డి పి 7.3 శాతంగా ఉంటుందని అంచనా. 2024-25 మాక్రో ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ స్టేట్ మెంట్ లో ఈ విషయాన్ని పేర్కొన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగం లో వినియోగం , పెట్టుబడులకు బలమైన దేశీయ డిమాండ్, మూలధన వ్యయానికి ప్రభుత్వం నిరంతరం ప్రాధాన్యత ఇవ్వడం జిడిపికి ప్రధాన చోదక శక్తిగా పరిగణించబడుతోంది. సరఫరా వైపు కూడా 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగం లో పరిశ్రమలు, సేవల రంగాలు ప్రధాన వృద్ధి చోదకాలుగా నిలిచాయి. ఈ కాలంలో ప్రధాన అభివృద్ధి చెందిన , అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. ఐఎంఎఫ్ ప్రకారం, మార్కెట్ మారకం రేటు ప్రకారం 2027 నాటికి భారతదేశం అమెరికన్ డాలర్ల లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉంది. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 200 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని అంచనా.
గత నాలుగేళ్లలో మూలధన వ్యయ పెట్టుబడిని భారీగా పెంచడం ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనపై అమిత ప్రభావాన్ని చూపిందని పేర్కొన్న కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ - వచ్చే సంవత్సరానికి మూలధన వ్యయ పెట్టుబడిని 11.1 శాతం పెంపుతో రూ.11,11,111 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇది జీడీపీలో 3.4 శాతంగా ఉంటుందని 2024-25 మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె తెలిపారు. వృద్ధి వేగాన్ని మరింత బలోపేతం చేయడానికి, మూలధన వ్యయాలను పెంచడానికి ప్రభుత్వం రాష్ట్రాలకు యాభై సంవత్సరాల వడ్డీ లేని రుణాల కోసం బిఇ 2023-24 లో రూ .1.3 లక్షల కోట్లు కేటాయించింది. ఈ ఏడాది కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
2014-23 దశాబ్దాన్ని ఎఫ్ డి ఐ ల ప్రవాహానికి స్వర్ణయుగంగా అభివర్ణించిన నిర్మలా సీతారామన్, ఈ కాలంలో పెట్టుబడులు 2005-14తో పోలిస్తే రెట్టింపుగా ఉన్నాయని, ఇది 596 బిలియన్ డాలర్లు అని తెలిపారు. ‘సుస్థిర విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు 'ఫస్ట్-।డెవలప్ ఇండియా' స్ఫూర్తితో విదేశీ భాగస్వాములతో ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నామని‘ తెలిపారు.
స్థూల ఆర్థిక స్థిరత్వం , భారతదేశ బాహ్య స్థితిలో మెరుగుదలలు, ముఖ్యంగా కరెంట్ అకౌంట్ లోటులో గణనీయమైన తగ్గుదల ఇంకా సౌకర్యవంతమైన విదేశీ మారక నిల్వల బఫర్ కారణంగా, మూలధన ప్రవాహాల పునరుద్ధరణ ఫలితంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత రూపాయి లో స్థిరత్వం ఏర్పడింది. భారత్ లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ప్రధానంగా ప్రభుత్వ క్రియాశీల సరఫరా దిశగా చర్యల వల్ల తగ్గుముఖం పట్టాయని స్థూల ఆర్థిక ఫ్రేమ్ వర్క్ స్టేట్ మెంట్ 2024-25 పేర్కొంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.1 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. 2025-26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతం కంటే తక్కువకు తగ్గించడానికి 2021-22 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన విధంగా ద్రవ్య స్థిరీకరణ మార్గంలో కొనసాగుతున్నామని తెలిపారు. ఈ నిబద్ధతకు అనుగుణంగా, ఆర్ ఇ 2023-24 జిడిపికి 5.8 శాతం ద్రవ్యలోటు ను అంచనా వేసింది, ఇది బిఇ 2023-24 కంటే 5.9 శాతం తక్కువ అని, మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ కమ్ ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్ మెంట్ పేర్కొంది.
ఆర్థిక సూచికలు - జిడిపి శాతంగా రోలింగ్ లక్ష్యాలు
|
సవరించిన అంచనాలు
|
బడ్జెట్ అంచనాలు
|
2023-24
|
2024-25
|
1. ఆర్థిక లోటు
|
5.8
|
5.1
|
2. రెవెన్యూ లోటు
|
2.8
|
2.0
|
3. ప్రాథమిక లోటు
|
2.3
|
1.5
|
4. పన్ను ఆదాయం (గరిష్టం
|
11.6
|
11.7
|
5. పన్ను యేతర ఆదాయం
|
1.3
|
1.2
|
6. కేంద్ర ప్రభత్వ రుణం
|
57.8
|
56.8
|
(ఆధారం: మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ కమ్ ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్ మెంట్)
2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యూహాత్మక ప్రాధాన్యతలు:
మొత్తం స్థూల ఆర్థిక సమతుల్యతపై రాజీపడకుండా దేశీయ ఆర్థిక వ్యవస్థను బాహ్య ప్రకంపనలకు మరింత స్థితిస్థాపకంగా మార్చడం, ప్రపంచ ఆర్థిక మాంద్య ప్రమాదాలను తగ్గించడం ప్రభుత్వ ఆర్థిక విధాన వైఖరి. ప్రభుత్వ 2024-25 ఆర్థిక వ్యూహం ఈ క్రింది విస్తృత ఉద్దేశాలపై ఆధారపడి ఉంటుంది:
ఎ. ఊహించని సవాళ్లు ఏవైనా ఎదురైతే వాటిని తట్టుకునేలా మరింత సమ్మిళిత, సుస్థిర, మరింత స్థితిస్థాపక దేశీయ ఆర్థిక వ్యవస్థ వైపు దిశానిర్దేశం చేయడం;
బి. మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగాన్ని కొనసాగించడానికి మూలధన వ్యయం వైపు పెరిగిన వనరులను మళ్లించడం, కేటాయించడం;
సి.మూలధన వ్యయం కోసం రాష్ట్రాల ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ఆర్థిక సమాఖ్య సమగ్ర విధానాన్ని కొనసాగించడం;
డి.ప్రధాన మంత్రి గతి శక్తి సూత్రాలను అవలంబిస్తూ, దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమగ్ర ,సమన్వయ ప్రణాళిక అమలుపై దృష్టి ;
ఇ.పౌరుల దీర్ఘకాలిక సుస్థిర, సమ్మిళిత అభ్యున్నతి కోసం తాగునీరు, గృహనిర్మాణం, పారిశుద్ధ్యం, గ్రీన్ ఎనర్జీ, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి కీలక అభివృద్ధి రంగాల పై వ్యయానికి ప్రాధాన్యమివ్వడం;
ఎఫ్.ఎస్ ఎన్ ఎ/ టి ఎస్ ఎ సిస్టమ్ మొదలైన వాటిని ఉపయోగించడం ద్వారా వనరులను సకాలంలో విడుదల చేయడం ద్వారా నగదు నిర్వహణ సమర్థతను పెంపొందించడం.
***
(Release ID: 2001640)
Visitor Counter : 3714