ఆర్థిక మంత్రిత్వ శాఖ

క్రీడల్లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్న యువతను చూసి దేశం గర్వ పడుతోంది.. కేంద్ర ఆర్థిక మంత్రి


యువత కోసం లక్ష కోట్ల కార్పస్ ఏర్పాటుకు బడ్జెట్ లో ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి

సాంకేతిక పరిజ్ఞానం కి ప్రాధాన్యత ఇస్తున్న యువతకు ఇదొక స్వర్ణయుగం: శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 01 FEB 2024 12:42PM by PIB Hyderabad

క్రీడల్లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్న  యువతను చూసి దేశం గర్వ పడుతోందని  కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈరోజు 2024-25 తాత్కాలిక  బడ్జెట్ ను శ్రీమతి సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. యువత కోసం ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, వివిధ రంగాల్లో  యువత సాధించిన విజయాలను తన ప్రసంగంలో ప్రస్తావించిన శ్రీమతి నిర్మలా సీతారామన్  'సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్' విధానంలో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. 

క్రీడల్లో యువత..

ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన విజయాలు వివరించిన శ్రీమతి నిర్మలా సీతారామన్ .
2023లో ఆసియా గేమ్స్, ఆసియా పారా గేమ్స్ లో సాధించిన  అత్యధిక పతకాలు యువత  ఆత్మవిశ్వాస స్థాయికి నిదర్శనమన్నారు.  2023లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ తో చెస్ దిగ్గజం, మన నంబర్ వన్ ర్యాంక్ క్రీడాకారుడు  ప్రజ్ఞానంద గట్టి పోటీ ఇచ్చారని కేంద్ర మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. చెస్ లో భారతదేశం సాధించిన విజయం గురించి ఆమె మాట్లాడుతూ, "2010 లో  దేశంలో 20 కంటే తక్కువ మంది చెస్ గ్రాండ్ మాస్టర్లు ఉండేవారు. ఇప్పుడు భారతదేశంలో 80 మందికి పైగా ఉన్నారు".అని తెలిపారు. 

సాంకేతిక పరిజ్ఞానం కి ప్రాధాన్యత ఇస్తున్న  యువత కోసం  లక్ష కోట్ల కార్పస్ ఫండ్ 
 యాభై ఏళ్ల వడ్డీ లేని రుణాలతో లక్ష కోట్ల రూపాయలతో కార్పస్ ను ఏర్పాటు చేయాలని శ్రీమతి నిర్మలా సీతారామన్  ప్రతిపాదించారు. ఈ కార్పస్ దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రా ఫైనాన్సింగ్ దీర్ఘకాలిక కాలపరిమితి మరియు తక్కువ లేదా సున్నా వడ్డీ రేట్లతో అందిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మన యువతకు ఇది స్వర్ణయుగమని,  యువ శక్తులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించే కార్యక్రమాలు చేపట్టాల్సిన   ఉండాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. కొత్త రంగాల్లో  పరిశోధన, ఆవిష్కరణలను గణనీయంగా పెంచడానికి ప్రైవేట్ రంగానికి ఈ కార్పస్ ఫండ్ ప్రోత్సాహం అందిస్తుందని  శ్రీమతి నిర్మలా సీతారామన్  చెప్పారు. '

***



(Release ID: 2001224) Visitor Counter : 115