ప్రధాన మంత్రి కార్యాలయం
పీఎం - జన్ మన్ కింద పీఎంఏవై (జి) 1 లక్ష మంది లబ్ధిదారులకు మొదటి విడతను విడుదల చేయనున్న ప్రధాన మంత్రి
పీఎం - జన్ మన్ లబ్ధిదారులతో పీఎం సంభాషణ
Posted On:
14 JAN 2024 1:22PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం - జన్ మన్) కింద ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ ( పీఎంఏవై-జి) కి సంబందించిన 1 లక్ష మంది లబ్ధిదారులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 15వ తేదీ నాడు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొదటి విడతను విడుదల చేయనున్నారు. . ఈ సందర్భంగా ప్రధానమంత్రి పీఎం - జన్ మన్ లబ్ధిదారులతో కూడా సంభాషిస్తారు.
చివరి మైలులో ఉన్న చివరి వ్యక్తికి సాధికారత కల్పించే అంత్యోదయ దార్శనికతకు ప్రధానమంత్రి చేసిన ప్రయత్నాలకు అనుగుణంగా, ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాల (పీవీటీజిలు) సామాజిక-ఆర్థిక సంక్షేమం కోసం జన జాతీయ గౌరవ్ దివస్ 15 నవంబర్ 2023న పీఎం - జన్ మన్ ప్రారంభించారు.
పీఎం - జన్ మన్, సుమారు రూ. 24,000 కోట్ల బడ్జెట్‌తో, 9 మంత్రిత్వ శాఖల ద్వారా 11 క్లిష్టమైన జోక్యాలపై దృష్టి సారించింది. అవి... పీవీటీజి గృహాలు, నివాసాలను సురక్షిత గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలతో సంతృప్తిపరచడం ద్వారా పీవీటీజిల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, విద్యుత్, రోడ్డు, టెలికాం కనెక్టివిటీకి మెరుగైన ప్రాప్యత, స్థిరమైన జీవనోపాధి అవకాశాలు.
***
(Release ID: 1996424)
Visitor Counter : 224
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam