ఆర్థిక మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడానికి అమృత్ కాల్, కర్తవ్యకాల్‌గా ఉండాలన్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్.
2014 కు ముందు ఉన్న ప్రతి సవాలును ఆర్థిక నిర్వహణ, సుపరిపాలన ద్వారా గట్టెక్కడం జరిగింది :ఆర్ధికమంత్రి.
వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసేందుకు రాష్ట్రాలకు 75,000 కోట్ల రూపాయలు, 50 సంవత్సరాల కాలానికి వడ్డీ రహిత రుణం .
శరవేగంతో పెరుగుతున్న జనాభా, జనసంఖ్యలో వస్తున్నమార్పులకు సంబంధించిన సవాళ్లపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు.
ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల సత్వర అభివృద్ధికి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అండ. వీటికి మెరుగైన ఆర్థిక అవకాశాల కల్పనకు ప్రయత్నం : కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి.
భారతదేశ ప్రగతిలో దేశ తూర్పు ప్రాంతం, ఆ ప్రాంత ప్రజలను శక్తిమంత చోదకులుగా చేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రత్యేక దృష్టి పెడుతుంది.
Posted On:
01 FEB 2024 12:37PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక , కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, 01 ఫిబ్రవరి,2024 న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థికమంత్రి, ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ నాయకత్వంలో వచ్చిన పరివర్తనాత్మక మార్పు గురించి, భారతదేశ ప్రగతిపై దాని ప్రభావం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. వికసిత్ భారత్ దార్శనికత సాకారం కావడానికి అమృత్ కాల్ కాస్తా కర్తవ్యకాల్ కావాలని శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు.
కర్తవ్యకాల్ గా అమృత్ కాల్:
ప్రజలు తమ ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు వీలు కల్పించడంతోపాటు, అత్యధిక వృద్ధితో ఆర్థిక వ్యవస్థ విస్తరణ, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఇచ్చిన సందేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి ఈ సందర్బంగా ప్రస్తావించారు. ‘‘ కొత్త ఆకాంక్షలు, కొత్త స్పృహతో ,నూతన తీర్మానాలతో మనం జాతీయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. దేశం అద్భుత అవకాశాలు, అద్భుత సుసాధ్యతలకు దేశం తలుపులు తెరుస్తోంది’’ అంటూ ప్రధానమంత్రి చేసిన ప్రస్తావనను ఆర్థికమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
2014 సంవత్సరానికి ముందున్న ప్రతి సవాలును, మెరుగైన ఆర్థిక నిర్వహణ, సుపరిపాలనతో అధిగమించగలిగినట్టు తెలిపారు. ఇవన్నీ దేశాన్ని అత్యధిక వృద్ధి పథంలో ఉంచినట్టు ఆమె తెలిపారు. మన సక్రమమైన విధానాలు, మన వాస్తవ ఆకాంక్షలు, తగిన నిర్ణయాలతో దీనిని సాధించగలిగినట్టు ఆమె చెప్పారు.
జులైలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌లో , వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సంబంధించి పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్ ను ప్రవేశపెట్టనున్నట్టు శ్రీమతి సీతారామన్ ప్రకటించారు.
వికసిత్‌భారత్ కోసం రాష్ట్రాలలో సంస్కరణలు:
వికసిత్ భారత్ లక్ష్యం సాకారం కావడానిఇక పలు ప్రగతిదాయక, అభివృద్ధికి వీలు కల్పించే సంస్కరణలు రాష్ట్రాలలో అవసరమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇందుకు 50 సంవత్సరాల పాటు వడ్డీ చెల్లించనవసరం లేని 75000 కోట్ల రూపాయల రుణాన్ని రాష్ట్రాలకు సమకూర్చినట్టు ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంస్కరణలకు మద్దతుగా వీటిని సమకూర్చినట్టు తెలిపారు.
సత్వర జనాభా పెరుగుదల సవాలు అంశంపై ఉన్నతస్థాయి కమిటీ:
దేశంలో సత్వర జనాభా పెరుగుదల, జనాభా నిష్పత్తిలో మార్పులకు సంబంధించిన వివిధ సవాళ్లను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించనున్నట్టు శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఈ కమిటీ ఈసవాళ్లను అధ్యయనం చేసి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అనుగుణంగా తగిన సిఫార్సులు చేస్తుందని తెలిపారు.
ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల అభివృద్ధి:
ఆకాంక్షిత జిల్లాల పథకం కింద, ప్రభుత్వం, ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల సత్వర అభివృద్ధికి రాష్ట్రాలకు మద్దతునిచ్చేందుకు సన్నద్ధంగా ఉందని శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ప్రాంతాలకు మెరుగైన ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా మంత్రి తెలిపారు.
తూర్పు ప్రాంత అభివృద్ధి:
దేశ తూర్పుప్రాంత అభివృద్ధిపై ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆర్థికమంత్రి, దేశతూర్పు ప్రాంతం, ఇక్కడి ప్రజలుదేశ ప్రగతికి శక్తిమంతమైన చోదకశక్తిగా రూపుదిద్దుకునేలా ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్టు తెలిపారు.
***
(Release ID: 2001454)
Visitor Counter : 273