ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

16వ ఆర్థిక సంఘం సభ్యుల నియామకం

प्रविष्टि तिथि: 31 JAN 2024 10:12AM by PIB Hyderabad

నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు శ్రీ అరవింద్‌ పనగడియా అధ్యక్షతన, 2023 డిసెంబర్‌ 31న, 16వ ఆర్థిక సంఘం ఏర్పాటైంది.

ఇప్పుడు, భారత రాష్ట్రపతి ఆమోదంతో ఈ కింది సభ్యులు కమిషన్‌లో నియమితులయ్యారు.

 

1.

శ్రీ అజయ్ నారాయణ్ ఝా, 15వ ఆర్థిక సంఘం మాజీ సభ్యుడు, వ్యయ విభాగం మాజీ కార్యదర్శి

పూర్తి కాల సభ్యుడు

2.

శ్రీ అన్నీ జార్జ్ మాథ్యూ, వ్యయ విభాగం మాజీ ప్రత్యేక కార్యదర్శి

పూర్తి కాల సభ్యురాలు

3.

డా. నిరంజన్ రాజాధ్యక్ష, అర్థ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

పూర్తి కాల సభ్యుడు

4.

డా. సౌమ్య కాంతి ఘోష్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు

పరిమిత కాల సభ్యుడు

 

కమిషన్ నియమ, నిబంధనలపై 31.12.2023న ప్రకటన వెలువడింది.

16వ ఆర్థిక సంఘం, తన సిఫార్సులను 2025 అక్టోబర్ 31వ తేదీ లోగా రాష్ట్రపతికి సమర్పించాలి. ఆర్థిక సంఘం సిఫార్సుల కాలావధి 2026 ఏప్రిల్‌ 1న ప్రారంభమై, 2031 మార్చి 31 వరకు ఉంటుంది.

(ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

 

***


(रिलीज़ आईडी: 2000865) आगंतुक पटल : 4827
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada