ప్రధాన మంత్రి కార్యాలయం

వడోదరలోని హర్ని సరస్సు వద్ద పడవ బోల్తా పడి మరణించిన వారికి సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి ఎక్స్ గ్రేషియా ప్రకటన

Posted On: 18 JAN 2024 7:50PM by PIB Hyderabad

వడోదరలోని హర్ని సరస్సు వద్ద పడవ బోల్తా పడిన కారణంగా జరిగిన ప్రాణనష్టంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి 2 లక్షలు మరణించిన ప్రతి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తారు.

ఎక్స్ మాధ్యమంలో ప్రధాని ప్రకటన చేస్తూ... 

"వడోదరలోని హర్ని సరస్సు వద్ద పడవ బోల్తా పడటం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటన బాధ కలిగించింది. ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్థానిక యంత్రాంగం బాధిత వారికి అన్ని విధాలా సహాయాన్ని అందిస్తోంది.  పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి 2 లక్షలు ఎక్స్ గ్రేషియా మరణించిన ప్రతి కుటుంబానికి అందజేయబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 అందిస్తాము" అని ప్రధాని తెలిపారు. 

 


(Release ID: 1997613) Visitor Counter : 94