ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రాణ ప్రతిష్ఠ వేడుక నేపథ్యంలో రామజ్యోతిని వెలిగించండి: పౌరులకు ప్రధాని పిలుపు

प्रविष्टि तिथि: 22 JAN 2024 6:09PM by PIB Hyderabad

యోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక శుభ సందర్భంగా దేశవ్యాప్తంగా రామజ్యోతిని వెలిగించి, శ్రీ రామ్ లల్లాకు స్వాగతం పలకాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు.

ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:

‘‘అయోధ్య క్షేత్రంలో ఇవాళ రామ్ లల్లా తన భవ్య మందిరంలో వెలిశాడు. ఈ పుణ్యకాలంలో దేశ ప్రజలంతా నా వినతి మేరకు ఆ ప్రభువుకు స్వాగతం పలుకుతూ రామజ్యోతిని మీ ఇళ్లలో వెలిగించండి... జై సియారామ్!’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/TS


(रिलीज़ आईडी: 1998687) आगंतुक पटल : 152
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam