ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చంద్రునిమీద సున్నిత ల్యాండింగ్‌పై జ‌పాన్‌కు ప్ర‌ధానమంత్రి అభినంద‌న‌

प्रविष्टि तिथि: 20 JAN 2024 11:00PM by PIB Hyderabad

   పాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘జాక్సా’ చంద్రునిమీద తొలిసారి సున్నిత ల్యాండింగ్‌ చేయడంపై  ప్ర‌ధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడాకు అభినందనలు తెలిపారు. అలాగే అంతరిక్ష అన్వేషణ పరిశోధనలకు సంబంధించి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీ (జాక్సా)తో సంయుక్త కృషికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:

‘‘జపాన్ తొలిసారి చంద్రునిమీద సున్నిత ల్యాండింగ్‌ చేయడంపై ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిడా, ‘జాక్సా’లోని పరిశోధకులకు, నిపుణులకు నా అభినందనలు. అంతరిక్ష పరిశోధనల్లో ‘ఇస్రో-జాక్సా’ సంయుక్త కృషి దిశగా భారత్ సిద్ధంగా ఉంది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/RT


(रिलीज़ आईडी: 1998307) आगंतुक पटल : 198
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam