ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నీతి పత్రం లో చెప్పినట్లుగా గడచిన తొమ్మిదిసంవత్సరాల లో 24.82 కోట్ల ప్రజలు అనేక విధాలైన పేదరికం బారి నుండి బయటపడ్డ నేపథ్యంలో, భారతదేశం లో ప్రతి ఒక్కరి కిసమృద్ధమైన భవిష్యత్తు ను నిర్మించే దిశ లో నిబద్ధత ను గురించి పునరుద్ఘాటించినప్రధాన మంత్రి

Posted On: 15 JAN 2024 7:41PM by PIB Hyderabad

అన్ని రంగాల లో అభివృద్ధి ని సాధించే దిశ లో కృషి చేయడాని కి మరియు భారతదేశం లో ప్రతి ఒక్కరి కి సమృద్ధ భవిష్యత్తు కై పూచీ పడేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకొంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పునరుద్ఘాటించారు.

 

 

బహుళ పార్శ్విక పేదరికం అంశం పై నీతి ఆయోగ్ విడుదల చేసిన ఒక చర్చా పత్రం విషయం లో ఆయన ఈ రోజు న తన వ్యాఖ్యానాన్ని వెల్లడించారు. ఆ పత్రం 2005-06 వ సంవత్సరం నుండి భారతదేశం లో #ఎమ్‌పిఐ లో గణనీయమైనటువంటి క్షీణత నమోదు అయినట్లు పేర్కొంది, ఆ క్షీణత 2013-14 లో 29.17 శాతం నుండి 2022-23 లో 11.28 శాతాని కి తగ్గింది. అంటే 17.89 శాతం మేర కు తగ్గుదల ఉన్నట్లు గా లెక్క తేలిందన్నమాట. తత్ఫలితం గా, 24.82 కోట్ల మంది ప్రజలు గడచిన తొమ్మిది సంవత్సరాల లో బహుళ పార్శ్విక పేదరికం నుండి బయట పడ్డారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో తన అభిప్రాయాన్ని ఈ క్రింది విధం గా వెల్లడించారు:

‘‘ఇది చాలా ప్రోత్సాహకరమైనటువంటి కబురు, సమ్మిళిత వృద్ధి ని పెంచడం మరియు మన ఆర్థిక వ్యవస్థ లో పరివర్తన పూర్వకమైన మార్పుల పైన శ్రద్ధ ను తీసుకోవడం పట్ల మా యొక్క నిబద్ధత కు ఇది అద్దం పడుతున్నది. అన్ని రంగాల ను అభివృద్ధి పరచే దిశ లోను, భారతదేశం లో ప్రతి ఒక్కరి కి ఒక సమృద్ధవంతమైనటువంటి భవిష్యత్తు దక్కేటట్లు చూడడం లోను మేం మా కృషి ని కొనసాగిస్తాం.’’

 

***********

DS/SKS


(Release ID: 1996558) Visitor Counter : 185