హోం మంత్రిత్వ శాఖ

సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2024


ఇన్‌స్టిట్యూషనల్ విభాగంలో 2024 సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారానికి ఎంపిక అయిన 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్, ఉత్తరప్రదేశ్ ఎంపిక

విపత్తు నిర్వహణ రంగంలో భారతదేశంలోని వ్యక్తులు , సంస్థలు అందించిన అమూల్యమైన సహకారం మరియు నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవించేందుకు సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ పేరిట వార్షిక అవార్డు ఏర్పాటు ప్రధానమంత్రి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం

Posted On: 23 JAN 2024 10:27AM by PIB Hyderabad

సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2024 అవార్డుకు ఇన్‌స్టిట్యూషనల్ విభాగంలో 2024 సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారానికి  60 పారాచూట్  ఫీల్డ్ హాస్పిటల్, ఉత్తరప్రదేశ్ ఎంపిక అయ్యింది. 

 

విపత్తు నిర్వహణ రంగంలో దేశంలో వ్యక్తులు,సంస్థలు అందించిన అమూల్యమైన సహకారం, నిస్వార్థ సేవలు గుర్తించి గౌరవించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర  ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ పేరిట  వార్షిక అవార్డు ఏర్పాటు చేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23న ప్రతి సంవత్సరం ఈ అవార్డును ప్రకటిస్తారు. ఈ అవార్డు కింద సంస్థలకు అయితే రూ.51 లక్షలు సర్టిఫికెట్‌, వ్యక్తులకు రూ.5 లక్షలు మరియు సర్టిఫికేట్ అందజేస్తారు.

విపత్తు నిర్వహణ, నివారణ, సంసిద్ధత, సహాయ చర్యలు అమలు చేయడంలో హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నేతృత్వంలో దేశంలో  విపత్తు నిర్వహణ రంగం సమర్ధంగా పనిచేస్తూ సేవలు అందిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గింది. విపత్తు సంసిద్ధత చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న శ్రీ అమిత్ షా  విపత్తులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, విపత్తు నివారణ చర్యలు అమలు చేయడానికి ప్రజలు, సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచిస్తున్నారు. 

ఈ సంవత్సరం అవార్డు కోసం, 1 జూలై, 2023 నుంచి నామినేషన్లు స్వీకరించారు.  2024 సంవత్సరానికి సంబంధించిన అవార్డు పథకం ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయబడింది. అవార్డు పథకానికి ప్రతిస్పందనగా, సంస్థలు మరియు వ్యక్తుల నుంచి 245   నామినేషన్లు అందాయి. .

విపత్తు నిర్వహణ రంగంలో 2024 అవార్డు గ్రహీత చేసిన విశిష్ట కృషి ::

ఉత్తర ప్రదేశ్ లో 1942లో 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు అయ్యింది.   సంక్షోభ సమయంలో  సేవలు అందించేందుకు వైమానిక సేవల సౌకర్యం కలిగిన  సాయుధ దళాల  ఏకైక వైమానిక వైద్య సంస్థ గా   60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ గుర్తింపు పొందింది. జాతీయ,, అంతర్జాతీయ స్థాయిలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు శాంతి, యుద్ధ సమయాల్లో మానవతా దృక్పధంతో సేవలు అందించి, సహాయ చర్యలు చేపట్టడానికి 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ సిద్ధంగా ఉంటుంది.  . ఉత్తరాఖండ్ వరదలు (2013), 'మైత్రి' ఆపరేషన్ పేరుతో నేపాల్ భూకంపం (2015), ఆపరేషన్ సముద్ర మైత్రి (2018)లో భాగంగా ఇండోనేషియా సునామీ సమయంలో 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్  వైద్య సహాయం అందించింది.   ఇటీవల, 2023 ఫిబ్రవరిలో టర్కీ మరియు సిరియాలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపాలు సంభవించినప్పుడు  యూనిట్ వేగంగా 99 మంది సభ్యుల బృందాన్ని సమీకరించి తక్షణ సహాయ చర్యలు చేపట్టింది.   టర్కీలో భారతదేశం  మార్గదర్శక స్థాయి -2 వైద్య సదుపాయాన్ని అందించింది.  సహాయ, పునరావాస చర్యలు చేపట్టిన యూనిట్  సర్జరీ, డెంటల్ ట్రీట్మెంట్, ఎక్స్ రే, ల్యాబ్ సౌకర్యాలతో పాటు పలు రకాల వైద్య సేవలు అందించింది.  'ఆపరేషన్ దోస్త్' లో భాగంగా 12 రోజుల వ్యవధిలో 3600 మంది రోగులకు వైద్య సేవలు అందించింది

***



(Release ID: 1998884) Visitor Counter : 204